మగవారు నీళ్లు తాగకపోతే ఏమవుతుందో తెలుసా?
శరీరానికి అవసరమైన నీటిని అందించకపోతే.. బాడీ డీహైడ్రేట్ అవుతుంది. తలనొప్పి, ఫటిగో, నోరు తడి ఆరోపోవడం, యూరిన్ డార్క్ కలర్లో రావడం దీనిలో భాగమే.
నీరు శరీరానికి తగినంత అందకుంటే బలం, ఓపిక తగ్గిపోతుంది. ఫిజికల్‌గా చేయాల్సిన పనులను చేయలేరు. నీరసంగా ఫీల్ అవుతారు.
శరీరానికి తగినంత నీరు అందించకుంటే.. మగవారికైనా, ఆడవారికైనా మలబద్ధక సమస్య ఇబ్బంది పెడుతుంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి.
యూరీనరి ట్రాక్ట్ సమస్యలు శరీరంలో నీరు తక్కువైనప్పుడు వస్తాయి. కిడ్నీలో స్టోన్స్ పెరిగే ప్రమాదముంది. యూటీఐ సమస్యలు, యూరిన్ చేస్తున్నప్పుడు నొప్పి వస్తుంది.
స్కిన్ డ్రైగా మారుతుంది. చర్మం బిగుసుకుపోయి.. ఎక్కువగా పొడిబారుతుంది. యాక్నే సమస్యలు పెరుగుతాయి.
శరీరానికి సరైన మోతాదులో ఎక్కువ కాలం నీటిని అందించకుంటే.. కిడ్నీ సమస్యలు పెరుగుతాయి. కొన్ని సందర్భాల్లో కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది.
బీపీ, జీర్ణ సమస్యలు పెరుగుతాయి. డీ హైడ్రేషన్ వల్ల బీపీ పెరగడం, తగ్గడం లాంటిది జరుగుతుంది.
నీటిని శరీరానికి అందించకుంటే.. ఏ పనిపై ఫోకస్ చేయలేరు. మతిమెరుపు తగ్గుతుంది.
రోజుకు కనీసం 7 నుంచి 8 గ్లాసుల నీటి శరీరానికి తప్పక అందించాలంటున్నారు నిపుణులు.
ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయి. (Images Source : Envato)