Unhappy Leave : మీరు హ్యాపీగా లేరా? అయితే లీవ్ తీసుకోండి.. ఒక రోజు కాదు పది రోజులు పెయిడ్ లీవ్, ఎక్కడంటే
Unhappy Leave : సిక్ లీవ్, క్యాజువల్ లీవ్.. ఇలా రకరకాల లీవ్స్ ఉంటాయి. ఈ జాబితాలోకి unhappy leave కూడా వచ్చింది. మీరు హ్యాపీగా లేకుంటే ఈ లీవ్ తీసుకోవచ్చొంటూ ఓ కంపెనీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఎక్కడంటే..
Unhappy Leave Policy for Employee Well-being : మీరు జాబ్ చేస్తున్నారా? అయితే మీరు ఈ లీవ్‌కి కచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే.. మీకు ఇంకా సిక్ లీవ్స్, క్యాజువల్ లీవ్స్ రకరకాల లీవ్స్ ఎన్నైనా ఉండొచ్చు. కానీ.. మీరు వాటిని వాడుకోలేని పరిస్థితిలో ఉండొచ్చు. వర్క్ ప్రెజర్ వల్లనో.. పని ఆగిపోతుందనో.. ఆఫీస్‌లో ఎవరూ లేరనో.. ఇలా వివిధ కారణాల వల్ల మీకున్న లీవ్స్ని కూడా మీరు వాడుకోలేని పరిస్థితి ఏర్పడవచ్చు.
కంపెనీలు లీవ్స్ ఇస్తాయి కానీ.. వాటిని వాడుకోలేని పరిస్థితిని కూడా క్రియేట్ చేస్తాయి. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే.. మీరు లీవ్స్ వాడుకునే హక్కు ఉన్నా.. వాటిని వాడుకోలేని పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా మీ లీవ్స్ని మీరు వాడుకునేందుకు కూడా ఎన్నో రీజన్స్ చెప్పాల్సి ఉంటుంది. ఇవి ఉద్యోగులపై ఒత్తిడిని పెంచుతున్నాయి. అలాగే ప్రొడెక్టివిటీ తగ్గిపోతుంది. ఈ విషయాన్ని గుర్తించిన చైనా తెరపైకి Unhappy Leaveని తెచ్చింది.
Unhappy Leave అంటే..
మీరు హ్యాపీగా లేరా? అయితే మీరు Unhappy Leaveని అప్లై చేసి.. లీవ్ తీసుకోవచ్చు. ఉద్యోగుల శ్రేయస్సు, వర్క్ లైఫ్, పర్సనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకోవడంలో భాగంగా ఈ లీవ్‌ని పరిచయం చేశారు. ఉద్యోగులు సంతోషంగా లేనప్పుడు సంవత్సరంలో 10 రోజులు ఈ సెలవులు తీసుకోవచ్చని చైనాలోని ఓ కంపెనీ తెలిపింది. అంటే ఈ Unhappy Leave పేరుతో మిగిలిన లీవ్స్ ఆపేస్తారు అనుకుంటున్నారా? అస్సలు కాదు. వర్కింగ్ హవర్స్ తగ్గించి.. వారాంతాల్లో సెలవులు, వార్షిక సెలవులు, అడిషనల్ ఆఫ్‌లు కూడా తీసుకోవచ్చని సూచించింది.
చైనాలో ఉద్యోగుల్లో పెరుగుతున్న ఒత్తిడిని గుర్తించిన ప్యాంగ్ డోంగ్లాయ్ అనే CEO.. తన ఎంప్లాయిస్ ఈ స్ట్రెస్‌లో చిక్కుకోకూడదు.. అలాగే వారి సమస్యలు ఉద్యోగంపై ఎఫెక్ట్ చూపించకూడదనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సౌకర్యవంతమైన పని జీవితాన్ని అందించడంలో భాగంగా దీనిని ఇంప్లిమెంట్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతుంది.
ఇండియాలో కూడా..
ఇప్పుడు ఈ న్యూస్ చైనాలో కంటే ఇండియాలో ఎక్కువ వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగుల్లో కూడా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో స్ట్రైస్కి సంబంధించిన ఎన్నో వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఎందరో ఎంప్లాయిస్ జాబ్ స్ట్రెస్‌తో ప్రాణాలు సైతం వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ న్యూస్‌ను వైరల్ చేస్తూ.. ఇండియాలో కూడా ఇలా రూల్ వస్తే బాగుండు.. Unhappy Leave ఇస్తే బాగుండు అనుకుంటున్నారు.
ఇలాంటి లీవ్స్.. ఇలాంటి వర్కింగ్ ఎన్వారాన్మెంట్ ఉంటే ఉద్యోగుల్లో ఒత్తిడి తగ్గుతుంది. అలాగే మంచి ఫలితాలు ఉంటాయని కొందరు చెప్తున్నారు. కానీ మరికొందరు మాత్రం.. ఈ Unhappy Leave అవసరం లేదు.. ఉన్న లీవ్స్ వాడుకోనిస్తే చాలు అంటూ సెటైరికల్‌గా మాట్లాడుతున్నారు. ఏదైతేనేమి.. చైనాలో ఆ సీఈఓ ఆలోచించినట్లు.. ప్రతి కంపెనీ ఆలోచిస్తే.. ఏ ఉద్యోగి పని ఒత్తిడితో ఇబ్బందులు పడరు.
Also Read : ఉద్యోగుల్లో పెరుగుతున్న పని ఒత్తిడి.. తగ్గించుకునేందుకు ఆ విషయాలకు నో చెప్పండి.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి