చలికాలంలో చంటి పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
చలికాలంలో పిల్లలు ఉండే రూమ్‌లో టెంపరేచర్ కరెక్ట్‌గా ఉండేలా చూసుకోవాలి. ఇవి వారిని కంఫర్టబుల్‌గా ఉంచుతాయి.
పిల్లలకు స్వెట్టర్స్ కాకుండా.. లేయర్డ్ డ్రెస్‌లు వేస్తే వారికి కంఫర్ట్‌బుల్‌గా ఉంటాయి. చలి నుంచి కాపాడుతాయి.
చర్మం పొడిబారితే స్కిన్ సమస్యలు పెరుగుతాయి. కాబట్టి వైద్యుల సూచనల మేరకు మాయిశ్చరైజర్స్ ఉపయోగించండి.
కరెక్ట్ టైమ్‌కి వ్యాక్సిన్ వేయించాలి. ఇవి వారిని రోగాల బారిన పడకుండా కాపాడుతాయి.
పిల్లల్ని ఎత్తుకునేప్పుడు.. వారికి ఫీడింగ్ చేసే సమయంలో మీ చేతులు శుభ్రంగా కడుక్కుని వారిని పట్టుకుంటే మంచిది.
చలి ఎక్కువగా ఉన్న సమయంలో పిల్లలను బయటకు తీసుకెళ్లకపోవడమే మంచిది. తీసుకువెళ్తే.. కనీస జాగ్రత్తలు తీసుకోవాలి.
బ్రెస్ట్‌ఫీడింగ్ ఇవ్వడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీనివల్ల ఫ్లూ వంటి సమస్యలు రావు.
పిల్లలు పడుకునే ప్రదేశం కంఫర్ట్‌బుల్‌గా, సాఫ్ట్‌గా ఉండేలా చూసుకోవాలి. ఇది వారి స్కిన్‌కి, నిద్రకి మేలు చేస్తుంది.
ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు పాటిస్తే మంచిది. (Images Source : Freepik)