అన్వేషించండి

SSC Constable Key: కానిస్టేబుల్ (జీడీ) పరీక్ష ప్రిలిమినరీ కీ విడుదల, అభ్యంతరాల నమోదుకు అవకాశం

Constable Answer Key: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ ఖాళీల నియామక రాతపరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) మార్చి 4న విడుదల చేసింది.

SSC GD Constable Answer Key & Response Sheet 2025: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ ఖాళీల నియామక రాతపరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) ఏప్రిల్ 3న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రూల్ నంబర్, పాస్‌వర్డ్ వివరాలు నమోదు చేసి జవాబులు చూసుకోవచ్చు. ఒకవేళ ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలపడానికి ఎస్ఎస్‌సీ అవకాశం కల్పించింది. అభ్యర్థులు మార్చి 9న సాయంత్రం 6.30 గంటల వరకు అభ్యంతరాలు తెలపవచ్చు. అభ్యంతరాలు తెలిపే ఒక్కో ప్రశ్నకు రూ.100 ఫీజుగా చెల్లించాలి.

కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ ఖాళీల భర్తీకి ఫిబ్రవరి 4 నుంచి మార్చి 25 వరకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తెలుగుతోపాటు మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహించారు. రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తదితర పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ ఆన్సర్ కీ, అభ్యంతరాల నమోదుకోసం క్లిక్ చేయండి..

                                 

కానిస్టేబుల్ జీడీ పరీక్ష విధానం..
మొత్తం 160 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో జనరల్‌ ఇంటెలిజెన్స్‌ & రీజనింగ్‌ 20 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్‌ నాలెడ్జ్‌ & జనరల్‌ అవేర్‌నెస్‌ 20 ప్రశ్నలు-40 మార్కులు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌ 20 ప్రశ్నలు-40 మార్కులు, ఇంగ్లిష్‌/ హిందీ 20 ప్రశ్నలు-40 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు. పరీక్షలో ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి. కాగా నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు (అర మార్కు) కోత విధిస్తారు.

కేంద్ర బలగాల్లో 39,481 కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ (గ్రౌండ్‌ డ్యూటీ) పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ సెప్టెంబరు 5న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం ఖాళీల్లో పురుషులకు 35,612 పోస్టులు; మహిళలకు 3,869  పోస్టులు కేటాయించారు. ఇందులో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌(BSF)లో 15,654 పోస్టులు; సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)లో 7,145 పోస్టులు; సెంట్రల్ రిజర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్(CRPF)లో 11,541 పోస్టులు; సశస్త్ర సీమాబల్‌(SSB)లో 819 పోస్టులు; ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సెస్(ITBP)లో 3,017 పోస్టులు; అస్సాం రైఫిల్స్(AR)లో 1,248 పోస్టులు; స్పెషల్ సెక్యూరిటీ ఫోర్సెస్(SSF)లో 35  పోస్టులు, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరోలో 22 పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సంబంధించి ఎన్‌సీబీలో సిపాయ్ పోస్టులకు పేలెవల్-1(రూ.18,000 - రూ.56,900), ఇతర పోస్టులకు పేలెవల్-3(రూ.21,700 -  రూ.69,100) కింద జీతభత్యాలు ఉంటాయి.

వివరాలు..

మొత్తం ఖాళీల సంఖ్య: 39,481

పోస్టుల కేటాయింపు: యూఆర్-16,782, ఈడబ్ల్యూఎస్-3851, ఓబీసీ-8576, ఎస్టీ-4454, ఎస్సీ-5818.

విభాగం పోస్టుల సంఖ్య పోస్టుల కేటాయింపు
బీఎస్‌ఎఫ్‌ 15,654 మెన్-13306, ఉమెన్-2348
సీఐఎస్‌ఎఫ్‌ 7,145 మెన్-6430, ఉమెన్-715
సీఆర్‌పీఎఫ్‌ 11,541 మెన్-11299, ఉమెన్-242
ఎస్‌ఎస్‌బీ 819  మెన్-819, ఉమెన్-0
ఐటీబీపీ 3,017 మెన్-2564, ఉమెన్-453
ఏఆర్ 1,248 మెన్-1148, ఉమెన్-100
ఎస్‌ఎస్‌ఎఫ్‌ 35  మెన్-35, ఉమెన్-0
ఎన్‌సీబీ 22 మెన్-11, ఉమెన్-11
మొత్తం ఖాళీలు 39,481 39,481

జీతం: ఎంపికైన అభ్యర్థులకు సంబంధించి ఎన్‌సీబీలో సిపాయ్ పోస్టులకు పేలెవల్-1(రూ.18,000 - రూ.56,900), ఇతర పోస్టులకు పేలెవల్-3(రూ.21,700 -  రూ.69,100) కింద జీతభత్యాలు ఉంటాయి.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

టాప్ హెడ్ లైన్స్

TGPSC Exams Schedule: టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Ward Secretariat Employees: స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
IGNOU Recruitment: ఇగ్నోలో 43 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ.. దరఖాస్తు విధానం, అర్హతలు ఇవే!
ఇగ్నోలో 43 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ.. దరఖాస్తు విధానం, అర్హతలు ఇవే!

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Athletics Gold Rush: ట్రాక్ పై భారత మహిళల సంచలన పరుగు.. అథ్లెటిక్స్ లో ఏకైక పసిడితో అదిరిపోయే ముగింపు, ఆఫ్ సెంచ‌రీకి దాటిన భారత్ మెడల్స్ వేట
ట్రాక్ పై భారత మహిళల సంచలన పరుగు.. అథ్లెటిక్స్ లో ఏకైక పసిడితో అదిరిపోయే ముగింపు, ఆఫ్ సెంచ‌రీకి దాటిన భారత్ మెడల్స్ వేట
PM Modi Degree Case: ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
Onions Price: ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
Palle Panduga 3.0: వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
Bowling Coach Reunion: చెన్నై గూటికి ఆ జట్టు మాజీ పేసర్ .. జహీర్ ఖాన్ టీమ్‌లోకి బౌలింగ్ కోచ్ గా రీ ఎంట్రీ
చెన్నై గూటికి ఆ జట్టు మాజీ పేసర్ .. జహీర్ ఖాన్ టీమ్‌లోకి బౌలింగ్ కోచ్ గా రీ ఎంట్రీ
Water Based Battery: చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Embed widget