By: ABP Desam | Updated at : 13 Dec 2021 01:08 PM (IST)
Edited By: RamaLakshmibai
Image Credit/ TheScentGuruGroup Twitter
ఏ ఆలయానికి వెళ్లినా, ఎక్కడ స్వామిని దర్శించుకున్నా జీవించాలని కోరుకుంటారు. కానీ జీవన్ముక్తి పొందాలని తపించే ఏకైక క్షేత్రం కాశీ. సాక్షాత్తు పరమశివుడు కొలువైన దివ్యస్థలం.
‘నగాయత్య్రా సమో మంత్రమ్ న కాశీ సదృశీ పురీ,
నవిశ్వేశ సమంలింగం సత్యం సత్యం పునః పునః’
ఇది కాశీ మహాత్మ్యంలోని మొదటి శ్లోకం. గాయత్రీ మంత్రంతో సరితూగే మంత్రం, కాశీపురానికి సమానమైన పుణ్య స్థలం, ఇక్కడి విశ్వేశ్వర లింగానికి సాటివచ్చే శివస్వరూపం ఏదీ లేదు అని అర్థం. కాశీని విశ్వేశ్వరుడు ఎప్పుడూ విడిచిపెట్టి ఉండడు కాబట్టి దీనికి అవిముక్త క్షేత్రం అని పేరొచ్చింది. కపిల మహర్షి శాపానికి గురైన తన పూర్వీకులందరికీ ఉత్తమగతులు కల్పించటానికి భగీరథుడు ఎంతో కష్టపడి స్వర్గలోకాల నుంచి గంగను భూమికి తెచ్చి కాశీలో ఉన్న మణికర్ణికలో విడిచిపెట్టాడు. ఆనాటి నుంచి ఈ నగరానికి మరింత పవిత్రత వచ్చింది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ విశ్వేశ్వర దర్శనం ఇతర లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రదమని భక్తుల విశ్వాసం. ఇక్కడ గంగానదిలో స్నానమాచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులౌతారని నమ్మకం.
Also Read: దక్షుడు, ఇంద్రుడు, చంద్రుడు, రాముడు, కుమారస్వామి ప్రతిష్టించిన శివలింగాలివే...
వరుణ, అసి అనే రెండు నదుల సంగమాల మధ్య వున్నందున వారణాసి అనే పేరువచ్చిందని చెబుతారు. వారణాసి పేరును పాళీభాషలో బారణాసిగా రాసేవారు. ఆ తర్వాత బవారాస్ గా మారింది. ఈనగరాన్ని పురాణ ఇతిహాసాల్లో అవిముక్తక, ఆనందకానన, మహాస్మశాన, సురధాన, బ్రహ్మవర్ధ, సుదర్శన, రమ్య, కాశి అనే పేర్లతో ప్రస్తారించారు. వారణాశిలో మరణం సంభవిస్తే మోక్షం వస్తుందని భావిస్తారు. అందుకే ముక్తి స్థలం అంటారు. సుమారు 5,000 సంవత్సరాల క్రితం శివుడు వారాణసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాథల సారాంశం. ఇది హిందువుల ఏడు పవిత్ర నగరాలలో ఒకటి. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కాంద పురాణం వంటి ఎన్నో భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాల్లో కాశీనగరం ప్రసక్తి ఉంది. అయోధ్య, మథుర, గయ,కాశి, అవంతిక, కంచి, ద్వారక నగరాలను సప్తముక్తి పురాలని చెబుతారు. కాశీలో ప్రతిరోజూ సాయంత్రం హారతి, ప్రార్థనలు భక్తులను కట్టిపడేస్తాయి.
Also Read: నీరు, నిప్పు, నింగి, గాలి, పృథ్వి .. పంచభూత శివలింగాలు ఎక్కడ ఉన్నాయంటే..
