Eesha Box Office Collections Day 2 : ఆడియన్స్‌ను భయపెడుతోన్న 'ఈషా' - రెండు రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే?
Eesha Collections : హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ హారర్ థ్రిల్లర్ 'ఈషా' మంచి టాక్ సొంతం చేసుకుంది. తెలుగు రెండు రోజుల్లో బెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది.

Hebah Patel's Eesha Two Days Collections In Ap And Telangana : త్రిగుణ్, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ 'ఈషా'. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ థియేటర్లలో ఆడియన్స్‌ను భయపెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల్లోనే మంచి కలెక్షన్స్ రాబట్టింది.
2 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో 'ఈషా' దూసుకెళ్తోంది. ఏపీ, తెలంగాణల్లో రెండు రోజుల్లో రూ.3.6 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మూవీ టీం వెల్లడించింది. 'ది ఫియర్ కలెక్షన్స్... పెరుగుతున్నాయ్' అంటూ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ మూవీకి శ్రీనివాస్ మన్నే దర్శకత్వం వహించగా... హెబ్బా పటేల్, త్రిగుణ్‌లతో పాటు అఖిల్ రాజ్, సిరి హన్మంతు, పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించారు.
కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పోతుల హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్, వంశీ నందిపాటి మూవీని రిలీజ్ చేశారు.
View this post on Instagram
Also Read : రెండో రోజూ స్టడీగా 'శంబాల'... ఐదు కోట్ల క్లబ్బులో ఆది సాయికుమార్ సినిమా
స్టోరీ ఏంటంటే?
దెయ్యాలు, ఆత్మలు లేవని నమ్మే ఓ ఫ్రెండ్స్ బ్యాచ్‌కు అవి ఎదురైతే ఎలా ఉంటుందో చూపించిందే 'ఈషా' మూవీ. కల్యాణ్ (త్రిగుణ్), నయన (హెబ్బా పటేల్), వినయ్ (అఖిల్ రాజ్), అపర్ణ (సిరి హన్మంతు) నలుగురు చిన్నప్పటి నుంచీ బెస్ట్ ఫ్రెండ్స్. దెయ్యాలు అసలే లేవని నమ్మే వీరు మూఢ నమ్మకాల పేరుతో ప్రజల్ని దోచుకునే దొంగబాబాల పని పట్టాలని నిర్ణయించుకుంటారు. అలా వాళ్లకు ఆంధ్ర ఒడిశా సరిహద్దులో ఉండే దేవ్ (పృథ్వీరాజ్) బాబా గురించి తెలుస్తుంది.
దీంతో అతని ఆట కట్టించాలని అక్కడకు బయలుదేరుతారు. 'ఆత్మలు ఉన్నాయని నేను నిరూపిస్తా' అంటూ దేవ్ బాబా వాళ్లకు సవాల్ విసురుతాడు. అందులో భాగంగా ఈ నలుగురూ ఓ పాడుబడిన బంగ్లాలో 3 రోజులు ఉండేందుకు రెడీ అవుతారు. అక్కడ వాళ్లకు వింత భయానక అనుభవాలు ఎదురవుతాయి. అసలు ఆ బంగ్లాలో ఏం ఉంది? దెయ్యాలున్నాయా? ఆ ప్రదేశానికి ఆత్మలకు సంబంధం ఏంటి? ఈ నలుగురిని చంపాలని ఓ వ్యక్తి శరీరంలో దూరిన ఆత్మ ఎవరిది? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.






















