అన్వేషించండి

Telangana MLC Election Results 2025: కమలం అంటే ఫ్లవర్ అనుకుంటివా, వైల్డ్‌ ఫైర్‌! రేవంత్ రెడ్డికి టీచర్స్, పట్టభద్రుల పవర్‌ఫుల్ మెసేజ్‌!

Telangana MLC Election Results 2025:రేవంత్ రెడ్డి సర్కార్‌కు పట్టభద్రులు, టీచర్స్ పవర్‌ఫుల్ మెసేజ్ ఇచ్చారు. కమలానికి బూస్టులా మారిన ఎన్నికలపై విశ్లేషకులు ఏమంటున్నారు?

Telangana MLC Election Results 2025: తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా విషయాలను చెబుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు స్పష్టమైన సిగ్నల్స్ అన్ని పార్టీలకు పంపించారు. ఇక్కడ మూడు స్థానాలకు ఎన్నికలు జరిగితే రెండింటిని బీజేపీ గెలుచుకుంది. ఇది అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి డేంజర్ బెల్స్‌ లాంటి ఫలితాలు. అందుకే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి మేల్కోవాల్సిన టైం వచ్చిందని అంటున్నారు విశ్లేషకులు.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతోంది. ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరు ప్రధానమైన గ్యారంటీలు ప్రజలకు ఇచ్చింది. వాటిని అమలు చేయడంలో తడబడుతోంది. అదే ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై స్పష్టంగా కనిపించింది. మహిళలకు ఉచిత బస్ హామీ ఒక్కటి తప్ప వేరే పథకాలు ఏవీ కూడా ప్రజలకు సరిగా అందడం లేదన్నది వినిపిస్తున్న మాట. అందుకే తాము ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నామని కాంగ్రెస్ నేతలే అంటున్నారు. వాటిని రూఢీ చేశాయని ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది వారి అభిప్రాయం. 

అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడానికి ఆపుసోపాలు పడుతోంది. వచ్చిన రోజే మహిళలకు ఫ్రీ బస్‌ పథకాన్ని అమలు చేసింది. తర్వాత ఆరోగ్య శ్రీలో రోగాల సంఖ్యతోపాటు అందులో కవర్ అయ్యే సొమ్మును కూడా పెంచింది. అక్కడికి ఏడాది తర్వాత రైతు రుణమాఫీ అమలులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మిగతా పథకాలు అమలుపరిచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 

హామీల అమలులో తడబాటు

భారీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఖాళీ ఖజానా చూసి నివ్వెరపోయిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆర్థిక స్థితిగతులు తెలియకుండా హామీలు ఇవ్వడం ఏంటనే విమర్శ కూడా ఉండనే ఉంది. అందుకే ప్రజలు కాంగ్రెస్ పాలన పట్ల సంతృప్తికరంగా లేరని అంటున్నారు. అదే ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్‌లో స్పష్టమైంది. ప్రజల్లో ఉన్న కాస్త అసంతృప్తిని మరింతగా మండేలా ప్రతిపక్షాల ప్రచారం చేసిందని చెప్పాలి. ఓవైపు బీఆర్‌ఎస్, మరోవైపు బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. 

కత్తులు దూసుకుంటున్న నేతలు 

కాంగ్రెస్‌ డీఎన్‌ఏలో ఉన్న కుమ్ములాటలు ఇక్కడ కూడా సర్వసాధారణైపోయాయి. బయటకు అందకూ ఒక్కటిగా ఉన్నట్టే కనిపిస్తున్నప్పటికీ లుకలుకలు మాత్రం లోచెదలా పార్టీని, ప్రభుత్వాన్ని బలహీనపరుస్తున్నాయన్నది నిజం. ఎన్నికల తర్వాత పార్టీ బలోపేతానికి కానీ, ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను తిప్పి కొట్టే ప్రతి వ్యూహం కాంగ్రెస్‌కు లేకుండా పోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆ పార్టీకి ముగ్గురు ఇన్‌ఛార్జ్‌లు మారారు. కానీ పార్టీలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ప్రత్యర్థులు దూసుకొస్తుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం తమపై తాము కత్తులు దూసుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడానికి ఇది కూడా ఓ కారణం.   

