అన్వేషించండి

Spirituality: ద్వారానికి అటు ఇటు ఉండి ఏమీ తీసుకోకూడదంటారు ఎందుకు...

ద్వారం లేదా గడపకి అటొకరు-ఇటొకరు ఉండి ఏవీ అందుకోకూడదు అని చెబుతుంటారు. ముఖ్యంగా డబ్బులైతే అస్సలే తీసుకోవద్దంటారు. కానీ ఎందుకు అని అడిగితే మాత్రం క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడతారు. అసలు కారణం ఏంటంటే...

పెద్దలు చెప్పారు అంటూ కొన్ని మాటలు ప్రయోగిస్తాం. వాటి వెనుక అసలు కారణం ఏంటన్నది మాత్రం చాలామందికి తెలియదు. అందులో ఒకటి 'రుణానుబంధం'. ఎవరైనా రుణం తీరిపోయింది అనగానే  అవును అన్నట్టు తలూపుతాం. అసలు  రుణం తీరిపోవడం అంటే ఏంటి... ద్వారానికి అటొకరు-ఇటొకరు ఉండి ఏమీ తీసుకోకూడదని ఎందుకంటారు. దీనికి సంబంధించి ఓ పెద్ద కథే చెబుతారు పండితులు.

ఓ బ్రాహ్మణుడు నిత్యం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నదికి వెళ్లి స్నానం చేసి సంధ్యావందనం చేసి వస్తుండేవాడు. ఓసారి వేసవిలో ఎండలు మరింత మండిపోతున్నాయి. కాళ్లకు చెప్పులు కూడా వేసుకోలేని పేదరికంలో ఉన్న బ్రాహ్మణుడిని చూసి చలించిపోయిన ఓ కావలి… అయ్యా ఈ చెప్పులు, గొడుగు తీసుకోండి అని  అడుగుతాడు. పూజ చేసుకుని వస్తున్న నాకు నువ్వు ఎదురవుతావా దూరంగా పో అని చెబుతూనే తనకు ఏవైనా దేవుడే ఇస్తాడని చెప్పి వాటిని తిరస్కరిస్తాడట.  ఆ ఆగ్రహాన్ని పట్టించుకోని కావలి…ఈ పిచ్చి బ్రాహ్మణుడు చాదస్తంతో ఇలాగే చేస్తే చనిపోతాడేమో అని భయపడి మరుసటి  ఓ రోజు మార్గ మధ్యలో గొడుగు, చెప్పులు పెట్టేసి కొన్ని పూలు, కాసిని అంక్షింతలు వాటిపై ఉంచి దూరంగా వెళ్లిపోయాడు. అవి చూసిన బ్రాహ్మణుడు నిన్న ఛండాలుడు ఇచ్చినవి కాదన్నానని ఆ దైవమే స్వయంగా ఇచ్చిందని భావించి స్వీకరిస్తాడు. ఇక్కడికో ఈ కథ కి శుభం కార్డు పడింది. 
Also Read: ఆ ఫీలింగ్స్ ఆడవారికే ఎక్కువట… వారిని సంతృప్తి పరచడం అంత ఈజీ కాదట…
కొన్నాళ్ల తర్వాత  అదే రాజ్యంలో నివశించే ఓ కావలికి లేకలేక ఓ కొడుకు పుడతాడు. దైవ కళ ఉట్టిపడే ఈ బాలుడిని చూసి ఆ కుటుంబంలో ఆనందానికి అంతం లేదు. ఆ బాలుడిని చూసిన పండితులు కొందరు … వీడు మీకు చాలా తక్కువ రుణపడి ఉన్నారు తన చేతినుంచి పైసా కూడా తీసుకోవద్దని చెబుతాడు. అప్పటి నుంచి తల్లిదండ్రులు తనయుడి నుంచి ఏమీ ఆశించకుండా పెంచుతారు. రాజ్యంలో రాత్రిపూట కావలి కాసే తండ్రి అనారోగ్యం బారిన పడడంతో…తండ్రి బదులు ఏడేళ్ల కొడుకు కావలి కాసేందుకు వెళతాడు. చీకటి పడగానే గస్తీ మొదలు పెట్టిన ఆ బాలుడు ప్రతి జాముకీ ఓ శ్లోకం రూపంలో సందేశం ఇస్తుంటాడు. 
