Mahabharat: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?
కౌరవులు అంతం అవడంతో మహాభారతం ముగిసిపోలేదు. ఆ తర్వాత పాండవులు, యాదవ వంశం, కృష్ణుడి మరణం సంభవించాయి. అన్నిటి కన్నా ముఖ్యమైన విషయం కృష్ణుడి మరణం (అవతారం చాలించడం) ఎలా జరిగిందంటే..
శ్రీ కృష్ణుడు అవతారం చాలించాడు, ఆతర్వాత ద్వారక నీటమునిగిందని చెబుతారు.. అయితే తనకు తానుగా అవతారం చాలించలేదని.. గాంధారి శాపం కారణంగా మహాభారత యుద్ధం ముగిసిన మూడున్నర దశాబ్ధాల తర్వాత కృష్ణుడు అవతారం చాలించాడని చెబుతారు.
గాంధారి శాపం
కురుక్షేత్ర యుద్ధంలో తన వందమంది సంతానాన్ని పోగొట్టుకున్న గాంధారి.. ద్వారక మునిగిపోవాలని, కృష్ణుడు 36 ఏళ్లలో మరణించాలని శాపం పెడుతుంది. మహాభారత యుద్ధం చివరి రోజున పాండవులు ఆనందించకపోగా తమ బంధువులు, సైనికుల మరణం పట్ల చింతిస్తారు. ఈ విధ్వంసం మొత్తం చూసిన కృష్ణుడు కూడా నిశ్చేష్టుడై ఉండిపోతాడు. ఆ సమయంలో దూరం నుంచి గట్టిగా ఏడుపులు వినిపిస్తుంటాయి. ఆ ఏడుపు గాంధారిది. ఆమె తన మొదటి సంతానం దుర్యోధనుడి దగ్గర కూర్చుని ఏడుస్తుంటుంది. ఆ సమయంలో పాండవులు, కృష్ణుడు వచ్చారని గాంధారికి చెబుతాడు సంజయుడు. ఆగ్రహంతో ఊగిపోయిన గాంధారి..నేను నిత్యం పూజించే శ్రీమహావిష్ణువు అయినా నువ్వు ఈ విధ్వంసాన్ని ఆపలేకపోయావని దుమ్మెత్తిపోస్తుంది. విష్ణువు రూపమైన నీకు సాధ్యం అయి కూడా ఆపని చేయలేదని నిందిస్తుంది. మీ తల్లి దేవకిని అడుగు..బిడ్డలు పోయిన బాధేంటో తెలుస్తుంది...ఆమె ఏడుగురు పిల్లలను పుట్టిన వెంటనే కోల్పోయింది..నేను నా నూరుగురు కొడుకులను యుద్ధంలో కోల్పోయానని శోకాలు పెడుతుంది.
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే..
గాంధారి మాటలు విన్న కృష్ణడు ఓ చిరునవ్వు నవ్వి..ఇదంతా జరుగుతుందని ముందే దుర్యోధనుడికి మిగతా కౌరవులకు కూడా చెప్పానని అంటాడు. అప్పటికీ ఆగ్రహం చల్లారని గాంధారి.. నా విష్ణు భక్తి నిజమైతే నా పతిభక్తిలో ఎలాంటి లోపం లేకపోతే ఈరోజు నుంచి 36ఏళ్లలో నువ్వు మరణిస్తావని శపిస్తుంది. అంతేకాదు.. యాదవులు కూడా ఒకర్నొకరు కొట్టుకు చస్తారని, ద్వారక నీట మునుగుతుందని శపిస్తుంది. ఆ తర్వాత కాసేపటికి ఆవేశం చల్లారి..తాను పెట్టిన శాపం గుర్తుచేసుకున్న గాంధారి కృష్ణుడి పాదాలపై పడి ఏడుస్తుండగా.. ఆమెను పైకి లేపిన కృష్ణుడు ఆ శాపాన్ని అంగీకరిస్తాడు.
ఆ తర్వాత 36 ఏళ్లు కృష్ణుడు సత్యభామ, రుక్మిణితో సంతోషంగా జీవిస్తాడు. తరువాత్ 36 ఏళ్ళు భార్య రుక్మిని కుమారౌడు సాంబతో సంతోషంగా జీవిస్తాడు. ఓ సారి సప్త రుషులంతా శ్రీకృష్ణ, బలరాముల్ని చూసేందుకు ద్వారకను సందర్శిస్తారు. ఆ సప్త రుషులను ఆటపట్టించేందుకు సాంబ ఒక చిలిపి పని చేస్తాడు. ఆడపిల్ల వేషంలో గర్భవతిలా నటిస్తాడు... దీంతో ఆగ్రహానికి గురైన రుషులు..అదే నిజమై నీ గర్భంలోంచి జన్మించిన బిడ్డద్వారా మీ యాదవవంశం నాశనమవుతుందని శపిస్తారు. అదే జరుగుతుంది.
Also Read: అభిమన్యుడు, ఘటోత్కచుడు సహా ఈ 15 మంది పాండవుల సంతానమే..
ఇక గాంధారి శాపం..కృష్ణుడి అవతారం చాలించడం విషయానికొస్తే... గాంధారి శాపం గుర్తుచేసుకుని యాదవ వంశం నాశనమైపోయింది, 36 ఏళ్లు గడిచిందినే శోకంతో ఓ చోట కాలిపై కాలు వేసుకుని ఆలోచనలో మునిగిపోతాడు. ఆ సమయంలో కదులుతున్న కాలివేలు చూసి పక్షి అని భ్రమపడి వేటగాడు బాణం వేస్తాడు. అలా శ్రీకృష్ణుడు అవతారం చాలిస్తాడు. ఆ తర్వాత కృష్ణుడికి అంత్యక్రియలు నిర్వహించగా..శరీరం మొత్తం కాలిపోయినా గుండె మాత్రం అలాగే కొట్టుకుంటూ ఉండిపోయిందని చెబుతారు.
కృష్ణుడి గుండె ఇప్పుడు ఎక్కడ ఉందో రేపటి కథనంలో చూద్దాం...
Also Read: ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 1
Also Read: భగవద్గీత మా అమ్మ లేని లోటు తీర్చిందన్న స్వాతంత్ర్య సమరయోధుడెవరు… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 2
Also Read: ఆనందం ఎక్కడ దొరుకుతుంది… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 3
Also Read: మనసు నిగ్రహంగా ఉండాలంటే ఏం చేయాలి… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 4
Also Read: భగవద్గీత బోధన తర్వాత విశ్వరూపం చూసింది కేవలం అర్జునుడు మాత్రమే కాదు.. మరో మగ్గురున్నారు, ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 5
Also Read: జీవితకాలంలో ఈ ఏడు క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకుంటే.. స్వర్గలోకంలోకి ఎంట్రీ ఖాయమట
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి