Health Tips : మగవారు 30ల్లో ఫాలో అవ్వాల్సిన హ్యాబిట్స్ ఇవే.. హెల్తీ లైఫ్ కోసం ఈ మార్పులు చేయాలట
Health Habits For Men : మగవారు 30ల్లోకి వచ్చిన తర్వాత లైఫ్స్టైల్లో కొన్ని మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. ఇవి తర్వాతి కాలంలో బాగా హెల్ప్ అవుతాయని చెప్తున్నారు. అవేంటంటే..
Lifestyle Changes for Men at 30 : జీవితంలో 30 అనేది ఓ బోర్డర్ లాంటిది. దానిని దాటకముందు అంతా బాగానే ఉంటుంది. యాక్టివ్‌గా ఉంటారు. నచ్చింది తింటారు. ఎలాంటి ఫుడ్ తీసుకున్నా.. ఏది తిన్నా.. ఎంత తిన్నా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నచ్చినపని చేస్తారు. లేకుంటే చేయరు. ఫ్యామిలీ ప్లానింగ్ లాంటి రెస్పాన్స్బులిటీలు కూడా అంతగా ఉండవు. కానీ.. 30కి వచ్చిన తర్వాత ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. అలా మారకూడదు అనుకున్నప్పుడు.. ఎక్కువ ఇబ్బంది కలగకూడదనుకున్నప్పుడు జీవనశైలిలో కొన్ని మార్పులు చేయాలి.
వయసు పెరిగే కొద్ది శరీరంలో చిన్న చిన్న మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఫుడ్ విషయంలో తెలియకుండానే మార్పులు చేయాల్సి వస్తుంది. పని ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తెలుస్తూ ఉంటాయి. ఆ సమయంలో వీక్ అవ్వకుండా.. మెంటల్లీ, ఫిజికల్లీ స్ట్రాంగ్‌గా ఉండాలంటే.. లైఫ్ స్టైల్లో పలు మార్పులు చేయాలి. ముఖ్యంగా మగవారు తమ జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేస్తే.. 30లో ఉన్నప్పుడు 30 దాటిన తర్వాత కూడా హ్యాపీగా ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
లైఫ్స్టైల్లో ఈ మార్పులు ఉండాలి..
వ్యాయామం : రెగ్యూలర్‌గా వ్యాయామం చేస్తూ ఉండాలి. వారానికి కనీసం 150 నిమిషాలు వర్క్ అవుట్స్ చేసేలా చూసుకోవాలి.
బ్యాలెన్డ్స్ డైట్ : అప్పటివరకు ఎలా తిన్నా.. 30ల్లో మాత్రం ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్‌ని, లీన్ ప్రోటీన్స్ని డైట్లో చేర్చుకోవాలి.
ఒత్తిడి : స్ట్రెస్ రావడానికి ఎన్నో రీజన్స్ ఉంటాయి. కాబట్టి వాటిని దూరం చేసుకోవడానికి మెడిటేషన్, యోగా, డీప్ బ్రీతింగ్ వంటివి ఫాలో అవ్వాలి.
నిద్ర : శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండడంలో రాత్రి నిద్ర బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోండి.
రిలేషన్షిప్స్ : ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో కలవండి. మిమ్మల్ని నవ్వించే.. మీకు ఇబ్బంది కలిగించని వారిని రెగ్యూలర్‌గా మీట్ అవుతూ ఉంటే కూడా హ్యాపీగా, హెల్తీగా ఉంటారు.
ఆరోగ్యం విషయంలో..
మీరు 30ల్లోకి వస్తే రెగ్యూలర్‌గా హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి. దీనివల్ల సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు. అలాగే మెంటల్ హెల్త్‌ని తక్కువ అంచనా వేయకండి. ఈ సమయంలో యాంగ్జైటీ, డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి మీరు కచ్చితంగా మెంటల్ హెల్త్‌పై ఫోకస్ చేయాలి. బరువు పెరగకుండా చూసుకోవాలి. లేదంటే దీర్ఘకాలిక సమస్యలు తప్పవు. స్మోకింగ్‌ని పూర్తిగా మానేయాలి. మందు అలవాటును లిమిట్ చేసుకోవాలి.
ఫాలో అవ్వాల్సిన టిప్స్..
రోజూ కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగాలి. స్క్రీన్ టైమ్‌ని వీలైనంత వరకు తగ్గించండి. మిమ్మల్ని యాక్టివ్‌గా ఉంచే హాబీలను కంటిన్యూ చేయాలి. ఇది మిమ్మల్ని మానసికంగా హెల్తీగా ఉండేలా చేస్తుంది. రిలాక్స్ అవ్వడానికి టైమ్ తీసుకోండి. ట్రిప్‌కి వెళ్లొచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి టైమ్ మేనేజ్మెంట్ చేసుకోండి.
ఆ విషయాన్ని అస్సలు మరవద్దు
వీటితో పాటు.. ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్ ప్రారంభించడానికి ట్రై చేయండి. 20ల్లోనే వీటిపై ఫోకస్ చేస్తే మంచిది. కానీ 30 ఏమి పెద్ద ఎక్కువ ఏజ్ ఏమి కాదు. కానీ మీ 30ల్లో ఇన్వెస్ట్ చేయడం, సేవింగ్స్ చేయడం ప్లాన్ చేస్తే.. ఫ్యూచర్ బాగుటుంది. అలాగే టెర్మ్ హెల్త్ ఇన్సూరెన్స్‌లు కూడా తీసుకుంటే మంచిది. వెల్తీగా ఉన్నప్పుడు హెల్త్ బాగుంటుందనే విషయాన్ని గుర్తించాలి.
Also Read : మీరు హ్యాపీగా లేరా? అయితే లీవ్ తీసుకోండి.. ఒక రోజు కాదు పది రోజులు పెయిడ్ లీవ్, ఎక్కడంటే