Shambhala Review : 'శంబాల' టీం ఫుల్ జోష్ - హిందీ వెర్షన్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్!... ముంబైలో ప్రమోషన్స్
Shambhala Hindi Version : ఆది సాయి కుమార్ హీరోగా నటించిన 'శంబాల' బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో హిందీ వెర్షన్ సైతం రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Aadi Sai Kumar's Shambhala Hindi Version Release Date Locked : టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ చాలా రోజుల తర్వాత రీసెంట్ సూపర్ నేచరల్ థ్రిల్లర్ 'శంబాల'తో హిట్ కొట్టారు. రిలీజ్ అయిన అన్నీ చోట్లా పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది. కేవలం మౌత్ టాక్‌తోనే కలెక్షన్స్ సైతం పెరుగుతున్నాయి. గురువారం రిలీజ్ అయిన మూవీకి అన్నీ వర్గాల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుండగా... ఇదే జోష్‌తో హిందీ వెర్షన్ సైతం రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
హిందీ వెర్షన్ రిలీజ్ ఎప్పుడంటే?
న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న 'శంబాల'ను హిందీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సెన్సార్ సర్టిఫికెట్ కోసం వెయిట్ చేస్తున్నట్లు ప్రొడ్యూసర్స్ మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నబీమోజు తెలిపారు. ఈ క్రమంలో ట్రేడ్ వర్గాల్లో ఉత్సాహం నెలకొంది. తెలుగులో మంచి వసూళ్లు సాధించిన మూవీ హిందీలోనూ అంతే స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుందని మూవీ టీం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
ఇదివరకూ ఎవరూ టచ్ చేయని కొత్త పాయింట్ టచ్ చేయడం, సైన్స్, శాస్త్రానికి మధ్య సంఘర్షణను స్క్రీన్‌పై డైరెక్టర్ యుగంధర్ ముని అద్భుతంగా ప్రజెంట్ చేశారు. విజువల్స్, ఆర్ఆర్ గురించే అందరూ చర్చించుకుంటున్నారు. ఆది సాయి కుమార్ నటన ఒకెత్తు అయితే.. టెక్నికల్ టీం చేసిన మాయాజాలం మరో ఎత్తు. ప్రస్తుతం ‘శంబాల’ హిందీ మార్కెట్‌పై కన్నేసింది. త్వరలోనే మేకర్స్ ముంబైలో ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు.
Also Read : ఓటీటీలో 'OG' విలన్ కోర్ట్ రూమ్ డ్రామా 'హక్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
2 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
'శంబాల' ప్రీమియర్స్‌తోనే మంచి ఓపెనింగ్స్ సాధించింది. కేవలం మౌత్ టాక్‌తోనే థియేటర్లకు జనాలు క్యూ కడుతున్నారు. ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద రూ.3.3 కోట్ల వసూళ్లు కాగా... రెండో రోజు రూ.2.10 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తంగా 2 రోజుల్లోనే రూ.5.40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ మేరకు మూవీ టీం అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసింది. వీకెండ్ కావడంతో కలెక్షన్స్ మరింత పెరగొచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
View this post on Instagram
మూవీలో ఆది సాయి కుమార్, యంగ్ హీరోయిన్ అర్చన అయ్యర్ ప్రధాన పాత్రలు పోషించారు. వీరితో పాటు స్వాసిక, మీసాల లక్ష్మణ్, మధు నందన్, ఇంద్రనీల్, అన్నపూర్ణమ్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యుగంధర్ ముని దర్శకత్వం వహించగా... షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మించారు.
స్టోరీ ఏంటంటే?
'శంబాల' అనే ఊరిలో ఓ రోజు ఆకాశం నుంచి ఉల్క పడుతుంది. గ్రామస్థులంతా దీన్ని బండ భూతం అంటుంటారు. ఉల్క పడిన నాటి నుంచీ ఊరిలో కొంతమంది వింతగా ప్రవర్తిస్తూ దొరికిన వారిని చంపేస్తుంటారు. ఓ ఆవు పాలకు బదులుగా రక్తం ఇవ్వడంతో దాన్ని చంపేయాలని ఓ స్వామీజీ సూచిస్తాడు. మరోవైపు, ఉల్కను పరీక్షించేందుకు వచ్చిన జియో సైంటిస్ట్ విక్రమ్ (ఆది సాయికుమార్) గ్రామస్థుల నుంచి ఆ ఆవును కాపాడతాడు.
అసలు ఆ గ్రామంలో ఏం జరుగుతుంది? వరుస మరణాలకు కారణమేంటి? ఊరిలో కనిపించే దేవి (అర్చన అయ్యర్) ఎవరు? గ్రామంలో మిస్టరీని విక్రమ్ ఛేదించాడా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.






















