అన్వేషించండి

Harish Rao Challenges Revanth Reddy: SLBCపై నిరూపిస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా! సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్

SLBC Tunnel Project | ఇటీవల ప్రమాదం జరిగిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టులో బీఆర్ఎస్ హయాంలో ఏ పనులు జరగలేదని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిరూపిస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానన్నారు.

Harish Rao challenges CM Revanth Reddy over SLBC Tunnel Project | హైదరాబాద్: బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం (SLBC Tunnel) ప్రాజెక్టులో ఎలాంటి పనులు జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాజెక్టులో పనులు జరగలేదని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తానని.. నిరూపించలేకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తావా అని రేవంత్ రెడ్డికి ఆయన సవాల్ విసిరారు. ఓ వైపు కులగణనపై గందరగోళం సృష్టిస్తూ అన్ని సామాజిక వర్గాల మధ్య చిచ్చుపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. 10 రోజులు గడుస్తున్నా టన్నెల్ లోపల గల్లంతైన వారి జాడ సైతం కనిపెట్టలేకపోవడం దారుణం అన్నారు. 

కేసీఆర్ హయాంలో తెలంగాణలో లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించారు. కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిచేసి సాగునీరు అందించాం. పలు ప్రాజెక్టుల ద్వారా నీటిని ఎత్తిపోసి లక్షల ఎకరాలు తడిపిన ఘనత కేసీఆర్ దేనని హరీష్ రావు, కేటీఆర్ చెబుతున్నారు. కేసీఆర్ ప్రతిష్ట ను దెబ్బతీసేందుకే రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పరిశీలించిన రేవంత్, బీఆర్ఎస్ పాలకులపై విమర్శలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వెళ్లి పరిశీలించారు. రెస్క్యూ టీమ్ ను, అధికారులను సహాయక చర్యల పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే రోబోలను రంగంలోకి దించాలని రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. గత బీఆర్ఎస్ హయాంలో దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగిందని, ఉత్తర తెలంగాణతో పోల్చితే ఇక్కడి ప్రజలకు అన్యాయం చేశారని ఆరోపించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఏపీకి కృష్ణా జలాల తరలింపుపై సంతకాలు చేశారు.. కానీ ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పూర్తి చేసి నల్గొండకు సాగునీరు, తాగునీరు ఇవ్వడాన్ని నిర్లక్ష్యం చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పాలకులు చేసిన పాప ఫలితమే ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదమని రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ తీవ్రంగా స్పందించారు. పాలన చేతకాక తమపై విమర్శలు చేయడం సరికాదని రేవంత్ రెడ్డికి హితవు పలికారు.

రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మండిపాటు..

‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది. SLBC టన్నెల్ లో ప్రమాదం జరిగిన తరువాత ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆరు రోజుల సమయం ఇచ్చిన తరువాత సందర్శనకు వచ్చింది. కానీ ప్రతిపక్ష నేతలను ఘటనా స్థలాన్ని సందర్శించకుండా అడ్డుకున్నారు. ఎస్ఎల్‌బీసీని తన బ్రెయిన్ చైల్డ్ గా చెప్పుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దుబాయ్ టూర్ వెళ్లి తీరిగ్గా వచ్చారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ప్రశాంతంగా చేపల కూర వండించుకుని తిన్నారు. 8 మంది లోపల చిక్కుకుపోయిన ప్రాంతాన్ని మంత్రులు, కాంగ్రెస్ నేతలు టూరిస్ట్ స్పాట్ గా మార్చుకున్నారు’ అని బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ దుమారం రేపుతోంది. 

Also Read: SLBC Tunnel Rescue Operation: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్, అవసరమైతే రోబోలు వాడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Embed widget