SSMB29: ఒరిస్సాలో అడుగు పెట్టిన మహేష్... రాజమౌళి సినిమా కోసం, ఆయనతో వెళ్లిందెవరో గుర్తు పట్టారా?
Mahesh Babu Rajamouli movie update: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా చిత్రీకరణ కోసం యూనిట్ అంతా ఒరిస్సా వెళ్ళింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహిస్తున్న సినిమా చిత్రీకరణ ఇన్ని రోజులు హైదరాబాద్ సిటీలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగింది. ఇప్పుడు సినిమా యూనిట్ అంతా ఒరిస్సా వెళ్ళింది.
మహేష్ బాబుతో పాటు మలయాళ హీరో కూడా!
రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా మహేష్ బాబుకు 29వది. అందుకని, SSMB29 అంటున్నారు. ఇందులో మహేష్ హీరో అయితే... మలయాళ స్టార్, తెలుగులో 'సలార్' చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్. బుధవారం ఉదయం వాళ్ళిద్దరూ హైదరాబాద్ నుంచి ఒరిస్సా బయలు దేరారు. ఎయిర్ పోర్టులో పోలీసులకు షేక్ హ్యాండ్ ఇస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Sher @urstrulyMahesh 🦁🦁🦁#SSMB29 #MaheshBabu pic.twitter.com/icmXtlcQiE
— Mahesh Babu News🦁 (@MaheshBabuNews) March 5, 2025
ఒరిస్సాలోని కోరాపుట్ జిల్లాలో గల ప్రదేశాలలో సినిమా చిత్రీకరణ జరగనుంది. గిరిజన సంస్కృతితో పాటు కొండలు ఆ ప్రాంతంలో ఎక్కువ. గ్లోబ్ ట్రాంటింగ్ జానర్ సినిమాగా రాజమౌళి SSMB29ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అందుకని దేశంలో వివిధ నగరాలతో పాటు విదేశాలలో సైతం చిత్రీకరణ చేయనున్నారు.
Also Read: మా అమ్మ సూసైడ్ అటెంప్ట్ చేయలేదు... సింగర్ కల్పన కేసులో క్లారిటీ ఇచ్చిన కుమార్తె
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో తాను నటిస్తున్నట్లు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు. అయితే మోహన్ లాల్ హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందిన 'లూసిఫర్ 2' పనులు నిమిత్తం ఇన్ని రోజులు బిజీగా గడిపారు. ఆ వర్క్ పూర్తి అయ్యిందని నటుడిగా తన తర్వాత సినిమా మీద దృష్టి సారిస్తున్నానని ఆయన చేసిన పోస్టుతో మహేష్ జక్కన్న సినిమాలో నటిస్తున్నట్లు అందరికీ అర్థం అయింది.
Superstar @urstrulyMahesh & @PrithviOfficial !!#SSMB29 #MaheshBabu pic.twitter.com/z8l561tjor
— Mahesh Babu News🦁 (@MaheshBabuNews) March 5, 2025
ఒరిస్సాలో చిత్రీకరణకు ప్రియాంక చోప్రా కూడా!
ఒరిస్సాలో జరగనున్న సినిమా చిత్రీకరణలో గ్లోబల్ యాక్టర్ ప్రియాంక చోప్రా కూడా పాల్గొంటారని తెలిసింది. ఆవిడ కూడా ఈ సినిమాలో తాను నటిస్తున్నట్లు ఇప్పటి వరకు చెప్పలేదు. కానీ హైదరాబాద్ రెండు సార్లు వచ్చి వెళ్లారు. ప్రియాంక చోప్రా మదర్ మధు అయితే పృథ్వీరాజ్ తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఒరిస్సా షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఏపీలోని విశాఖతో పాటు శ్రీలంక, కెన్యా దేశాలలో చిత్రీకరణ చేయనున్నారు. ఇందులో మహేష్ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్ కాదని, కథానాయిక పాత్రకు మరొకరిని ఎంపిక చేసే ఆలోచనలో రాజమౌళి ఉన్నారని, ఆవిడ విలనీ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ పతాకం మీద కేఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.





















