అన్వేషించండి

Best OTT Movies: ఆ కోరికలతో రగిలిపోయే వింత జీవి - చివరికి తనని సృష్టించిన జంటతోనే పాడుపని, ఎండింగ్ కిర్రాక్!

ఆ భార్యభర్తలు సైంటిస్టులు.. ఓ మంచి ఉద్దేవంతో ల్యాబ్ అధికారులకు తెలియకుండా సీక్రెట్‌గా వింత జీవికి ప్రాణం పోస్తారు. అది తమకు పనికి రాదని తెలిసినా.. చంపకుండా సొంత బిడ్డలా పెంచుకుంటారు. చివరికి...

Splice.. 2009లో విడుదలయిన సైన్స్ ఫిక్షన్ హార్రర్ ఫిల్మ్. ఇది ఎల్సా, క్లైవ్ అనే ఇద్దరు సైంటిస్టుల కథ. వీరిద్దరు భార్యాభర్తలు. వీళ్లు వివిధ రకాల జెనెటిక్ కోడ్ లను క్రాక్ చేసి, విలువైన ప్రోటీన్లను ఉత్పత్తి చేసే జీవుల్ని క్రియేట్ చేసి, దాని ద్వారా రకరకాల వ్యాధులకు మందు కనుక్కోవాలని ప్రయోగం చేస్తుంటారు. జెనెటిక్ రీసెర్చ్ లలో జరిగే ప్రమాదాల గురించి కాప్టివేటింగ్ స్క్రీన్ ప్లేతో, ఎంతో ఇంట్రెస్టింగ్‌గా, థ్రిల్లింగ్‌గా సాగుతుంది కథంతా.

జెనెటిక్ ఇంజినీర్స్ అయిన క్లైవ్, ఎల్సా లు యానిమల్ DNA ఉపయోగించి, ఫ్రెడ్, జింజర్ అనే రెండు హైబ్రిడ్లను తయారు చేస్తారు. వీటి మధ్య మేటింగ్ జరిపిస్తారు. ఈ ప్రయోగం సక్సెస్ అవుతుంది. దీంతో క్లైవ్, ఎల్సాలు హ్యూమన్ యానిమల్ హైబ్రిడ్‌ను తయారు చేయాలనుకుంటారు. కానీ అందుకు వీళ్ల బాస్ ఒప్పుకోదు. వీళ్లు సీక్రెట్‌గా ప్రయోగం చేయాలనుకుంటారు. అనుకున్నట్లే, పూర్తిగా అభివృద్ధి చెందని ఒక ఫీమేల్ హైబ్రిడ్‌కు జీవం పోస్తారు.

ముందైతే దాన్ని టెర్మినేట్ చేయాలనుకుంటారు. కానీ, ఈ ప్రాణి మంచిదై ఉండొచ్చు కదా, ఉండనిద్దాం అని భార్య ఎల్సా.. క్లైవ్‌ను ఒప్పిస్తుంది. అయితే ఈ ప్రాణి మనుషుల కంటే చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది. దీని మెదడు చిన్నపిల్లల మెదడులా ఎదుగుతుంది. ఎల్సా ఈ ప్రాణికి డ్రెన్ అని పేరు పెడుతుంది. ఎల్సా డ్రెన్ మీద సొంత బిడ్డలా ప్రేమ చూపిస్తుంది. వీళ్లు ముందు క్రియేట్ చేసిన హైబ్రిడ్‌లు ఫ్రెడ్, జింజెర్ లు ఒకదాన్నొకటి కొట్టుకొని చచ్చిపోతాయి. జింజెర్ సడెన్‌గా మేల్ క్రియేచర్ గా మారిపోతుంది. ఎల్సా, క్లైవ్ లు డ్రెన్ తో బిజీగా ఉండి వాటిని గుర్తించరు. 

క్లైవ్, ఎల్సాలు.. డ్రెన్ ని చిన్నపుడు ఎల్సా పెరిగిన ప్రదేశంలో సీక్రెట్ గా ఉంచుతారు. డ్రెన్ పెరుగుతున్న కొద్ది దానికి రెక్కలు వస్తుండటం గమనిస్తారు. ఎవరైనా చూస్తారేమో అని క్లైవ్ భయపడుతాడు. దీన్ని క్రియేట్ చేయటానికి వాడిన DNA ఎవరిదో కాదు. ఎల్సా దే అని క్లైవ్‌కు తెలిసిపోతుంది. ఒకరోజు డ్రెన్ తన పదునైన తోకతో ఎల్సా పెంపుడు పిల్లిని చంపేస్తుంది. దీనితో ఎల్సాకు కోపం వస్తుంది. ఆ తోకలో ఉండే విషం ఎప్పటికైనా ప్రమాదకరమని తనకు ఇష్టం లేకపోయినా ఆ తోకకు ఉన్న స్ట్రింగర్‌ను కత్తిరించి, సింథసైజ్ చేసి తన వర్క్ కోసం ఉపయోగిస్తుంది. డ్రెన్ తన ఫేర్మోన్స్( పార్ట్నర్ ను శారీరకంగా అట్రాక్ట్ చేసేందుకు జంతువులు విడుదల చేసే కెమికల్) ఉపయోగించి, క్లైవ్‌ను వశపరుచుకుంటుంది. వీళ్లిద్దరూ దగ్గరవటం చూసి షాక్ తో, ఎల్సా వెళ్లిపోతుంది. దీని వల్ల ఇంకెన్నో ప్రమాదాలు రావొచ్చని, ఇద్దరూ కలిసి డ్రెన్‌ను చంపాలనుకుంటారు. కానీ డ్రెన్ అప్పటికే చనిపోయే స్థితిలో ఉంటుంది. ఈ ప్రాణి లైఫ్ స్పాన్ మనుషులంత ఉండదని తెలుసుకుంటారు. చనిపోయిన డ్రెన్‌ను పాతిపెడుతారు.

కథ ఇప్పుడే ఊహించని మలుపు తిరిగి, డ్రెన్ ఆత్మ బయటకొస్తుంది. కానీ డ్రెన్ ఇపుడు ఫీమేల్ కాదు.. మేల్. అది ఎల్సా మీద అత్యాచారానికి పాల్పడుతుంది. తాను సృష్టించిన జీవి అని ఎల్సా దాన్ని చంపలేకపోతుంది. కానీ డ్రెన్.. క్లైవ్‌ను ఘోరంగా చంపేస్తుంది. దీంతో ఎల్సా.. డ్రెన్ మీద రాయి విసిరి చంపేస్తుంది. అప్పుడే అయిపోలేదు. డ్రెన్ చేసిన ఫిజికల్ అటాక్ వల్ల ఎల్సా ప్రెగ్నెంట్ అవుతుంది. ఎల్సా అపుడు తన బిడ్డ మీద ప్రయోగం చేయాలనుకుంటుంది. సినిమా చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగుతుంది. సైన్స్ ఫిక్షన్ ఇష్టపడని వారు కూడా ఆసక్తిగా చూసే విధంగా సాగుతుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Also Read: అక్కడంతా కళ్లకు గంతలు కట్టుకునే తిరగాలి.. లేకపోతే మరణమే - అనుక్షణం టెన్షన్ పెట్టే ఈ మూవీ చూశారా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
MLC elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్- మూడో తేదీన ఫలితాలు !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్- మూడో తేదీన ఫలితాలు !
Vallabhaneni Vamsi: కిడ్నాప్ కేసులో వంశీ జగన్ పేరు చెప్పారా ? -  ముగిసిన పోలీసుల కస్టడీ !
కిడ్నాప్ కేసులో వంశీ జగన్ పేరు చెప్పారా ? - ముగిసిన పోలీసుల కస్టడీ !
Hyderabad Latest News: దేవాదాయశాఖ పరిధిలోకి ఛార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం, ఇకపై పక్కా లెక్కలు చెప్పాల్సిందే!
దేవాదాయశాఖ పరిధిలోకి ఛార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం, ఇకపై పక్కా లెక్కలు చెప్పాల్సిందే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

TVK Vijay First Anniversary Speech in Telugu | ఒకడు ఫాసిజం..ఇంకోడు పాయసం..మాటల దాడి చేసిన విజయ్ | ABP DesamMS Dhoni Morse Code T Shirt Decoded | చెన్నై అడుగుపెట్టిన ధోని..ఊహించని షాక్ ఇచ్చాడు | ABP DesamSri Mukha Lingam  Temple History | శివుడు లింగం రూపంలో కాకుండా ముఖరూపంలో కనిపించే ఆలయం | ABP DesamTirumala Kshethra Palakudu Rudrudu Temple | కోనేటి రాయుడి క్షేత్రానికి కాపలా ఈయనే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
MLC elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్- మూడో తేదీన ఫలితాలు !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్- మూడో తేదీన ఫలితాలు !
Vallabhaneni Vamsi: కిడ్నాప్ కేసులో వంశీ జగన్ పేరు చెప్పారా ? -  ముగిసిన పోలీసుల కస్టడీ !
కిడ్నాప్ కేసులో వంశీ జగన్ పేరు చెప్పారా ? - ముగిసిన పోలీసుల కస్టడీ !
Hyderabad Latest News: దేవాదాయశాఖ పరిధిలోకి ఛార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం, ఇకపై పక్కా లెక్కలు చెప్పాల్సిందే!
దేవాదాయశాఖ పరిధిలోకి ఛార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం, ఇకపై పక్కా లెక్కలు చెప్పాల్సిందే!
Viral News: ప్రపంచంలో అత్యంత వివాదాస్పద సినిమా ఇదే - 150 దేశాల్లో బ్యాన్ - డైరక్టర్‌ని కూడా లేపేశారు!
ప్రపంచంలో అత్యంత వివాదాస్పద సినిమా ఇదే - 150 దేశాల్లో బ్యాన్ - డైరక్టర్‌ని కూడా లేపేశారు!
Balakrishna: 'ఎన్టీఆర్‌కు త్వరలోనే భారతరత్న' - స్వగ్రామంలో బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు, తల్లిదండ్రుల విగ్రహాలకు నివాళులు
'ఎన్టీఆర్‌కు త్వరలోనే భారతరత్న' - స్వగ్రామంలో బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు, తల్లిదండ్రుల విగ్రహాలకు నివాళులు
Emaar Revanth Reddy: వివాదాలను పరిష్కరించాలని ఎమ్మార్ విజ్ఞప్తి - లీగల్ ఏజెన్సీకి రేవంత్ ఆమోదం
వివాదాలను పరిష్కరించాలని ఎమ్మార్ విజ్ఞప్తి - లీగల్ ఏజెన్సీకి రేవంత్ ఆమోదం
Sri Reddy Arrest?: పోసాని అరెస్ట్ తర్వాత టార్గెట్ శ్రీ రెడ్డి... బూతులకు తగిన మూల్యం చెల్లించక తప్పదా?
పోసాని అరెస్ట్ తర్వాత టార్గెట్ శ్రీ రెడ్డి... బూతులకు తగిన మూల్యం చెల్లించక తప్పదా?
Embed widget