అయితే కాశీకి వెళ్తే ఏ కాయో..పండో వదిలేయాలని అంటారు.అందులో అసలు మర్మమేంటో తెలుసా? వాస్తవానికి కాశీలో కాయో-పండో వదిలేయాలని ఏ శాస్త్రము చెప్పలేదు. శాస్త్రం చెప్పిన విషయాన్ని కొందరు తెలిసీ తెలియని పరిజ్ఞానంతో అలా మార్చేశారు. ఇంతకీ శాస్త్రం ఏం చెప్పిందంటే…కాశీక్షేత్రం వెళ్లి గంగలో స్నానం చేసిన వారు కాయాపేక్ష, ఫలాపేక్షను గంగలోనే వదిలి విశ్వనాథుడి దర్శనం చేసుకుని ఇంటికి తిరుగుముఖం పట్టాలని అంతరార్థం. ఇక్కడ కాయాపేక్ష, ఫలాపేక్ష అంటే…కాయం అంటే శరీరం…శరీరంపై ఆపేక్షని, ఫలం అంటే కర్మఫలం…కర్మఫలముపై ఆపేక్షని పూర్తిగా వదిలేసి నిజమైన భక్తితో ఈశ్వర చింతన కలిగి ఉండాలని అర్థం. కాలక్రమేణా అది కాయ, పండుగా మారిపోయింది.
Also Read: ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని- ప్రపంచ సాంస్కృతిక నగరం... వారణాశి గొప్పతనం ఇదే..
అంతేకానీ కాశీకి వెళ్లి ఇష్టమైన కాయగూరలు, పండ్లు, ఆకులు గంగలో మునకేశాక వదిలేస్తే అందులో నిజమైన పుణ్యం ఏమీ దక్కదు. శాస్త్రం ఎలా చెప్పిందో అలా అర్థం చేసుకుని ఆ క్షేత్ర దర్శనం, సంప్రదాయం పాటిస్తే నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతుంది. జామపండు, మామిడిపండు, పనసపండు కాశీలో వదిలేసినంత మాత్రాన వచ్చే ఫలితం ఏమీ ఉండదు. ప్రతి మనిషీ జీవిత చరమాంకంలో బంధాలు, రాగద్వేషాలు, తోటివారితో వివాదాలు వదిలిపెట్టి కాశీ యాత్ర చేయడజం వెనుక అసలు అంతరార్థం ఇదే. విశ్వనాథుడి దర్శానంతరం మృత్యువు దరిచేరేవరకూ మనసును ఆ పరమశివుడిపై లగ్నం చేయాలి..
Also Read: శనివారం ఈ వస్తులు కొన్నా-తీసుకున్నా ….శని మిమ్మల్ని వదలదంట
Also Read: ద్వారానికి అటు ఇటు ఉండి ఏమీ తీసుకోకూడదంటారు ఎందుకు...
Also Read: జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలివి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Sri Rama Navami 2023: ఈ ఒక్క శ్లోకం చదివితే చాలు విష్ణు సహస్రనామం పఠించినంత ఫలితం అని ఎందుకంటారు!
Sri Rama Navami 2023: శ్రీరామనవమి సందర్భంగా ఈ శ్లోకాలు పిల్లలకు నేర్పించండి, నిత్యం చదువుకుంటే ఇంకా మంచిది
Astrology News: మీ రాశి ప్రకారం వివాహానికి, శుభకార్యాలకు మీకు కలిసొచ్చే తేదీలు, రంగులు
మార్చి 28 రాశిఫలాలు - ఈ రోజు ఈ రాశులవారి ఆదాయం, ఆనందం పెరుగుతుంది
పెళ్లికాని యువతులు సింధూరం పెట్టుకుంటే ఆ కోరికలు పెరుగుతాయా? వివాహితులే ఎందుకు పెట్టుకోవాలి?
పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి క్లారిటీ - అనుమానంగా ఫోన్లు పెట్టేశారని ఆవేదన
Modi Flexis on Flyover: హైదరాబాద్ ఫ్లై ఓవర్ పిల్లర్లపై మోదీ పోస్టర్లు, ఇంకెన్నాళ్లు కడతారని విమర్శలు
మార్గదర్శి కేసులో మరో సంచలనం- రామోజీరావు, శైలజకు ఏపీ సీఐడీ నోటీసులు
Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు ట్రాపిక్ అలర్ట్ - 90 రోజుల పాటు అటు చూడొద్దు!
EPFO: శుభవార్త వచ్చేసింది, EPF వడ్డీ రేటు 8.15%కు పెంపు