Chaitanya Thanks Sam: సమంతకు థాంక్స్ చెప్పిన చైతూ.. ఇప్పటికైనా మీకు అర్థమవుతోందా..!
చై-సామ్ మధ్య ఏదో జరిగిందంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పటికైనా వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పడినట్టేనా..
![Chaitanya Thanks Sam: సమంతకు థాంక్స్ చెప్పిన చైతూ.. ఇప్పటికైనా మీకు అర్థమవుతోందా..! Tollywood Actor Naga Chaitanya Thanks To Wife Samantha Akkineni Know In Details Chaitanya Thanks Sam: సమంతకు థాంక్స్ చెప్పిన చైతూ.. ఇప్పటికైనా మీకు అర్థమవుతోందా..!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/14/2baf73490e237a2d0854c234088d96cc_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
‘లవ్ స్టోరీ’ సినిమా సందర్భంగా ట్వీట్లు చేసుకుంటున్న నాగచైతన్య-సమంత.. తమ రియల్ ‘లవ్ స్టోరీ’ ఇప్పటికీ ఎప్పటికీ కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చినట్టేనా? అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జోడిగా నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. సెప్టెంబర్ 24న థియేటర్లలో సందడి చేయనున్న ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఎమోషనల్, లవ్, సెంటిమెంట్ ఇలా అన్ని రకాల భావోద్వేగాలతో ఉన్న ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఎంతమంది చెప్పినా తనవాళ్లు మెచ్చుకుంటే ఆ కిక్కే వేరు. ప్రస్తుతం నాగచైతన్య ఆ ఆనందంలోనే ‘‘థ్యాంక్యూ సామ్’’ అని ట్వీట్ చేశాడు.
Thanks Sam !! https://t.co/XDI4gAOjmR
— chaitanya akkineni (@chay_akkineni) September 14, 2021
ఇంతకీ సమంత ఏమందంటే.. సినిమా విడుదలపై చైతూ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేసిన ఆమె ‘‘ఈ సినిమా కచ్చితంగా విజయవంతమవుతుంది(విన్నర్ అని తెలుపుతూ). చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్’ అంటూ క్యాప్షన్ జోడించింది.
WINNER!!
— S (@Samanthaprabhu2) September 13, 2021
All the very best to the team @Sai_Pallavi92 🤗.. #LoveStoryTrailer https://t.co/nt9rzTc3lY
ఒకరి సినిమా గురించి మరొకరు ప్రశంసించుకోవడం వరకూ సరే కానీ.. ఈ మధ్య కాలంలో ఇద్దరి బంధంపై ట్రోల్స్ ఓ రేంజ్‌లో నడుస్తున్నాయి. తన పేరులో ఉన్న అక్కినేని ఇనీషియల్‌ను సామ్ ట్విట్టర్ నుంచి తొలగించడంతో సినీప్రియుల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఆ తర్వాత గోవా ట్రిప్ కూడా సమంత ఒంటరిగా వెళ్లడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. వీటిని పెద్దగా పట్టించుకోని సామ్.. ఈ మధ్యే ఎంగేజ్మెంట్ రింగ్ పెట్టుకున్న ఫోటోస్ పోస్ట్ చేసింది. ఇప్పుడు చైతూ సినిమా విడుదల సందర్భంగా రియాక్టైంది. చైతూ కూడా వెంటనే థ్యాంక్స్ చెప్పాడు. అంటే ఎవరెన్ని రూమర్స్ క్రియేట్ చేసినా తమ బంధం అలాగే ఉంటుందని ఇద్దరూ చెప్పకనే చెప్పారని అర్థం చేసుకోవాలన్నమాట. మరి ఇప్పటికైనా సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చకు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి. మరోవైపు సినిమా ప్రమోషన్లో భాగంగా చైతూ క్లారిటీ ఇస్తాడంటున్నారు అక్కినేని అభిమానులు.
Also Read: నేడు ఈఏపీసెట్ అగ్రి, ఫార్మసీ విభాగాల ఫలితాలు.. రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇదే
Also Read: తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల గొడవ ! ఇంతకీ ఎవరికి ఎవరు బాకీ ఉన్నారు !?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)