Bigg Boss 8 Telugu Contestant Sonia Akula: ఆర్జీవీ 'దిశా ఎన్కౌంటర్' హీరోయిన్, కరీంనగర్ రైతు బిడ్డ... 'బిగ్ బాస్ 8' కంటెస్టెంట్ సోనియా ఆకుల బ్యాగ్రౌండ్ తెలుసా?
Sonia Akula Background: 'బిగ్ బాస్ 8'ఓ అడుగు పెట్టిన తెలంగాణ అమ్మాయి సోనియా ఆకుల. ఆమెది కరీంనగర్. సినిమాల్లో కథానాయికగా నటించింది. అసలు ఈ అమ్మాయి బ్యాగ్రౌండ్ ఏమిటి? ఎక్కడ నుంచి వచ్చింది? అంటే...

'బిగ్ బాస్' అంటే గ్లామర్ కంపల్సరీ. ఇప్పటి వరకు జరిగిన ఏడు సీజన్స్, ఓటీటీలో వచ్చిన రియాలిటీ షోలో చూసినా సరే అందాల భామలకు లోటు ఉండదు. ప్రతి సీజన్‌లో ఒక హీరోయిన్ ఉండేలా చూశారు. ఈసారీ 'బిగ్ బాస్' ఇంటిలో ఓ అందాల భామ అడుగు పెట్టింది. ఆమె పేరు... సోనియా ఆకుల. ఈ అమ్మాయిది తెలంగాణ. హీరోయిన్ మాత్రమే కాదు... సమాజ సేవకురాలు కూడా! మరి, ఆమె బ్యాగ్రౌండ్ ఏమిటో తెలుసుకుందామా?
వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సోనియా!
సోనియా ఆకుల స్వస్థలం తెలంగాణ గడ్డ కరీంనగర్‌లోని మంతని. ఇప్పుడు అది పెద్దపల్లి జిల్లాలోకి వస్తుంది. ఆమె తల్లి హోమ్ మేకర్. తన చిన్నతనంలో ఇంట్లో తల్లి చీరలు వంటివి అమ్మేవారని సోనియా ఆకుల తెలిపారు. ఆమె తండ్రి రైతు. తన చిన్నతనం నుంచి వ్యయసాయం చేసేవారని చెప్పుకొచ్చారు. తన బాల్యంలో తండ్రి దగ్గర ట్రాక్టర్ ఉండేదని, ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నా... అంత భారీ ఎత్తున చేయడం లేదన్నారు.
ఇద్దరు అన్నయ్యలా తర్వాత ముద్దుల చెల్లెలు!
సోనియా ఆకుల కంటే ముందు కుటుంబంలో ఇద్దరు మగ పిల్లలు జన్మించారు. ఆ ఇద్దరు అన్నయ్యకు ముద్దుల చెల్లెలు సోనియా. ఆమె స్కూల్ లైఫ్ అంతా మంతని ప్రాంతంలో జరిగింది. పదో తరగతి తర్వాత ఇంటర్మీడియెట్ కోసం హైదరాబాద్ వచ్చారు. ఆవిడ బీటెక్ గ్రాడ్యుయేట్. కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పట్టా ఆవిడ పట్టుకున్నారు. ఆవిడ న్యాయ వ్యవస్థలోనూ డిగ్రీ పట్టా అందుకున్నారు. ఎల్‌ఎల్‌బి చేసినప్పటికీ... ప్రాక్టీస్ అయితే చేయలేదు.
స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న సోనియా ఆకుల!
సోనియా ఆకులకు సమాజ సేవ అంటే చాలా ఇష్టం. బీటెక్ చదివే రోజుల నుంచి పేద పిల్లలకు ఫ్రీగా ట్యూషన్ చెప్పేదానిని అని తెలిపారు. అయితే... తన సేవా కార్యక్రమాలు విస్తరించడానికి సోలోగా చేస్తే కష్టం అని గ్రహించి, 'యాక్షనీర్ ఫర్ సొసైటల్ అడ్వాన్స్ మెంట్' పేరుతో ఎన్జీవో ఫౌండేషన్ స్టార్ట్ చేశానని తెలిపారు. 'విరాట్ ఫౌండేషన్'కు తాను కో ఫౌండర్ అని పేర్కొన్నారు.
Also Read: మూడు బెడ్ రూమ్స్, 'యానిమల్' థీమ్... 'బిగ్ బాస్' ఇంట్లో విశేషాలు తెల్సా?
రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో నటించిన సోనియా ఆకుల
దిశా ఎన్కౌంటర్ మీద సంచలన దర్శకులు రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా తీసిన సంగతి తెలిసిందే. అందులో సోనియా ఆకుల నటించారు. అయితే... ఆ సినిమా 'ఆశా ఎన్కౌంటర్' పేరుతో విడుదల అయ్యింది. అంతకు ముందు జీవన్ రెడ్డి దర్శకత్వం వహించిన 'జార్జ్ రెడ్డి'లో ఓ కీలక పాత్ర చేశారు. అది ఆవిడ తొలి సినిమా. అందులో జార్జ్ రెడ్డి సిస్టర్ పాత్రలో కనిపించారు. 'జార్జ్ రెడ్డి', 'ఆశా ఎన్కౌంటర్' మధ్య 'కరోనా వైరస్' పేరుతో రూపొందిన సినిమాలో సందడి చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

