BRS ప్రభుత్వంలో హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేసింది ఎవరు? సొంత పార్టీలో చిచ్చురేపుతున్న సిట్ లీక్స్
Harish Rao Phone Tapping | ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. బీఆర్ ఎస్ లో నెంబర్ టూ గా ఉన్న హరీష్ రావు ఫోన్ నే గత ప్రభుత్వం లో ట్యాప్ చేశారంటూ సిట్ లీక్స్ సంచలనం రేపుతున్నాయి.

Phone Tapping Case in Telangana | హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న విషయాలు, సిట్ లీక్స్ ప్రచారం తారా స్దాయికి చేరుతున్నాయి. తాజాాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును సిట్ విచారించిన విషయం తెలిసిందే. ఆ ఎనిమిది గంటల విచారణ ముగిశాక మీడియా సమావేశంలో సిట్ అధికారులపై మాజీ మంత్రి ,బీఆర్ ఎస్ కీలకనేత హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. హరీష్ మాట్లడిన కొద్దిసేపటికే సిట్ పత్రికా ప్రకటన పేరుతో అవాస్తవాలు నమ్మొద్దంటూ సజ్జనార్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇలా ఒక్క విచారణ వంద అనుమానాలు,మరెన్నో ప్రశ్నలు అన్నట్లుగా హరీష్ రావు విచారణ ముగిసింది. ఇదిలా ఉంటే తాజాగా సిట్ లీక్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి.
నిన్న సిట్ విచారణ సందర్భంగా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు, సిట్ వివరణలకు సంబంధం లేకుండా సరికొత్త వివాదం తెరపైకి తెచ్చాయి సిట్ లీక్స్. ఈ లీకులు ఎవరు చేశారు. ఎందుకు చేశారు. వాస్తవాలేంటి అనే సందేహిాలు కాసేపు ప్రక్కన పెడితే. ఇంతకీ ఆ లీకుల్లో చెప్పిన విషయాలు కారు పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
సిట్ లీక్స్ లో ఏముందంటే..
సిట్ విచారణ సందర్భంగా నిన్న హరీాష్ రావు ఫోన్ ట్యాప్ అయ్యిందనే విషయాన్ని సిట్ అధికారులు హరీష్ రావుకు చెప్పడంతో ఆయన ఒక్కసారిగా షాక్ అయ్యారట. మా ప్రభుత్వంలో నా ఫోన్ ట్యాప్ అవ్వడమేంటి అంటూ సిట్ అధికారుల ముందు ఆశ్చర్యం వ్యక్తం చేశారట. 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత నుండి కొన్ని నెలలపాటు హరీష్ రావు ఫోన్ ట్యాప్ అయినట్లు చెప్పారట. ఎప్పుడైతే తన ఫోన్ ట్యాప్ అయ్యిందని సిట్ అధికారులు చెప్పారో అప్పటి నుండి అధికారులు అడుగుతున్న ప్రతీ ప్రశ్నను పేపర్ పై రాసుకున్నారట హరీష్ రావు. నా ఫోన్ ట్యాప్ అయినట్లు మీరే కావాలని సృష్టిస్తున్నారా అంటూ సిట్ అధికారులను హరీష్ రావు తిరిగి ప్రశ్నించారట.
ఏ రోజు, ఏ టైమ్ లో తన ఫోన్ ట్యాప్ అయ్యిందో ఆధారాలతో సహా హరీష్ రావుకు వివరించిన అధికారులు, మీకు తప్పుడు సమాచారం చెప్పాల్సిన అవసరం మాకు లేదంటూ సమాధనామిచ్చారట. ఒక్క హరీష్ రావు ఫోన్ మాత్రమే కాదు,తన అనుచరుల ఫోన్లు కూడా గత ప్రభుత్వంలో ట్యాప్ చేసినట్లుగా సిట్ అధికారులు హరీష్ రావుకు ఆధారాలతో సహా వివరించినట్లుగా సిట్ లిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
BRS పార్టీలో సిట్ లీక్స్ ప్రకంపనలు..
సిట్ లీక్స్ లో హరీష్ రావు ఫోన్ ట్యాప్ అయిన విషయం బయటకు రావడంతో సొంత పార్టీలొో తీవ్ర స్దాయిలో చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ ఎస్ పార్టీలో కేసీఆర్ తరువాత పార్టీని అన్నీ తామై నడిపించింది కేటీఆర్ ,హరీష్ రావు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఎవరొకొచ్చింది. హరీష్ రావు సీక్రెట్ సంభాషణలు వినాలని ఎవరనుకున్నారు. పార్టీలొో తనకు తెలియకుండానే హరీష్ పై కన్నేసిన వ్యక్తి ఎవరు అనేది గులాబీ దళంలో ప్రకపంనలు రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధితుడిగా హరీష్ మారాడంటే, పార్టీలో అంతలా ప్రభావితం చేసిన కీలక నేతపైనే చర్చనడుస్తోంది. ఈ లీకులు కేటీఆర్ , హరీష్ రావు మధ్య గ్యాప్ కు కారణమతాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
ఇంతకీ ఈ సిట్ లీక్స్ బీఆర్ ఎస్ లో కేటీఆర్ , హరీష్ రావు మధ్య చిచ్చు పెట్టడం ద్వారా పార్టీకి హరీష్ ను దూరం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారా , లేక హరీష్ రావు ఫోన్ ట్యాప్ జరిగిందా అనే విషయాలు సిట్ అధికారులే నిర్దారించాల్సి ఉంది.






















