TG ICET 2025: ఐసెట్ నోటిఫికేషన్ వచ్చేస్తోంది, మార్చి 10 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
TS ICET-2025 నోటిఫికేషన్ మార్చి 6న విడుదలకానుంది. దరఖాస్తు ప్రక్రియ మార్చి 10 నుంచి ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు మే 3 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

Telangana ICET 2025 Notification: తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఐసెట్ (TG ICET 2025) నోటిఫికేషన్ మార్చి 6న వెలువడనుంది. అభ్యర్థులు మార్చి 10 నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.550; బీసీ, జనరల్ అభ్యర్థులు రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆలస్య రుసుము లేకుండా మే 3 వరకు దరఖాస్తులు సమర్పించే అవకాశం కల్పించారు. జూన్ 8, 9 తేదీల్లో ఐసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ఉదయం 10 గంటల నుంచి 12.20 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది మహాత్మగాంధీ యూనివర్సిటీ ఐసెట్ పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐసెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ అలువాల రవి వ్యవహరిస్తున్నారు.
వివరాలు..
టీఎస్ ఐసెట్ - 2025
కోర్సులు - అర్హతలు..
1) ఎంసీఏ
అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ (బీసీఏ, బీఎస్సీ-కంప్యూటర్స్, బీకామ్, బీఏ). ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. అయితే ఇంటర్ స్థాయిలో కచ్చితంగా మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
2) ఎంబీఏ
అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ (బీఏ/ బీఎస్సీ/ బీకామ్/ బీబీఏ/ బీబీఎం/ బీసీఏ/ బీఈ/ బీటెక్/ బీఫార్మసీ). ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. అయితే ఇంటర్ స్థాయిలో కచ్చితంగా మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
వయోపరిమితి: ఐసెట్-2025 నోటిఫికేషన్ సమయానికి (06.03.2024) 19 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎలాంటి గరిష్ఠ వయసు లేదు.
టీఎస్ ఐసెట్-2025 షెడ్యూలు..
➥ టీఎస్ ఐసెట్-2025 నోటిఫికేషన్: 06.03.2025.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.03.2025.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 03.05.2025.
➥ రాతపరీక్ష తేదీలు: 08.06.2025 - 09.06.2025.
పరీక్ష సమయం: (FN) 10.00 A.M. to 12.30 P.M & (AN) 2.30 P.M. to 5.00 P.M
పరీక్ష విధానం:
మొత్తం 200 మార్కులకు ఐసెట్ ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు. పరీక్షలో మూడు సెక్షన్లు (సెక్షన్-ఎ, బి, సి) ఉంటాయి. వీటిలో సెక్షన్-ఎ: అనలిటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-బి: మ్యాథమెటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-సి: కమ్యూనికేషన్ ఎబిలిటీ-50 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి.
ALSO READ:
సీయూఈటీ యూజీ - 2025 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
దేశంలోని 46 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికిగానూ వివిధ యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న"కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ (CUET UG)-2025"కు సంబంధించి దరఖాస్తుల స్వీకరణను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రారంభించింది. మార్చి 22 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. అయితే మార్చి 23న రాత్రి 11.50 గంటల వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మే 8 నుంచి జూన్ 1 మధ్య పరీక్షలు నిర్వహించనుంది. మొత్తం 37 సబ్జెక్టులకు పరీక్షలు జరుగనున్నాయి.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..





















