ముఖాన్ని కడుక్కునేప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి ఫేస్ వాష్ చేసేముందు కచ్చితంగా చేయాల్సిందేంటి అంటే చేతులు కడుక్కోవడం. మేకప్‌ని రిమూవ్ చేసిన తర్వాత ముఖాన్ని వాష్ చేసుకుంటే.. స్కిన్ డ్యామేజ్ కాదు. మీ స్కిన్ టైప్‌కి తగ్గట్లు క్లెన్సర్‌ని ఎంచుకోవాలి. దీంతో ముఖాన్ని కడుక్కుంటే మంచి ఫలితాలుంటాయి. వారానికోసారి అయినా ముఖాన్ని స్క్రబ్ చేయడం లేదా ఎక్స్ఫోలియేట్ చేయడం చేయాలి. ఉదయం, సాయంత్రం కచ్చితంగా ముఖాన్ని రెండు సార్లు క్లెన్సర్‌తో శుభ్రం చేస్తే స్కిన్ బాగుంటుంది. దీనివల్ల ముఖంపై డర్ట్, పేరుకుపోయిన మృతుకణాలు తొలగిపోతాయి. కాఫీ పౌడర్‌లో షుగర్, ఆలివ్ నూనె కలిపి ముఖానికి స్క్రబ్‌గా కూడా వినియోగించవచ్చు. ముఖాన్ని కడిగిన తర్వాత దానిని టవల్‌తో రుద్దకూడదు. జస్ట్ టాబ్ చేయాలి. ఇవన్నీ కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచిది. (Images Source : Envato)