Panchayudha Stotram: శత్రువులపై మీరు పైచేయి సాధించేందుకు ఈ 5 ఆయుధాలను మించినవి లేవు!
5 Weapons of Lord Vishnu : పంచాయుధాలు అంటే శ్రీ మహావిష్ణువుకి చెందిన 5 ఆయుధాలు..అవే సుదర్శనం, పాంచజన్యం, కౌమోదకి, నందకం, శార్ఙ్గం...వీటితో రక్షణ ఎలా సాధ్యమో ఇక్కడ తెలుసుకోండి..

Powerful Panchayudha Stotra: మీరు ధర్మ మార్గంలో ఉన్నా, అందరితో మంచిగా ఉన్నా కానీ శత్రువులు ఏర్పడతారు. మీరు సంపాదించే గౌరవ మర్యాదలు మీకు శత్రువులను పెంచుతాయి. ఇలాంట వారినుంచి రక్షణ కోసమే పంచాయుధ స్తోత్రం. ఎవరికీ ఎలాంటి హానీ చేయకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలన్నా, మీకు అన్ని సమస్యల నుంచి విముక్తి లభించాలన్నా ఈ స్తోత్రం ఉపయోగపడుతుంది. విష్ణుసహస్రనామంతో పాటు పంచాయుధస్తోత్రాన్ని కూడా పారాయణ చేస్తారు.
Also Read: 2025లో ఉగాది ఎప్పుడొచ్చింది - రాబోతున్న తెలుగు నూతన సంవత్సరం పేరు తెలుసా!
విష్ణువు ఆయుధాలు 5 - ఈ ఆయుధాలను కీర్తిస్తూ రాసినవే పంచాయుధ స్తోత్రం
సుదర్శనం - చక్రానికి ఉండే శక్తిని అందించే శ్లోకం
స్ఫురత్సహస్రారశిఖాతితీవ్రం సుదర్శనం భాస్కరకోటితుల్యమ్ |
సురద్విషాం ప్రాణవినాశి విష్ణోఃచక్రం సదాహం శరణం ప్రపద్యే||
పాంచజన్యం - శంఖం లాంటి శక్తిని అందించే శ్లోకం
విష్ణోర్ముఖోత్థానిలపూరితస్య యస్య ధ్వనిర్దానవదర్పహంతా |
తంపాంచజన్యం శశికోటిశుభ్రం శంఖం సదాహం శరణం ప్రపద్యే||
కౌమోదకి - గద లాంటి శక్తిని అందించే శ్లోకం
హిరణ్మయీం మేరుసమానసారాం కౌమోదకీం దైత్యకులైకహంత్రీమ్ |
వైకుంఠవామాగ్రకరాభిమృష్టాం గదాం సదాఽహం శరణం ప్రపద్యే||
నందకము - ఖడ్గం లాంటి శక్తిని అందించే శ్లోకం
రక్షోసురాణాం కఠినోగ్రకంఠ చ్ఛేదక్షరచ్ఛోణితదిగ్ధధారమ్ |
తంనందకం నామ హరేః ప్రదీప్తం ఖడ్గం సదాఽహం శరణం ప్రపద్యే||
శార్ఙ్గం - ధనస్సుకి సమానమైన శక్తిని అందించే శ్లోకం
యజ్జ్యానినాదశ్రవణాత్ సురాణాం చేతాంసి నిర్ముక్తభయాని సద్యః |
భవంతి దైత్యాశనిబాణవర్షి శార్ఙ్గం సదాఽహం శరణం ప్రపద్యే||
పంచాయుధ స్తోత్రం పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు
ఇమం హరేః పంచమహాయుధానాం స్తవం పఠేద్యోఽనుదినం ప్రభాతే |
సమస్త దుఃఖాని భయాని సద్యః పాపాని నశ్యంతి సుఖానిసంతి||
వనే రణే శత్రు జలాగ్నిమధ్యే యదృచ్ఛయాపత్సు మహాభయేషు |
ఇదం పఠన్ స్తోత్రమనాకులాత్మా సుఖీభవేత్ తత్కృత సర్వరక్షః||
యచ్చక్రశంఖం గదఖడ్గశార్ఙ్గిణం పీతాంబరం కౌస్తుభవత్సలాంఛితమ్ |
శ్రియాసమేతోజ్జ్వలశోభితాంగం విష్ణుం సదాఽహం శరణం ప్రపద్యే||
జలే రక్షతు వారాహః స్థలే రక్షతు వామనః |
అటవ్యాం నారసింహశ్చ సర్వతః పాతు కేశవః||
ఇతి పంచాయుధ స్తోత్రమ్ ||
Also Read: శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీ నక్షత్రానికి ఎన్ని సున్నాలు ఉన్నాయి.. ఉంటే ఏమవుతుంది!
ఆయుధాలు అంటే వస్తువులు కాదు మీలో అంతర్గతంగా ఉండే శక్తి. శ్రీ మహాలక్ష్మీదేవి, విష్ణువు ఇద్దర్నీ కలపి పూజించాలి. ఆ ఇద్దర్నీ కలపి పూజించే శ్లోకం ఇది.
ఈ శ్లోకం చదివితే శత్రువులు నాశనం అయిపోయారా అంటే.. అవుననే చెబుతారు పండితులు. శత్రువులు మూడు రకాలు... బయటి నుంచి వచ్చే శత్రువులు, మనలో ఉండే శత్రువులు..మూడో శత్రువు మన మాట. ఈ శత్రువులనుంచి విముక్తి కలిగిస్తుంది పంచాయుధ స్తోత్రమ్.
ఏ సాధన చేసినా కానీ మీకు మంచి జరగాలనే చేయాలి కానీ ఎదుటివారికి చెడుజరగాలని , నాశనం కావాలని కోరుకూడదు. అలా చేస్తే మీ సాధనకు ఎలాంటి ఫలితం ఉండదు.
Also Read: ఇలాంటి పనులు చేస్తే తొందరగా పోతారు.. మహాభారతంలో ఉంది!
గమనిక: పండితులు సూచించిన కొన్ని విషయాలు, ఆధ్యాత్మిగ గ్రంధాల్లో పొందుపరిచిన వివరాల ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని అనుసరించాలా వద్దా అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.






