మనిషి జీవితంలో నాలుగు ఆశ్రమాలు (బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్తం, సన్యాసాశ్రమం) గురించి ఆ బాలుడు చెప్పిన శ్లోకాలివే...
1. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర |
అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత జాగ్రత||
(తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవన్నీ మిధ్యే. ఏవీ నిజంగా లేవు. అందుకే ఓ మానవుడా సావధానుడవై ఉండు)
మొదటి శ్లోకం విన్న రాజుగారిలో ఆలోచన మొదలైంది. నిత్యం కావలి కాసేవాడు కాకుండా ఇంకెవరు వచ్చారు. రాజ్యంలో కావలి కాసే వ్యక్తిలో ఇంత పాండిత్యం ఉందా? అసలు ఎవరు? తర్వాతి శ్లోకం ఏం చెబుతాడో అనే ఆలోచనతో నిద్రపోకుండా ఎదురుచూస్తున్నారు…
2. కామశ్చ, క్రోధశ్చ, లోభశ్చ దేహే తిష్ఠతి తస్కరాః|
జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత జాగ్రత||
( కామము, క్రోధము, లోభము లాంటి అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనె విలువైన రత్నాలను దొంగిలించేందుకు మన శరీరంలో దాగిఉన్న దొంగలు, అందుకే ఓ మానవుడా సావధానుడవై ఉండు)
ఇది గృహస్థాశ్రమానికి సంబంధించిన శ్లోకం. యవ్వనంలో ఉండే మనిషి పూర్తి స్థాయిలో అహంకారంతో ఉంటాడు.  అందం, సంపాదన, వ్యసనం ఇవన్నీ ఉండేది ఈ వయసులోనే. అందుకే కామ, క్రోధాలని జయించాలని చెప్పే శ్లోకం. జీవిత పరమార్థాన్ని ఇంత చక్కగా వివరిస్తున్నఆ వ్యక్తి సామాన్యుడు కాదనుకున్నారు రాజుగారు. యధావిధిగా నిద్రమానేసి…తర్వాత శ్లోకం కోసం ఎదురు చూస్తున్నారు…
Also Read:  కింగ్ అవ్వాల్సిన కొడుకుని కురూపిగా మార్చేసిన తండ్రి, కానీ..చాణక్యుడికి అదే వరమైంది.. 
3. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః పునః|
   సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత జాగ్రత|| 
ఇది వానప్రస్థాశ్రమాన్ని ప్రతిబింబిస్తుంది…(ఈ జన్మ, వృద్ధాప్యం, భార్య, సంసారం ఇవన్నీ దుఃఖ భరితాలే.  అందుకే ఓ మానవుడా సావధానుడవై ఉండు.)
4. ఆశయా బధ్యతే జంతుః కర్మణా బహు చింతయా|
  ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత జాగ్రత||
( మనుషులు ఎప్పుడూ ఏదో చేయాలనే  ఆశతో జీవిస్తారు. కానీ తరిగిపోతున్న జీవితకాలం గుర్తించరు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండు) ఇది సన్యాసాశ్రమాన్ని ప్రతిబింబిస్తుంది. నువ్వు లేచినా లేవకపోయినా నీ బతుకులో పెద్దగా మార్పులుండవని అర్థం.
Also Read: అయ్యప్ప మాల వెనుక ఆరోగ్యం రహస్యం ఏంటి..?
