అన్వేషించండి
అమావాస్య రోజున ఉపవాసం చేస్తున్నారా? పాటించాల్సిన నియమాలివే!
అమావాస్య రోజు పితృకార్యాలు ఆచరిస్తారు. ఈ సందర్భంగా దాన, ధర్మాలు చేస్తారు. ఉపవాస నియమాలు పాటిస్తారు. ఈ సమయంలో పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకుందాం ..
Amavasya 2025 vrat
1/7

కార్తీక అమావాస్యను అగహన్ అమావాస్య అని కూడా పిలుస్తారు. ఇది హిందూ ధర్మంలో పవిత్రమైన , ప్రత్యేకమైన తేదీగా పరిగణిస్తారు. ఈ సంవత్సరం కార్తీక అమావాస్య గురువారం నవంబర్ 20న వచ్చింది
2/7

అమావాస్య తిథిని పితృ కార్యాలు, దానధర్మాలు, స్నానం, ధ్యానం , వ్రతాల వంటి వాటి కోసం ప్రత్యేకంగా ముఖ్యమైనదిగా భావిస్తారు. అదేవిధంగా, చాలా మంది ఈ ప్రత్యేక రోజున ఉపవాసం కూడా ఉంటారు. సరైన నియమాలను అనుసరించి అమావాస్య వ్రతం ఆచరించడం ద్వారా పితృదేవతల అనుగ్రహం లభిస్తుందని ... మనస్సు, ఆత్మ రెండూ శుద్ధి అవుతాయని నమ్మకం.
3/7

మీరు కూడా గురువారం నాడు అమావాస్య వ్రతం ఆచరిస్తుంటే, వ్రతం సమయంలో మీరు ఏం తినాలి , ఏం తినకూడదో తెలుసుకోండి.
4/7

శాస్త్రాలలో వ్రతం సమయంలో ఆహారం గురించి కొన్ని నియమాలున్నాయి. అమావాస్య వ్రతం సమయంలో పూర్తిగా ఫలాహారం పాటించాలి. మీరు సీజనల్ పండ్లు, జ్యూస్, డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు.
5/7

అమావాస్య వ్రతం సాత్వికత , పవిత్రతకు చిహ్నం. ఉపవాసంలో చాలా మంది సైంధవ లవణం తో చేసిన వస్తువులు, కట్టు పిండితో చేసిన రొట్టెలు, పాయసం కూడా తింటారు. కానీ ఉపవాసంలో తేలికపాటి ఆహారం మాత్రమే తీసుకోవాలి.
6/7

వ్రతం సమయంలో కంది, పెసర, మసూర్, రాజ్మా, శనగలతో పాటు, మినుము వంటి పప్పుధాన్యాలు తినకూడదు. సొరకాయ, దొండ, పాలకూర వంటి కొన్ని కూరగాయలు కూడా తినకూడదు.
7/7

అంతేకాకుండా ఉపవాసంలో సాధారణ ఉప్పు, ఉల్లిపాయ-వెల్లుల్లి, గుడ్డు లేదా మాంసం-చేపలు, అధిక నూనె కలిగిన పదార్థాలు నూడుల్స్, బిస్కెట్లు, బ్రెడ్, నంకీన్, చిప్స్ వంటి ప్యాక్ చేసిన ఆహారాలను కూడా తినకూడదు.
Published at : 20 Nov 2025 06:00 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















