Ravindra Jadeja Retirement : రవీంద్ర జడేజా వన్డేల్లో రిటైర్మెంట్ తీసుకుంటున్నాడా? బిగ్ హింట్ ఇచ్చేసిన జడ్డూ
Ravindra Jadeja Retirement : రవీంద్ర జడేజా వన్డేల్లో రిటైర్మెంట్ తీసుకుంటున్నాడా? అవుననేలా సంకేతాలు ఇచ్చేశాడు. రీప్లేస్‌మెంట్ గురించి అతను చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.

Ravindra Jadeja Retirement: భారత్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకరిగా ఉన్న రవీంద్ర జడేజా కెరీర్ ఇప్పుడు ఒక కీలక మలుపులో ఉన్నట్టు కనిపిస్తోంది. గత దశాబ్ధం కాలంగా మూడు ఫార్మాట్‌లలో టీమ్ ఇండియాకు వెన్నెముకగా నిలిచిన ఈ సౌరాష్ట్రస్టార్ తాజాగా తన రిటైర్మెంట్‌పై చేసిన వ్యాఖ్యు సంచలనంగా మారుతున్నాయి.
న్యూజిలాండ్ సిరీస్ జడ్డూకు చేదు అనుభవం
ఇటివల న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో జడేజా ప్రదర్నఆశించిన స్థాయిలో లేదు. ఆల్‌రౌండర్‌గా జట్టులో తన ప్రాధాన్యతను నిరూపించుకోవాల్సిన చోట ఆయన విఫలమయ్యాడు. మూడు మ్యాచ్‌ల్లో కలిపి కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం, అలాగే బ్యాటింగ్‌లో మూడు ఇన్నింగ్స్‌లు ఆడి కనీసం 30 పరుగులు కూడా చేయలేకపోవడం అభిమానులను, విశ్లేషకులను విస్మయానికి గురి చేసింది.
నా సమయం అయిపోయింది: జడేజా
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. అందులో రవీంద్ర జడేజా, వికెట్ కీపర్ బ్యాట్ రిషబ్ పంత్ ఒక కార్యక్రమంలో పాల్గొని సరదాగా ముచ్చటించారు. ఆ సమయంలో వారిద్దరినీ మీరు ఎప్పుడైనా సినిమాల్లో నటించాలని అనుకున్నారా అని ప్రశ్నించగా పంత్ సమాధానమిస్తూ.... నేను ఇంకా దాని గురించి ఆలోచించలేదు. నన్ను క్రికెట్ ఆడనివ్వండి, జడేజా భాయ్ గురించి నాకు తెలియదు. అని సరదాగా వ్యాఖ్యానించారు.
దీనికి జడేజా స్పందిస్తూ నవ్వుతూనే ఒక బాంబు పేల్చారు. అంటే నా సమయం అయిపోయిందని పరోక్షంగా చెబుతున్నాడు అని జడేజా వ్యాఖ్యానించారు. పైకి ఇది నవ్వుతూ అన్న మాట అయినప్పటికీ అంతర్జాతీయ క్రికెట్‌లో తన ప్రస్థానం ముగింపు దశకు చేరుకుదని సంకేతాన్ని ఆయన ఇచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే 2024 టీ 20 ప్రపంచ కప్ తర్వాత జడేజా టీ 20 ఇంటర్నేషనల ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అతను ప్రస్తుతం ఆయన కేవలం టెస్టు, వన్డే క్రికెట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు.
వన్డేల్లో జడేజా స్థానంలో ఇద్దరు ఆటగాళ్ళు
జడేజా తర్వాత వాషింగ్టన్ సుందర్ లేదా అక్షర్ పటేల్‌లలో ఒకరు వన్డేలలో అతని స్థానంలో రావచ్చు. అయితే, ఇద్దరు ఆటగాళ్లు చాలా కాలంగా భారతదేశం కోసం వన్డే క్రికెట్ ఆడుతున్నారు. అక్షర్ ఇప్పటివరకు 71 వన్డేలు, వాషింగ్టన్ 29 వన్డే మ్యాచ్‌లు ఆడారు.
Also Read: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకు డిమోషన్? జీతాలు తగ్గించనున్న బీసీసీఐ!
Before You Go
Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
ట్రెండింగ్ వార్తలు



















