అన్వేషించండి

Bigg Boss 8 Telugu: మూడు బెడ్ రూమ్స్, 'యానిమల్' థీమ్... 'బిగ్ బాస్' ఇంట్లో విశేషాలు తెల్సా?

Bigg Boss 8 Telugu House Theme: ప్రతిసారి 'బిగ్ బాస్' ఇంటికి రెడీ చేయడానికి ఒక థీమ్ ఫాలో అవుతారు. ఈసారి యానిమల్ థీమ్ ఫాలో అయినట్టు తెలిసింది. ఆ థీమ్ ఏంటి? బెడ్ రూమ్స్ సంగతి ఏంటి? అనేది తెలుసుకోండి.

యానిమల్ థీమ్... బిగ్ బాస్ ఇంటి కోసం ఈసారి ఫాలో అయిన థీమ్! యానిమల్ అంటే రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ 'యానిమల్' సినిమా థీమ్ కాదు! ప్రకృతిని, ఈ ప్రకృతిలో జీవాలను గుర్తు చేసే రీతిలో 'బిగ్ బాస్' ఇంటిని రెడీ చేశారని తెలిసింది. ఆ విశేషాలు ఏమిటో తెలుసుకోండి. 

మూడు బెడ్ రూమ్స్ ఉన్నాయ్... గోల్డెన్ రూమ్ కూడా!
'బిగ్ బాస్ తెలుగు' సీజన్ 8 ఇంటిలో మొత్తం మూడు బెడ్ రూమ్స్ ఉన్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రేక్షకులకు నచ్చేలా, మాంచి కలర్‌ఫుల్‌గా సెట్ డిజైన్ చేశారట. ఆ మూడింటిలో మొత్తం తొమ్మిది బెడ్స్ ఉన్నాయట. ఈసారి కెప్టెన్ కోసం ఒక బెడ్ రూమ్ కేటాయించే అవకాశం ఉందని తెలిసింది.

మూడు బెడ్ రూమ్స్‌కు మూడు పేర్లు పెట్టారు. ఆ పేర్లు ఏంటో తెలుసా? జీబ్రా, పీకాక్, తూనీగ! ఆల్రెడీ విడుదలైన లాంచ్ ప్రోమో చూస్తే... జీబ్రా కనబడుతుంది. ప్రతిసారి 'బిగ్ బాస్'లో ఒక సీక్రెట్ రూమ్ ఉంటుంది కదా! ఈసారి ఆ విధంగా గోల్డెన్ రూమ్ ఉంటుందని తెలిసింది.  

స్టేజి మీద, ఇంటిలోనూ కంటెస్టెంట్లకు టాస్కులే!
'బిగ్ బాస్' ఇంటిలోకి వెళ్లిన తర్వాత కంటెస్టెంట్లకు టాస్కులు ఇవ్వడం కామన్. బట్, ఫర్ ఏ ఛేంజ్ ఈసారి స్టేజి మీద నుంచి టాస్కులు మొదలు అవుతాయని తెలిసింది. ఇంతకు ముందు ఇంటిలోకి ఒక్కొక్క కంటెస్టెంట్ కాకుండా జంటగా ఇద్దరిని పంపించాలని డిసైడ్ అయ్యారు. అది కూడా ప్రోమోలో చూపించారు. టోటల్ 14 మంది కంటెస్టెంట్లు ఇంటిలోకి వెళతారని తెలిసింది. ఆ కంటెస్టెంట్లు ఎవరో అతి త్వరలో తెలుస్తుంది. 

ఇంటిలో యాటిట్యూడ్, పౌరుషమ్ వంటి కాన్సెప్ట్స్!
'బిగ్ బాస్ 8' తెలుగు టాస్క్ కోసం డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ రెడీ చేశారట. ఆ కాన్సెప్ట్స్‌లో యాటిట్యూడ్, పౌరుషం, లయన్ ప్లాస్మా వంటివి ఉన్నాయట. మరి, ఆ కాన్సెప్ట్స్ ఏంటనేది మరికొన్ని గంటల్లో తెలుస్తుంది.

లాంచ్ ఎపిసోడ్ ట్విస్ట్ ఆల్రెడీ రివీల్ చేసిన బిగ్ బాస్!
'బిగ్ బాస్ 8' తెలుగును మరింత ఇంట్రెస్టింగ్ టాస్కులు, ట్విస్టులతో రన్ చేస్తారని లాంచ్ ఎపిసోడ్ చూస్తే అర్థం అవుతుంది. దర్శకుడు అనిల్ రావిపూడిని తొలి రోజు ఇంటిలోకి పంపించారు బిగ్ బాస్. ఆయన వెళ్లింది సరదాగా ఎంటర్‌టైన్ చేయడానికి కాదు, ఆల్రెడీ ఇంటిలోకి వెళ్లిన కంటెస్టెంట్లలో ఒకరిని బయటకు తీసుకు రావడానికి! తొలి రోజు ఇంటిలోకి వెళ్లిన వారిలో ఒకరిని బయటకు తీసుకు వచ్చి... వాళ్ల బదులు లక్కీ డ్రా ద్వారా మరొకరిని ఇంటిలోకి పంపించడానికి అని స్పష్టం చేశారు.

Also Read: బిగ్ బాస్ 8 ప్రోమో హైలైట్స్... నాని కంటే అతనికే ఎక్కువ మార్కులు వేసిన ప్రియాంక మోహన్, అందాల భామ అసలు దొరకలేదుగా

'బిగ్ బాస్ 8' లాంచ్ ఎపిసోడ్ కోసం న్యాచురల్ స్టార్ నాని, హీరోయిన్ ప్రియాంక మోహన్ (సరిపోదా శనివారం) ప్రమోషన్స్... రానా దగ్గుబాటి, నివేదా థామస్ కూడా వచ్చారు. వాళ్లిద్దరూ '35 చిన్న కథ కాదు' సినిమాను ప్రమోట్ చేశారు. అదీ సంగతి!

Also Read: బిగ్ బాస్ 3లో సందడి చేసిన ఈ అందాల భామ ఎవరో గుర్తు పట్టారా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
Embed widget