ఈ శ్లోకంతో తెల్లవారిపోవడంతో విధులుముగించుకుని ఇంటికి చేరుకున్నాడు బాలుడు. ఈ శ్లోకాలు విని  ఆశ్చర్యపోయిన రాజుగారు భటుల్ని పిలిచి...రాత్రి కావలి కాసిన వాడిని తీసుకురండి అని ఆదేశిస్తాడు. ఎందుకు తీసుకురమ్మన్నారో అర్థంకాని భటులు ఆ బాలుడిని  బంధించి తీసుకెళతారు.  బంధించి లోపలకు తీసుకెళ్లి బాలుడిని విడిపించిన రాజుగారు కనకాభిషేకం చేసి భారీగా కానుకలు అందించి మరోసారి శ్లోకాలు, వాటి అర్థాలు చెప్పించుకుంటాడు. నీలో ఉన్న విద్వత్తు అసామాన్యం అని నమస్కరించి  ధనరాశులిచ్చి పల్లకిలో ఇంటికి సాగనంపుతారు.తల్లిదండ్రుల ఆనందానికి అవధులుండవు. ఆ సమయంలో ఇంటికి చేరుకున్న బాలుడు తన వెంట తీసుకొచ్చిన ధనరాశులను ద్వారానికి ఇటువైపుగా నిల్చుని తల్లిదండ్రులకు అందించి వెంటనే ప్రాణం వదిలేస్తాడు. 

లేకలేక పుట్టిన తనయుడు….అపార ధనాన్ని కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చిన పుత్రుడు కళ్లముందే కుప్పకూలిపోవడం చూసి తల్లిదండ్రులు ఆవేదనకు అంతులేదు. అ సమయంలో కుప్పకూలిన శరీరంలోంచి బాలుడి స్వరం వినిపిస్తుంది. నేను గత జన్మలో భవంతుడి పేరుతో నువ్విచ్చిన చెప్పులు, గొడుగు వేసుకున్నాను. ఆ రుణం తీర్చేందుకే నీ కడుపున పుట్టి  ఆ రుణం తీరిపోగానే వెళ్లిపోతున్నా అని చెప్పాడు. ఇదే రుణానుబంధం అంటే. మనచుట్టూ ఉన్న ప్రతి బంధం అదే. ఎవరి రుణం తీరితే వాళ్లు శాశ్వతంగా దూరమైపోతారు. రుణం ఎప్పుడు తీరుతుందో చెప్పలేం.  అందుకే ద్వారానికి అటొకరు-ఇటొకరు ఉండి తీసుకోరాదని చెబుతారు. 

పురాణాల్లో ప్రస్తావించినవి అయినా.. పెద్దలు చెప్పిన మాటలు అయినా ఇలాగే ఫాలో అవ్వాలని, ఇదే వాస్తవం అని పూర్తిస్థాయిలో చెప్పలేం. కేవలం అది మన విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. 
Also Read: నీరు, నిప్పు, నింగి, గాలి, పృథ్వి .. పంచభూత శివలింగాలు ఎక్కడ ఉన్నాయంటే..
Also Read: అప్సరసలంటే ఎవరు.. మొత్తం ఎంత మంది ఉన్నారో తెలుసా..!
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
Also Read: దక్షుడు, ఇంద్రుడు, చంద్రుడు, రాముడు, కుమారస్వామి ప్రతిష్టించిన శివలింగాలివే...
Also Read: శనివారం ఈ వస్తులు కొన్నా-తీసుకున్నా ….శని మిమ్మల్ని వదలదంట
Also Read:  ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Free Gas Cylinder Scheme: శ్రీకాకుళం జిల్లాలోని పేద మహిళ ఇంట్లో టీ చేసిన చంద్రబాబు --బిల్ చెల్లించాలని రామ్మోహన్‌తో చమత్కారం
శ్రీకాకుళం జిల్లాలోని పేద మహిళ ఇంట్లో టీ చేసిన చంద్రబాబు --బిల్ చెల్లించాలని రామ్మోహన్‌తో చమత్కారం
Singham Again Review - 'సింగం ఎగైన్' రివ్యూ: ఇది పోలీస్ స్టోరీ కాదు... రోహిత్ శెట్టి రామాయణం - సినిమాగా ఎలా ఉందంటే?
'సింగం ఎగైన్' రివ్యూ: ఇది పోలీస్ స్టోరీ కాదు... రోహిత్ శెట్టి రామాయణం - సినిమాగా ఎలా ఉందంటే?
Liquor Price Hike: తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్! త్వరలో మద్యం ధరల పెంపు
తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్! త్వరలో మద్యం ధరల పెంపు
Bhool Bhulaiyaa 3 Review: భూల్ భులయ్యా 3 రివ్యూ: హిందీ ‘చంద్రముఖి’ సిరీస్‌లో మూడో పార్ట్ - ఎలా ఉంది?
భూల్ భులయ్యా 3 రివ్యూ: హిందీ ‘చంద్రముఖి’ సిరీస్‌లో మూడో పార్ట్ - ఎలా ఉంది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌లో భారీ సైరన్‌ల మోత, వెంటనే పేలుళ్లుకేబీఆర్ పార్క్ వద్ద పోర్షే కార్ బీభత్సంLSG Released KL Rahul Retention Players | కెప్టెన్ కేఎల్ రాహుల్ ను వదిలేసిన లక్నో సూపర్ జెయింట్స్ | ABP DesamDC Release Rishabh Pant IPL 2025 Retention | పోరాట యోధుడిని వదిలేసుకున్న ఢిల్లీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Free Gas Cylinder Scheme: శ్రీకాకుళం జిల్లాలోని పేద మహిళ ఇంట్లో టీ చేసిన చంద్రబాబు --బిల్ చెల్లించాలని రామ్మోహన్‌తో చమత్కారం
శ్రీకాకుళం జిల్లాలోని పేద మహిళ ఇంట్లో టీ చేసిన చంద్రబాబు --బిల్ చెల్లించాలని రామ్మోహన్‌తో చమత్కారం
Singham Again Review - 'సింగం ఎగైన్' రివ్యూ: ఇది పోలీస్ స్టోరీ కాదు... రోహిత్ శెట్టి రామాయణం - సినిమాగా ఎలా ఉందంటే?
'సింగం ఎగైన్' రివ్యూ: ఇది పోలీస్ స్టోరీ కాదు... రోహిత్ శెట్టి రామాయణం - సినిమాగా ఎలా ఉందంటే?
Liquor Price Hike: తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్! త్వరలో మద్యం ధరల పెంపు
తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్! త్వరలో మద్యం ధరల పెంపు
Bhool Bhulaiyaa 3 Review: భూల్ భులయ్యా 3 రివ్యూ: హిందీ ‘చంద్రముఖి’ సిరీస్‌లో మూడో పార్ట్ - ఎలా ఉంది?
భూల్ భులయ్యా 3 రివ్యూ: హిందీ ‘చంద్రముఖి’ సిరీస్‌లో మూడో పార్ట్ - ఎలా ఉంది?
KTR Padayatra: తెలంగాణలో కేటీఆర్ పాదయాత్ర- కార్యకర్తల ఆకాంక్షల మేరకు కీలక నిర్ణయం 
తెలంగాణలో కేటీఆర్ పాదయాత్ర- కార్యకర్తల ఆకాంక్షల మేరకు కీలక నిర్ణయం 
World Test Championship: గతంలో ఎన్నడూ లేనంత హోరాహోరీ, అగ్ర జట్ల మధ్య మహా సమరం
గతంలో ఎన్నడూ లేనంత హోరాహోరీ, అగ్ర జట్ల మధ్య మహా సమరం
Rashmika Mandanna - Diwali: దేవరకొండ ఇంట్లో రష్మిక దీపావళి సెలబ్రేషన్స్ - డైరెక్ట్‌గా చెప్పిన నేషనల్ క్రష్
దేవరకొండ ఇంట్లో రష్మిక దీపావళి సెలబ్రేషన్స్ - డైరెక్ట్‌గా చెప్పిన నేషనల్ క్రష్
Nara Lokesh In Atlanta: ఎవరినైనా లోపల వేయాలంటే రెండు నిమిషాల పని : లోకేష్‌
ఎవరినైనా లోపల వేయాలంటే రెండు నిమిషాల పని : లోకేష్‌
Embed widget