Mahabharat and Ramayan: రామాయణం - మహాభారతం రెండింటిలోనూ కామన్ గా కనిపించే ముఖ్యమైన క్యారెక్టర్స్ ఇవే!
Mahabharat and Ramayan: త్రేతాయుగం - ద్వాపరయుగం...ఈ రెండు యుగాల్లోనూ కామన్ గా కనిపించే క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే రామాయణం -మహాభారతం రెండింటిలోనూ ఉంటారు వీళ్లు...ఎవరెవరంటే...
Mahabharat and Ramayan: మహాభారతం - రామాయణం రెండింటిలోనూ కనిపించే పాత్రలివే....
హనుమంతుడు
సప్త చిరంజీవుల్లో ఒకడు హనుమంతుడు. అంటే ఇప్పటికీ బతికే ఉన్నాడని చెబుతారు...త్రేతాయుగంలో శ్రీరాముడి వెంటే ఉండి సీతమ్మ జాడ తెలియజేయడంతో పాటూ రావణుడి లంకపై దండెత్తి వెళ్లేందుకు శ్రీరాముడి సైన్యాన్ని ముందుండి నడిపించాడు ఆంజనేయుడు. ఆ తర్వాత మహాభారత యుద్ధంలో..అర్జునుడి రథంపై కూర్చుని తనని విజయం వరించేలా సహాయం చేశాడు...
పరశురాముడు
రామాయణంలో సీతా స్వయంవరంలో శివధనస్సు విరిచిన శ్రీరాముడికి..సవాల్ విసురుతాడు పరశురాముడు. ‘ రామా !నీ పరాక్రమము అద్భుతం! శివధనుస్సు ఎక్కుపెట్టావని తెలియగానే నీవెంతటి వాడివో తెలుసుకోవాలని మరొక ధనస్సు తీసుకొచ్చానంటాడు. ఇది అత్యంత దృఢమైన వైష్ణవధనువు అని చేతికందించాడు. దాన్ని కూడా ఎక్కుపెట్టాడు శ్రీరాముడు. ఆసమయంలో రాముడు తన సుదర్శన చక్రాన్ని పరశురాముడికి అప్పగించాడు. ద్వాపర యుగంలో పరశురాముడు అదే చక్రాన్ని శ్రీకృష్ణుడికి తిరిగి ఇచ్చాడని పురాణాల్లో చెబుతారు.
Also Read: ఎవరినైనా పొగిడినప్పుడు 'సాక్షాత్తు రామచంద్రుడే' అంటాం - రాముడిలో అంత గొప్పదనం ఏంటి!
జాంబవంతుడు
జాంబవంతుడి పాత్ర రామాయణంలో కనిపిస్తుంది...ఒంటిమిట్టలో కోదండ రామాలయం నిర్మించింది జాంబవంతుడే. అయితే త్రేతాయుగంలో జాంబవంతుడిని ఓ సందర్భంలో శ్రీరాముడు...నీ కోర్కె ఏంటో చెప్పు తీరుస్తానని అడిగాడు. అప్పుడు జాంబవంతుడు...స్వామీ మీతో ద్వంద యుద్ధం చేయాలని ఉందన్నాడు. ఈ కోర్కె ఈ జన్మలో తీరదు...నేను మరో అవతారంలో వచ్చినప్పుడు తీరుతుందని మాటిచ్చాడు శ్రీరాముడు. అలా ద్వాపరయుగంలో శ్రీ కృష్ణుడిగా అవతరించిన శ్రీ మహావిష్ణువు... శ్యమంతకమణి విషయంలో నిందలు పడడం, ఆ నిందను చెరిపేసుకునేందుకు జాంబవంతుడితో యుద్ధం చేసి మణిని తీసుకొచ్చి తిరిగి సత్రాజిత్తుకి ఇవ్వడం...ఈ కథ వినాయకచవితి రోజు చెప్పుకుంటాం. అలా త్రేతాయుగంలో ఇచ్చిన కోర్కెను ద్వాపరయుగంలో జాంబవంతుడితో ద్వందయుద్ధం చేసి తీర్చాడన్నమాట...
Also Read: వనవాసానికి వెళ్లేముందు తల్లిదండ్రులు, రాజగురువుతో రాముడి సంభాషణ ఇదే!
దుర్వాస మహర్షి
రామాయణం, మహాభారతాలను కూడా చూసిన మరో గొప్ప వ్యక్తి దూర్వాసుడు. ఓ పురాణం ప్రకారం దుర్వాసుడి శాపం కారణంగానే లక్ష్మణుడు రాముడికి ఇచ్చిన వాగ్ధానం ఉల్లంఘించాల్సి వచ్చిందని చెబుతారు (సీతకు కాపలా ఉండమని రాముడు చెప్పి వెళితే...మారీచుడి అరుపు విని సీతాదేవి వెళ్లమంటే లక్ష్మణరేఖ గీసి రాముడికే ప్రమాదం జరిగిందని భావించి వెళ్లిపోతాడు). ఇక మహాభారంతో కుంతీదేవికి.. దేవతా ఉపాసనా మంత్రాలను ఉపదేశించింది దూర్వాసుడే. ఆ మంత్రాల సాయంతో ఆమె కోరుకున్న దేవతలను ప్రార్థించి పిల్లల్ని పొందింది. పెళ్ళి కాక ముందు సూర్యుడిని ప్రార్థించి కర్ణుడిని కని నీటిలో వదిలేసింది.. పాండురాజుతో వివాహం తర్వాత కూడా ఇంద్రుడు, యముడు, అశ్వినీదేవతలను ప్రార్థించి సంతానాన్ని పొందింది.
Also Read: జై శ్రీరామ్ - మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు చెప్పయండిలా!
మయాసురుడు
మయుడు అసురుల, దైత్యుల, రాక్షసుల రాజు. మయాసురుడు అని కూడా పిలుస్తారు. మయుడు త్రిపుర అను మూడు ఎగిరే పట్టణాలు నిర్మించి వాటికి రాజుగా ఉన్నాడు. ఈ పట్టణాలు ఐశ్వర్యం, బలంతో ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించడంతో శివుడు వాటిని నాశనం చేస్తాడు. ఆ తర్వాత మయ రాష్ట్ర అనే పట్టణాన్ని నిర్మించి రాజధానిగా మార్చుకున్నాడు. అదే ఇప్పటి మీరట్. రామాయణంలో మయుడి ప్రస్తావన విషయానికొస్తే.. రావణుడు పెళ్లిచేసుకున్న మండోదరి తండ్రి మయుడు. మహాభారతంలో..ఇంద్రప్రస్థంలో పాండవులకు అద్భుతమైన భవనాన్ని నిర్మించి ఇచ్చింది మయుడే. ఆ భవనమే మయసభగా పేరొందింది.
ఈ ఐదుగురితో పాటూ అగస్త్యుడు, శక్తి మహర్షి, భారద్వాజ మహర్షి, కుబేరుడు ఇంకా చాలామంది త్రేతాయుగం, ద్వారపయుగం రెండింటిలోనూ కనిపిస్తారు...