Devara OTT Global Release: నేషనల్ కాదు... ఎన్టీఆర్ స్టార్‌డమ్ ఇంటర్నేషనల్ - నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఫారిన్ లాంగ్వేజెస్‌లో 'దేవర' స్ట్రీమింగ్
Devara OTT Release Netflix: మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్‌డమ్ నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ లెవల్‌కు చేరింది. ఇప్పుడు 'దేవర' సినిమా ఫారిన్ లాంగ్వేజెస్‌లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.
మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) రీసెంట్ బ్లాక్ బస్టర్ సినిమా 'దేవర' (Devara Part 1 OTT Streaming) ఇప్పుడు ఫారిన్ ప్రేక్షకుల ముందుకు వెళ్ళింది. ఆయన స్టార్ డమ్ నేషనల్ కాదు... ఇంటర్నేషనల్ లెవెల్ చేరుకుంది. విదేశాలలో ఎన్టీఆర్ అభిమానులకు ఇంటర్నేషనల్ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. అది ఏమిటంటే?
ఈ నాలుగు ఫారిన్ లాంగ్వేజెస్‌లో దేవర స్ట్రీమింగ్
నవంబర్ 8వ తేదీన తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 'దేవర పార్ట్ 1' సినిమా స్ట్రీమింగ్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదికలో మొదలైంది. అతి త్వరలో హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ కూడా ప్రారంభం కానుంది. అయితే... అనూహ్యంగా అందరికీ ఓటీటీ వేదిక ఒక సర్ప్రైజ్ ఇచ్చింది. ఇంగ్లీష్, కొరియన్, స్పానిష్, బ్రెజిలియన్... ఈ నాలుగు ఫారిన్ లాంగ్వేజెస్‌లో 'దేవర' సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఎన్టీఆర్ అభిమానులతో పాటు మిగతా భాషల ప్రేక్షకులకు అది ఒక సడన్ సర్ప్రైజ్.
'ఆర్ఆర్ఆర్: రణం రౌద్రం రుద్రం' సినిమాతో ఎన్టీఆర్ ఇమేజ్ ఇంటర్నేషనల్ లెవెల్ చేరుకుంది. ఆ సినిమాకు హాలీవుడ్ దర్శక - నిర్మాతలతో పాటు అక్కడ ప్రేక్షకుల నుంచి సూపర్ డూపర్ హిట్ టాక్, అప్రిసియేషన్ లభించిన సంగతి తెలిసిందే. 'నాటు నాటు...' పాటకు ఆస్కార్ వచ్చిన విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందువల్ల, విదేశీ ప్రేక్షకులకు ఎన్టీఆర్ తెలుసు. ఆయన సినిమా కావడంతో 'దేవర'ను చూడటానికి ఫారిన్ ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అతి త్వరలో ఇంటర్నేషనల్ స్థాయిలో ఓటీటీలో ఈ సినిమా ట్రెండింగ్ కావడం గ్యారెంటీ అనిపిస్తోంది.
Also Read: క్రిస్మస్ బరిలో ఫ్లాప్స్ నుంచి బయట పడేది ఎవరు? హిట్టు కొట్టేది ఎవరు? - అన్నీ క్రేజీ సినిమాలే
ఎన్టీఆర్ రెండు సినిమాలు పూర్తి చేసిన తర్వాత దేవర సీక్వెల్
Jr NTR Upcoming Movies: ప్రస్తుతం హిందీ సినిమా 'వార్ 2' చిత్రీకరణ చేస్తున్నారు ఎన్టీఆర్. గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ అని పేరు తెచ్చుకున్న హృతిక్ రోషన్, ఆయన కలిసి నటిస్తున్న చిత్రం ఇది. దీని తర్వాత 'కేజిఎఫ్', 'సలార్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరొక పాన్ ఇండియా సినిమా చేయనున్నారు. దానికి 'డ్రాగన్' అని టైటిల్ ఖరారు చేశారని తెలిసింది. ఆ రెండు సినిమాలు పూర్తి అయ్యాక కొరటాల శివ దర్శకత్వంలో దేవర సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.
Also Read: బాలకృష్ణ సినిమాలో మరో బాలీవుడ్ నటుడు... విలనా? ఇంపార్టెంట్ క్యారెక్టరా?
'దేవర' సినిమాలో ఎన్టీఆర్ సరసన అతిలోక సుందరి శ్రీ దేవి కుమార్తె జాన్వీ కపూర్ నటించారు. తెలుగులో ఆమెకు తొలి సినిమా ఇది. టాలీవుడ్ డెబ్యూ జాన్వికి మంచి పేరు తీసుకు వచ్చింది. అయితే సినిమాలో ఆమె పాత్ర నిడివి తక్కువ ఉంటుంది. 'దేవర పార్ట్ 2'లో ఎన్టీఆర్, జాన్వి కపూర్ మధ్య ప్రేమ కథ ఎక్కువ ఉంటుంది అని దర్శకుడు కొరటాల శివ చెబుతున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ నటుడు, కరీనా కపూర్ భర్త సైఫ్ అలీ ఖాన్ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యారు. ఆయనకు కూడా మంచి పేరు వచ్చింది. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అజయ్, తారక్ పొన్నప్ప తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు.