Mahabharatham: ఇలాంటి పనులు చేస్తే తొందరగా పోతారు.. మహాభారతంలో ఉంది!
Mahabharat: కొన్ని పనులు రెగ్యులర్ అలవాటులో భాగంగా చేసుకుంటూ వెళ్లిపోతారు..ఏం పర్వాలేదు అనుకుంటారు. కానీ వాటి కారణంగా మీ ఆయుష్షు తగ్గిపోతుందని మహాభారతంలో ఉంది...ఏ పనులు చేయాలి - ఏం చేయకూడదు?

Mahabharatham : కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత అంపశయ్యపై ఉన్న భీష్ముడు ధర్మరాజుకి చాలా విషయాలు చెప్పారు. ఆ సమయంలో రాజనీతి గురించి మాత్రమే కాదు.. నిత్య జీవితంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? రెగ్యులర్ గా మనం చేసే పనుల్లోనే మనకు తెలియకుండా చేసే చిన్న చిన్న తప్పిదాలేంటన్నది స్పష్టంగా వివరించారు.
ఆయుష్షు తగ్గించే పనులు
విద్య నేర్పించే గురువు మాట ధిక్కరించడం
పక్షులను చంపడం
పనీ పాటా లేకుండా గోళ్లు కొరుక్కోవడం
ఏ అవసరం లేకుండా పుల్లలను విరిచేయడం
ఉదయం సాయంత్ర సమయాల్లో సూర్యుడని తేరిపారా చూడడం
Also Read: మహాభారతం - స్నేహం 3 రకాలు, ఇందులో మీ ఫ్రెండ్స్ ఏ టైప్!
ఆయుష్షు పెంచే పనులు
నిజం మాత్రమే మాట్లాడడం
ఎప్పుడూ ప్రశాంతంగా ఉండడం
జీవహింస చేయకపోవడం
మూడు సంధ్యలలోనూ సంధ్యావందనం చేయడం
నిత్యం దేవతారాధన చేయడం
Also Read: మహాభారత యుద్ధంలో ఏరోజు ఎంతమంది చనిపోతారో ముందు రోజు రాత్రే క్లారిటీ ఇచ్చేసిన కృష్ణుడు
ఆయుష్షు క్షీణింపచేసే దోషాలు
ఇతరుల భార్యపై కన్నేయడం ..అందులోనూ మిత్రుడి భార్య, గురువు భార్య, తనకన్నా వయసులో పెద్దదైన యువతి, రాజు భార్య, వైద్యుల భార్య, సేవకుల భార్య, పండితుల భార్యను కోరడం ఇంకా దోషం
గోశాల దగ్గర, ఆలయాల దగ్గర, రచ్చబండల వద్ద మూత్రవిసర్జన చేయకూడదు..నిలబడి అస్సలు కూడదు.
నిలబడి భోజనం చేయడం, ఎంగిలిచేత్తో బ్రాహ్మణుడిని - ఆవుని - అగ్నిని తాకడం చేయరాదు
వేదాధ్యయం చేసే సమయంలో తలమీద చేతులు పెట్టుకోకూడదు
రెండు చేతులతో తలగోక్కోరాదు..తలకు పూసిన నూనె ఒంటికి రాసుకోకూడదు
గురువులు కోపించినా తిరిగి తిట్టరాదు..వారితో అబద్ధం చెప్పకూడదు
బ్రాహ్మణులు, క్షత్రియులు, ఆవులు, వృద్ధులు, బరువు మోసేవారు, గర్భిణిలు ఎదురువచ్చినప్పుడు తప్పుకుని దారివ్వకపోవడం మహా దోషం
స్నానం ఆచరించినప్పుడు ఓ కాలిని మరో కాలితో తోమకూడదు
వికలాంగులుడిని, దరిద్రుడిని, విద్యలేనివాడిని, అందవికారంతో ఉండేవారిని అపహస్యం చేయకూడదు
Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?
అస్సలు చేయకూడని పనులు ఇవి
పళ్ళు తోమేటప్పుడు , మూత్ర విసర్జన చేసే సమయంలో మాట్లాడకూడదు
సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో నిద్రపోకూడదు
ఉదయం దేవతార్చనకు ముందు ఎవరి దగ్గరకూ వెళ్లకూడదు
పెళ్లికి ముందు ఆ స్త్రీతో సంగమించకూడదు
ఉత్తరం, పడమర వైపు తలపెట్టి నిద్రపోకూడదు
ఒకరు విడిచిన దుస్తులు వేసుకోకూడదు
ఒకరు తిన్న ఆహారాన్ని తినకూడదు
ఏవేవో ఆలోచనలతో భోజనం చేయకూడదు
భోజనం సమయంలో ఉద్రిక్తంగా మాట్లాడకూడదు
ఎవరి చేతి నుంచి ఉప్పు, నూనె అందుకోకూడదు
రాత్రి పూట పెరుగు, తేనె తినకూడదు..ఎవరికీ పెట్టకుండా అస్సలు తినకూడదు
నెయ్యి, తేనె, పాయసం, నీరు మీరు తినగా, తాగగా మిగిలినవి ఎవరిరకీ ఇవ్వకూడదు
పగటిపూట దాంపత్య సౌఖ్యం కోరుకూడదు
పావురాలు, చిలుకలు, పుష్పలతలు, బంగారం వస్తువులు ఇంట్లో ఉండొచ్చు
గ్రద్ద, దీపం పురుగులు, గుడ్లగూబలు ఇంట్లోకి ప్రవేశించరాదు
రాత్రిపూట క్షురకర్మ, అభ్యంగన స్నానం చేయడం సరికాదు
పిలువకుండా ఎవరింటికీ భోజనానికి వెళ్లకూడదు
రజస్వల అయిన స్త్రీని అస్సలు ముట్టుకోకూడదు
Also Read: రామాయణం - మహాభారతం రెండింటిలోనూ కామన్ గా కనిపించే ముఖ్యమైన క్యారెక్టర్స్ ఇవే!






















