Geetha Jayanthi Special: ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 1
భగవద్గీత గురించి మీకు ఎంతవరకూ తెలుసు..చదివారా, విన్నారా, రెండూ చేయలేదా. అయితే చదివిన వారికి ఎంతవరకూ గుర్తుంది, చదవని వారు తెలుసుకోవాల్సినదేంటి. ఈ ప్రశ్నలకు సమాధానం తెలిస్తే భగవద్గీతపై అవగాహన ఉన్నట్టే
సాక్షాత్తూ శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించిన జీవిత సారాంశమే భగవద్గీత. కురుక్షేత్ర సంగ్రామంలో తన సోదరులని, బంధువులని, గురువులని, స్నేహితులని చూసి, హృదయం వికలమై.. రాజ్యం కోసం వారిని నేను వధించలేనని బాధపడిన అర్జునుడికి చెప్పిన బ్రహ్మజ్ఞానం భగవద్గీత. ఈ పవిత్రగ్రంధ్రం ఆవిర్భవించిన రోజైన మార్గశిర శుక్ల ఏకాదశిని గీతా జయంతిగా జరుపుకుంటారు. భగవధ్గీతలో మొత్తం 700 శ్లోకాలున్నాయి. ఉరకల పరుగుల జీవనంలో మొత్తం చదివే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. అందుకే చదివిన వారికి ఎంతవరకూ అర్థమైంది, చదవని వారు తెలుసుకోవాల్సిన విషయాలను కొన్ని ప్రశ్నలు
సమాధానాల రూపంలో ఇస్తున్నాం.
1. భగవద్గీతను రాసినదెవరు?
విఘ్నేశ్వరుడు
2. భగవద్గీత మహాభారతంలో ఏ పర్వంలోని భాగం?
భీష్మ పర్వము.
3. గీతాజయంతి ఏ మాసంలో ఎప్పుడు వస్తుంది?
మార్గశిర మాసం, ఏకాదశి
4. గీతాజయంతి ఏ ఋతువులో వస్తుంది?
హేమంత ఋతువు
5. ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పాడు?
వసంత ఋతువు
Also Read: భగవద్గీత పూజించడానికి మాత్రమే కాదు.. మనిషిగా బతకడానికి
6. భగవద్గీత ఎవరు ఎవరికి బోధించారు?
శ్రీకృష్ణుడు అర్జునుడికి
7. భగవద్గీత ఏ సంగ్రామ సమయంలో ఆవిర్భవించింది?
కురుక్షేత్ర సంగ్రామం
8. భగవద్గీత బోధిస్తున్న సమయంలో ఎవరెవరికి యుద్ధం జరుగుతోంది?
కౌరవ పాండవులకు
9. పాండవులలో ఎవరికి శ్రీకృష్ణుడు రథసారధి?
అర్జునుడు
10. వేదాల్లో తాను ఏ వేదమని శ్రీకృష్ణుడు చెప్పాడు?
సామవేదం
Also Read: ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని- ప్రపంచ సాంస్కృతిక నగరం… వారణాసి గొప్పతనం ఇదే..
11. మహాభారత సంగ్రామ ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరేమిటి?
పాంచజన్యం
12. భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలున్నాయి?
పద్దెనిమిది (18)
13. “నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడ్డాయో, నా బుద్ధి వికాసానికి భగవద్గీత అంతకంటే ఎక్కువ ఉపయోగపడింది” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోథుడెవరు?
వినోబా భావే
14.“సంశయములు నన్నావరించినపడు, సంకటములు సంప్రాప్తమైనపుడు, నిరాశా నిస్పృహలు జనించినపుడు నేను భగవద్గీత తెరచి చూస్తా. అందు ఏదో ఒక శ్లోకము నన్నూరడించును.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?
మహాత్మా గాంధీ
15. భగవద్గీతకు ప్రథమ ప్రచారకుడెవరు?
సంజయుడు.
Also Read: వారణాసి మహిమను వివరించే కాశీవిశ్వనాథ్ కారిడార్.. అక్కడ అణువణువూ ప్రత్యేకమే
16. సేనానాయకుల్లో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాడు?
కుమారస్వామి.
17. మహాభారత సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఊదిన శంఖం పేరేంటి?
దేవదత్తం
18. భగవద్గీతలో వ్యాసుడు ఎన్ని ఛందస్సులు రాశారు?
ఐదు. (అనుష్టుప్, ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర, ఉపజాతి, విపరీతపూర్వ)
19. భగవద్గీతను సాక్షాత్తుగా (లైవ్) వినినవారెవరు?
నలుగురు ( అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, హనుమంతుడు)
20. ఆయుధాలు ధరించిన వారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాడు?
శ్రీరామచంద్రుడు
Also Read: శవాలు దహనం చేసే ఘాట్ సహా కాశీలో ముఖ్యమైన ఘాట్లు ఇవి..
Also Read: కాశీలో వదిలేయాల్సింది కాకరకాయో, కమలాపండో కాదు…
Also Read: జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలివి
Also Read: నీరు, నిప్పు, నింగి, గాలి, పృథ్వి .. పంచభూత శివలింగాలు ఎక్కడ ఉన్నాయంటే..
Also Read: ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని- ప్రపంచ సాంస్కృతిక నగరం... వారణాశి గొప్పతనం ఇదే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి