By: ABP Desam | Updated at : 13 Dec 2021 01:34 PM (IST)
Edited By: RamaLakshmibai
Varanasi Ghats
మరణించేలోపు ఒక్కసారైనా కాశీకి వెళ్లాలని చెబుతుంటారు. అందుకే తీర్థయాత్రల్లో కాశీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గంగలో స్నానమాచరించి పరమేశ్వరుడిని దర్శించుకుంటే ఏడు జన్మల పాపాలు సైతం తొలగిపోతాయని భావిస్తారు. అందుకే కాశీలో మరణించాలనుకుంటారు. అయితే కాశీలో శవాలను దహనం చేయడానికి ప్రత్యేకమైన ఘాట్ సహా మొత్తం 84 ఘాట్లు ఉన్నాయి.
అందులో కొన్ని.....
1) దశాశ్వమేధ ఘాట్...
బ్రహ్మ దేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసిన ఘాట్ ఇది. నిత్యం సాయంత్రం గంగాహారతి జరిగేది ఇక్కడే.
2) ప్రయాగ్ ఘాట్...
ఇక్కడ భూగర్భంలో గంగానదితో యమునా,సరస్వతిలు కలుస్తాయి
3) సోమేశ్వర్ ఘాట్...
చంద్రుని నిర్మించిన ఘాట్ ఇది
4) మీర్ ఘాట్...
సతీదేవీ కన్ను పడిన స్థలం అని చెబుతారు. విశాలాక్షి దేవి శక్తి పీఠం కొలువైంది ఇక్కడే. యముడు ప్రతిష్టించిన శివలింగం కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు.
5) నేపాలీ ఘాట్...
పశుపతి నాథ్ మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు కట్టించాడిక్కడ
Also Read: నీరు, నిప్పు, నింగి, గాలి, పృథ్వి .. పంచభూత శివలింగాలు ఎక్కడ ఉన్నాయంటే..
6) మణి కర్ణికా ఘాట్...
ఇది కాశీలో మొట్ట మొదటి ఘాట్. విష్ణుమూర్తి స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించాడని చెబుతారు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారని, ఇక్కడ గంగ మరింత నిర్మలంగా ఉంటుందని భక్తుల విశ్వాసం.
7) విశ్వేవర్ ఘాట్
ఇప్పుడు దీన్నే సింధియా ఘాట్ అంటున్నారు. ఇక్కడ స్నానం చేసే బిందు మాధవుణ్ణి దర్శించుకుంటారు
8) పంచ గంగా ఘాట్...
ఈ ఘాట్ దగ్గర భూగర్భం నుంచి గంగానదిలో ఐదు నదులు కలుస్తాయట.
9) గాయ్ ఘాట్...
గోపూజ జరిగే ఘాట్ ఇది
10) తులసి ఘాట్...
తులసి దాస్ సాధన చేసి రామాచరిత మానస్ లిఖించమని శివుని ఆదేశం పొందిన ఘాట్ ఇది
Also Read: ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని- ప్రపంచ సాంస్కృతిక నగరం... వారణాశి గొప్పతనం ఇదే..
11) హనుమాన్ ఘాట్...
ఇక్కడ జరిగే రామ కథ వినడానికి హనుమంతుడు వస్తాడట. సూర్యుడు తపస్సు చేసి పొందిన లోలార్క్ కుండం ఉన్నది ఇక్కడే.
12) అస్సి ఘాట్...
పూర్వం దుర్గా దేవి శుంభ, నిశుంభ అను రాక్షసులను చంపి ఆ ఖడ్గాన్ని వేయడం వల్ల ఉద్భవించిన తీర్థం ఇది అని చెబుతారు.
13) హరిశ్చంద్ర ఘాట్...
సర్వం పోగొట్టుకుని హరిశ్చంద్రుడు ఇక్కడ శవ దహన కూలీగా పని చేసి దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందాడంటారు. ఇక్కడ నిత్యం చితి కాలుతూనే ఉంటుంది
14) మానస సరోవర్ ఘాట్...
ఇక్కడ కైలాసపర్వతం నుంచి భూగర్భ జలధార కలుస్తుంది. ఈ ఘాట్ లో స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తుందట
15) నారద ఘాట్..
నారదుడు శివలింగం స్థాపించిన ఘాట్ ఇది
Also Read: జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలివి
16) చౌతస్సి ఘాట్...
స్కంధపురాణం ప్రకారం ఈ ఘాట్ లో 64 యోగినిలు తపస్సు చేశారని..దత్తాత్రేయుడికి అత్యంత ప్రీతిపాత్రమైన స్థలం ఇదని చెబుతారు. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలిగి యోగినుల శక్తులు ప్రాప్తిస్తాయంటారు.
17) రానా మహల్ ఘాట్...
సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలను తొలగించమని బ్రహ్మ దేవుడు ఈ ఘాట్ వద్ద వక్రతుండ వినాయకుడికి తపస్సు చేసి ప్రశన్నం చేసుకున్నాడంటారు.
18) అహిల్యా బాయి ఘాట్...
ఈమె కారణంగానే మనం ఈరోజు కాశీవిశ్వనాథుణ్ణి దర్శిస్తున్నామని చెబుతారు.
పూర్వం కాశీలో దేవతలు ఋషులు రాజులూ నిర్మించిన ఎన్నో మందిరాలు, కట్టడాలు, వనాలు ఎంతో వైభవంగా ఉండేవట. మహమ్మదీయుల దండయాత్ర తర్వాత కాశిని ఇప్పుడు మనం చూస్తున్నాం అని చెబుతారు.
Also Read: కాశీలో వదిలేయాల్సింది కాకరకాయో, కమలాపండో కాదు…
Today Panchang 22 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, భానుసప్తమి ప్రత్యేక శ్లోకం
Horoscope Today 22 May 2022: ఈ రాశివారు దూకుడు తగ్గించుకోవాల్సిందే, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope Today 22 May 2022: భానుసప్తమి ఈ రాశులవారికి చాలా ప్రత్యేకం, మీరున్నారా ఇందులో ఇక్కడె తెలుసుకోండి
Panakala Swamy Temple :ప్రసాదం తాగే స్వామి, కష్టాలు తీరేందుకు అమృతాన్నిచ్చే దైవం
Love Horoscope 21 May :ఈ రాశి ప్రేమికులు శుభవార్త వింటారు, ప్రపోజ్ చేస్తారు
Covid 19 in North Korea: ఉత్తర కొరియాలో కరోనా విలయతాండవం- ఒక్కరోజులో లక్షా 86 వేల కేసులు!
JC Prabhakar Reddy : మంత్రుల బస్సు యాత్రపై రాళ్లు పడే అవకాశం, జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Rainbow Island: సప్తవర్ణాల దీవి, అందులోని మట్టితో సాస్, మసాలాల తయారీ
In Pics : దావోస్ లో ఏపీ పెవిలియన్ ను ప్రారంభించిన సీఎం జగన్