స్ట్రాంగ్ మెసేజ్

అన్నింటి కంటే ముఖ్యం మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసింది ఏదో తాయిళాలకు ఆశపడి వాళ్లు కాదు. అక్షరాస్యులు. అందరి కంటే ప్రభుత్వంపై వీరు పెట్టుకున్న ఆశలే ఎక్కువ. నిరుద్యోగ భృతి, ఉద్యోగ క్యాలెండర్ వంటి హామీలు పట్టభద్రులకు ఇచ్చింది కాంగ్రెస్, ఉపాధ్యాయులకు కూడా చాలా హమీలు ఇచ్చింది. ఏ హామీని కూడా నిలబెట్టుకోలేకపోయింది. ఇలాంటి చేదు ఫలితాలకు ఇవి కూడా మరో కారణం. అందుకే వీరు పంపించిన సిగ్నల్స్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేల్కొలుపు అంటూ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ సర్కారు ఉన్నప్పుడు పట్టభద్రుల స్థానానికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో వైసీపీ అభ్యర్థి ఓడిపోయారు. ఆ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. దీనిపై అప్పటి అధికార పార్టీ నేతలు మాట్లాడుతూ.... వాళ్లు తమ ఓటర్లు కారని అందుకే ఓడిపోయామన్నారు. తమ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వాళ్లు మాత్రమే వేరే ఉన్నారని వాళ్లే వచ్చే ఎన్నికల్లో తమకు ఓట్లు వేస్తారని భ్రమ పడ్డారు. కానీ డిగ్రీ చేసిన వాళ్లు మరికొందర్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తారని, వారి ఫ్యామిలీ మెంబర్స్‌ కూడా పథకాలు అందుకున్న వాళ్లే అన్న సంగతి మర్చిపోయారు. ఇదే వారి ఓటమికి మొదటి అడుగు వేసేలా చేసింది. 

రేవంత్ రెడ్డి అధికారులకు కత్తెర

ఇప్పటి వరకు ప్రభుత్వంలో, పార్టీలో రేవంత్ రెడ్డి ఏం చెబితే అది జరిగింది. మొత్తం తానే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఇప్పుడు ఈ ఓటమి ఆయన అధికారాలకు కత్తెర వేసే ఛాన్స్ లేకపోలేదనే వాదన ఉంది. ఆయనకు బయట శత్రువులు కంటే లోపల అంటే పార్టీలో ఉన్న ప్రత్యర్థులే ఎక్కువగా ఉన్నారు. అది ఆయన కేరీర్‌ను ప్రమాదంలోకి నెట్టేస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రేవంత్‌పై అధిష్ఠానానికి నమ్మకాలు సన్నగిల్లుతున్నాయనే ప్రచారం నడుస్తోంది. అపాయింట్‌మెంట్‌లు కూడా దొరకడం లేదనే మాటలు కూడా వినిపించాయి. 

తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను విశ్లేషించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తప్పులు జరగడం సహజమని వాటిని తెలుసుకొని సరి చేసుకొని ముందడుగు వేయడమే అసలైన నాయకత్వ పటిమకు నిదర్శనమని అంటున్నారు. ఓవైపు కాంగ్రెస్‌పై ప్రజల్లో అసంతృప్తి పెరగడమే కాకుండా బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోందనే భావన బలపడటం ప్రభుత్వానికి మంచిది కాదని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. బీజేపీని లైట్ తీసుకుంటే అసలకే ఎసరు వస్తుందని హెచ్చరిస్తున్నారు. 

Also Read :పట్టభద్రుల ఎమ్మెల్సీని గెల్చుకున్న బీజేపీ - హోరాహోరీ పోరులో ఓడిపోయిన కాంగ్రెస్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Falcon MD Amardeep Arrest: డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Rukmini Vasanth: 'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా
'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Falcon MD Amardeep Arrest: డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Rukmini Vasanth: 'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా
'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా
Most Cheapest Cars in India: భారత్‌లో ఏ కారు కొంటే అధిక ప్రయోజనం ? టాప్ 5 చౌకైన కార్ల జాబితా ఇదిగో
భారత్‌లో ఏ కారు కొంటే అధిక ప్రయోజనం ? టాప్ 5 చౌకైన కార్ల జాబితా ఇదిగో
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Countries with the Deadliest Snakes : పాముల ముప్పు ఎక్కువ ఉన్న దేశాలు.. ఇండియాలోని విషపూరితమైనవి ఇవే
పాముల ముప్పు ఎక్కువ ఉన్న దేశాలు.. ఇండియాలోని విషపూరితమైనవి ఇవే
Embed widget