Perfect Shirt for Men : అబ్బాయిలు షర్ట్ కొనేప్పుడు ఇవి ఫాలో అయిపోండి.. ఈ టిప్స్ ఫాలో అయితే పొడుగ్గా కూడా కనిపిస్తారట
Perfect Shirt, Perfect Fit : షర్ట్ కొనుకునేప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అయితే మంచి లుక్ మీ సొంతమవుతుంది. అలాగే మీరు కాస్త పొట్టిగా ఉన్నవారు షర్ట్ వేసుకునేప్పుడు ఈ టెక్నిక్స్ ఫాలో అయిపోండి.

Men's Fashion Guide : నేను బయటకు రావాలంటే హ్యాంగర్‌కి ఉన్న షర్ట్ వేసుకొస్తే చాలు అని చాలామంది అబ్బాయిలు ప్రభాస్ రేంజ్లో డైలాగ్ చెప్తారు. కానీ ఆ షర్ట్ తమకి సూట్ అవుతుందో లేదో ఆలోచించరు. మేము అమ్మాయిల్లా గంటలు గంటలు షాపింగ్ చేయము.. జస్ట్ వెళ్లామా? నచ్చిందా? కొనేశామా అంతే అంటూ గొప్పలు పోతుంటారు. కానీ అది మీకు ఎలాంటి లుక్ ఇస్తుందో.. మీ సూట్ అయ్యిందో లేదో ఆలోచించారా?
మా హీరో ఈ షర్ట్ వేశాడని కొనేస్తారు. కానీ హీరోలు మాత్రం ఇవి ఫాలో అవుతారు. తమ లుక్స్ కోసం ఫ్యాషన్ డిజైనర్స్‌ని అపాయింట్ చేసుకుంటారు. వారు అప్రూవ్ చేస్తేనే వాటిని వేసుకుంటారు. మీరు ఎవరినో అపాయింట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఓ షర్ట్‌ని కొనేప్పుడు కొన్ని విషయాలు గుర్తించుకుంటే చాలు. కొనేప్పుడే కాకుండా.. షర్ట్‌ని స్టైల్ చేసేప్పుడు ఏమి ఫాలో అవ్వాలో.. స్టైలింగ్ విషయాలు ఇప్పుడు చూసేద్దాం.
షర్ట్ కొనేప్పుడు గుర్తించుకోవాల్సిన విషయాలు..
మీరు షర్ట్‌ని ట్రైల్ చేయడానికి వెళ్లినప్పుడు నిల్చొని మిర్రర్లో బాగానే ఉందని చూసి కొనేయకుండా.. కూర్చొని చెక్ చేసుకోండి. దీనివల్ల వైడ్ ఓపెనింగ్స్ ఏమైనా ఉంటే వాటిని అవాయిడ్ చేయండి. మీరు నెక్ దగ్గర బటన్ పెట్టుకుని.. మీ రెండు వేళ్లను కాలర్లోకి పంపాలి. అది స్మూత్‌గా వెళ్లి వచ్చేస్తే.. మీరు పర్ఫెక్ట్ షర్ట్ తీసుకుంటున్నట్టు. షోల్డర్ లైన్ కూడా కాలర్‌బోన్ దగ్గర ఉండేలా చూసుకోవాలి. ఈ లైన్ కాలర్ బోన్ కంటే కింద ఉన్నా.. పైన ఉన్నా మీరు కరెక్ట్ది వేసుకోలేదని అర్థం. మీరు షర్ట్ వేసుకున్నా కంఫర్ట్‌బుల్‌గా మూవ్ అవుతున్నారో లేదో చెక్ చేసుకోవాలి. ఇవి ఓకే అనుకుంటే షర్ట్ కొనుక్కోవచ్చు. అది మీకు పర్ఫెక్ట్ లుక్ ఇస్తుంది.
షర్ట్‌లో పొడుగ్గా కనిపించాలంటే..
అందరూ ఆరడుగుల ఆజానుబాహులే ఉండరు. కాస్త హైట్ తక్కువగా ఉండేవారు తమ లుక్స్‌ని టాల్‌గా కనిపించేందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వొచ్చు. అడ్డంగా గీతలుండే వాటిని కాకుండా.. వర్టికల్ స్ట్రైప్స్ ఉండే షర్ట్స్ పొడుగ్గా కనిపించేలా చేస్తాయి. పొడ్డుగా కనిపించాలంటే.. షర్ట్‌ని వదిలేయకుండే టక్ చేసుకోండి. ఇది కూడా మంచి ఎలివేషన్ ఇస్తుంది. స్లీవ్స్ ఫుల్ లెంగ్త్‌లో ఉంచకుండా.. ఫోల్డ్ చేసుకుంటే బాగుంటుంది. లైట్ కలర్స్ కాకుండా డార్క్ కలర్స్‌ని ఎంచుకుంటే బెస్ట్. చెక్స్ షర్ట్స్ కంటే.. స్మాల్ ప్యాట్రన్స్‌తో వచ్చేవి ఎంచుకోవాలి. బల్కీ షూ, టాప్ స్నీకర్స్ కంటే.. హీల్స్ ఉండే లోఫర్స్ ఎంచుకుంటే లుక్ బాగుంటుంది. పొడుగ్గా కనిపిస్తారు.
గుర్తించుకోవాల్సిన విషయం ఏంటి అంటే.. ఎవరికో సూట్ అయ్యేది మీకు కూడా సూట్ అవుతుందని అనుకోవడం. అలా అనుకుని కొన్నా ఎక్కువరోజులు వాటిని వేసుకోలేక పక్కన పెట్టేయాల్సి వస్తుంది. మీ లుక్‌కి పర్ఫెక్ట్గా ఉండాలంటే మీరే డైరక్ట్‌గా షాపింగ్‌కి వెళ్లొచ్చు. లేదా మీరే మీకు కంఫర్ట్‌గా ఉండేలా కుట్టించుకోవచ్చు. అలాగే మీరు ఏ రంగు షర్ట్‌ని ఎంచుకున్నా.. దానికి తగ్గ ప్యాంట్ వేసుకుంటేనే లుక్ టోటల్‌గా బాగుంటుంది.
Also Read : మగవారు 30ల్లో ఫాలో అవ్వాల్సిన హ్యాబిట్స్ ఇవే.. హెల్తీ లైఫ్ కోసం ఈ మార్పులు చేయాలట






















