Amaravati News: అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు.. ఏపీ సర్కార్ ఇకపై అన్నీ ఇక్కడే చేస్తుందా?
ఏపీరాజధానిఅమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకల్ జరుపబోతోంది కూటమి ప్రభుత్వం. దీనికి సంబందించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయ్యాయి.

రాజధాని ఏర్పడ్డాక తొలిసారి అమరావతి లో రిపబ్లిక్ డే
ఏపీ రాజధాని గా అమరావతి ని ప్రకటించి పదేళ్లు దాటిపోయింది. ఇంతవరకూ ఇండిపెండెన్స్ డే గానీ రిపబ్లిక్ డే కానీ ఇక్కడ జరుపలేదు. రెండోసారి కూటమి అధికారం లోకి వచ్చాక అమరావతి లో ఆగస్టు 15, జనవరి 26 వంటి వేడుకలను జరుపాలని ట్రై చేసినా అక్కడ రోడ్లు, సరైన గ్రౌండ్ ఏర్పడక పోవడం తో సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ యాంగిల్ లో కూడా ఆలోచించి ఇంతవరకూ అలాంటి నిర్ణయం తీసుకోలేదు ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఆ సమస్య చాలా వరకూ తీరిపోవడం తో సీడ్ యాక్సిస్ రోడ్డు ను సమీపంలో రిపబ్లిక్ డే కోసం ఒక గ్రౌండ్ ని రెడీ చేశారు.

అమరావతి లో క్రొత్తగా నిర్మించిన IAS ల ప్లాట్స్,, MLA అపార్ట్మెంట్ ల మధ్యలో సీడ్ యాక్సిస్ రోడ్డు నుండి ఏపీ హై కోర్ట్ కు వెళ్లే రోడ్డు లో 22 ఎకరాల గ్రౌండ్ ని రిపబ్లిక్ డే పెరేడ్ కోసం ఎంపిక చేశారు. గత కొన్ని రోజులుగా అ గ్రౌండ్ ని చదును చేసి టెంట్స్ వేసి పెరేడ్ కి అనుకూలంగా బాట వేసారు. ఇప్పటికే ప్రతీ రోజూ ఉదయం, సాయంత్రం పోలీసులు, స్కౌట్స్, NCC కేడెట్స్ రిపబ్లిక్ డే డ్రిల్ రిహార్సల్ చేస్తున్నారు. జనవరి 26 వ తేదీన రాష్ట్రాన్ని ఉద్దేశించి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించే వేదిక కూడా రెడీ అయిపోయింది.

ప్రత్యేక ఆకర్షణగా శకటాలు
రిపబ్లిక్ డే అంటే గుర్తు వచ్చేది వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాలు. ఈసారి దాదాపు 30 శకటాలు ఏపీ రిపబ్లిక్ డే లో పాల్గొన బోతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు " స్వర్ణ ఆంధ్ర మిషన్ 2047 " కోసం ప్రవేశ పెట్టిన 10 సూత్రాలను ప్రతిబింబించేలా ఈ శకటాల తయారీ ని పర్యవేక్షిస్తోంది ఏపీ సమాచార శాఖ. పేదరిక నిర్మూలన,ఉద్యోగ కల్పన& నైపుణ్య అభివృద్ధి, నీటి భద్రత, అగ్రికల్చర్ & అగ్రిటెక్ వంటి 10 అంశాలతో శకటాలు ఈ రిపబ్లిక్ డే కి స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. 26.01.26 తేదీ నుండి రిపబ్లిక్ డే, ఆగస్టు 15 వంటి కార్యక్రమాలు అన్నీ ఇకపై అమరావతి లోనే జరుగబోతున్నట్టు ప్రభుత్వం తెలిపింది. దీనితో ఇన్నాళ్ళు ఇలాంటి వేడుకలకు వేదిక అయిన విజయవాడ లోని ఇందిరాగాంధీ స్టేడియం ఇకపై ఆ రకం కళను కోల్పోనుంది.

అయితే ఏపీ రాజధాని అమరావతి లోనే ఇకపై రిపబ్లిక్ డే, ఆగస్టు 15 వంటి వేడుకలు జరుగుతుండడం తమకు ఎంతో గర్వకారణం గా ఉందని అమరావతి రైతులు చెబుతున్నారు. ఈ రిపబ్లిక్ వేడుకల నేపథ్యంలో అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు లో భద్రతను పెంచారు.





















