Spirituality: అప్సరసలంటే ఎవరు.. మొత్తం ఎంత మంది ఉన్నారో తెలుసా..!
అందం, సౌందర్యం గురించి చెప్పేటప్పుడు అప్సరలా ఉంది అంటారు. దాదాపు ఈ మాట అందరూ వినేఉంటారు. కానీ వాళ్లెవరంటే మాత్రం క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడతారు.
స్వర్గం-నరకం ఉంటాయని చెబుతుంటారంతా. ఎవరైనా చూశారా అని మాత్రం అడగకండి. ఎందుకంటే పురాణాల్లో చదవడం, ఎవరైనా చెప్పినప్పుడు వినడం తప్ప వీటిగురించి పెద్దగా తెలియదు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అప్సరసలు స్వర్గంలో ఉంటారు. స్వర్గంలో దేవతలను తమ నాట్యగానాలతో అలరించేవారే అప్సరసలు. వీళ్లు సప్తగణాల్లో ఓ వర్గం. సప్తగణాలంటే... 1. ఋషులు 2. గంధర్వులు 3. నాగులు 4. అప్సరసలు 5. యక్షులు 6. రాక్షసులు 7. దేవతలు. వీరిలో అందరి నోట్లో నిత్యం నానే పదం అప్సరసలు. ఈ పదం గురించి తెలిసినా వాళ్లెవరన్నది మాత్రం చాలామందికి తెలియదు.
Also Read: కింగ్ అవ్వాల్సిన కొడుకుని కురూపిగా మార్చేసిన తండ్రి, కానీ..చాణక్యుడికి అదే వరమైంది..
అందం గురించి వర్ణించేటప్పుడు హయ్యెస్ట్ పొగడ్త ఏంటంటే అప్సరస. దేవలోకంలో ఆటపాటలతో అలరించే అప్సరసలు అప్పుడప్పుడు తాపసులను వెంట తిప్పుకున్న సందర్భాల గురించీ పురాణాల్లో ప్రస్తావన ఉంది. ఓ సందర్భంలో విశ్వామిత్రుడి తపస్సు భంగం చేయడానికి వెళ్లి సక్సెస్ అయిన మేనక కొన్నాళ్ల తర్వాత శంకుతలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కణ్వమహర్షి దగ్గర పెరిగిన శకుంతలను...వేటకు వచ్చిన దుష్యంతుడు చూసి వివాహం చేసుకుంటాడు. ఇలా చాలామంది అప్సరసలు తాపసుల దీక్షకు భంగం కలిగించారు. ఇలా వెళ్లివారిలో మహర్షుల మనసు మళ్లించడంలో కొంతమంది అప్సరసలు విజయాన్ని సాధిస్తే, మరికొంతమంది మహర్షుల ఆగ్రహావేశాలకి గురై శాపాలపాలయ్యారు. సాధారణంగా అప్సరసలు అంటే రంభ, ఊర్వశి,మేనక అని మాత్రమే తెలుసు కానీబ్రహ్మ పురాణం ప్రకారం అప్సరసల సంఖ్య 31. వీరిని ఏకత్రింశతి అప్సరసలు అని కూడా అంటారు.
Also Read: దక్షుడు, ఇంద్రుడు, చంద్రుడు, రాముడు, కుమారస్వామి ప్రతిష్టించిన శివలింగాలివే...
31 మంది అప్సరసలు వీరే
రంభ, మేనక, ఊర్వశి , తిలోత్తమ, ఘృతాచి
సహజన్య, నిమ్లోచ, వామన, మండోదరి, సుభోగ
విశ్వాచి, విపులానన, భద్రాంగి, చిత్రసేన, ప్రమోచన
ప్రమ్లోద, మనోహరి /మనో మోహిని, రామ, చిత్రమధ్య
శుభానన, సుకేశి, నీలకుంతల, మన్మదోద్ధపిని, అలంబుష
మిశ్రకేశి, పుంజికస్థల, క్రతుస్థల, వలాంగి, పరావతి, మహారూప, శశిరేఖ
Also Read: ఉపవాసం దేవుడి కోసం మాత్రమే కాదు… ప్రకృతి వైద్యులు చెప్పిన విషయాలు మీరు తెలుసుకోండి
Also Read: కార్తీక పౌర్ణమి, క్షీరాబ్ధి ద్వాదశి... కార్తీకమాసంలో ముఖ్యమైన రోజులివే...
Also Read: వనభోజనాలు కార్తీకమాసంలోనే చేస్తారెందుకు .. ఉసిరి చెట్టుకిందే తినాలని ఎందుకు చెబుతారు..!
Also Read: కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి… అంత చలిలో అవసరమా…!
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి