డయాబెటిస్​ ఉన్నవారికి ఫుడ్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి.

కానీ కొన్ని ఫుడ్స్ తీసుకుంటే శరీరంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్​లో ఉంటాయి. అలాంటి వాటిలో యాలకులు ఒకటి.

వీటిని రెగ్యూలర్​గా తీసుకుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడంతో పాటు.. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది.

అయితే మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవడానికి రోజుకు ఎన్ని యాలకులు తీసుకోవాలో తెలుసా?

1 టీస్పూన్ యాలకుల పొడిని తీసుకోవచ్చు. లేదంటే ఒకటి లేదా రెండు యాలకులను రోజులో రెండుసార్లు తీసుకోవచ్చు.

టీలో కలిపి తీసుకునేవారు 1 కప్పు టీ కోసం 1 టీస్పూన్ యాలకుల పొడి వేసుకోవచ్చు.

అయితే మీరు దీనిని మీ డైట్​లో రెగ్యూలర్​గా తీసుకోవాలనుకుంటే కచ్చితంగా వైద్యుల సూచన తీసుకోవాలి.

కొందరిలో యాలకులు రక్తాన్ని పలుచగా చేస్తాయి. మరికొందరిలో హైపోగ్లైకోమియా ఎక్కువ అవుతుంది.

మధుమేహానికి మందులు ఉపయోగించేవారు కూడా వైద్యుల సలహా తీసుకుని వీటిని ఉపయోగించుకోవచ్చు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచిది. (Images Source : Envato)