News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Seven Spiritual Cities: జీవితకాలంలో ఈ ఏడు క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకుంటే.. స్వర్గలోకంలోకి ఎంట్రీ ఖాయమట

మన దేశంలో అతి పురాతన, అత్యంత ప్రాచీనమైన ఏడు క్షేత్రాలున్నాయి. వీటినే మోక్షదాయక క్షేత్రాలని పిలుస్తారు. వీటిని జీవితకాలంలో ఒక్కసారి దర్శించుకున్నా సకల పాపాలు నశించి స్వర్గానికి వెళతారట. ఆ నగరాలేంటంటే.

FOLLOW US: 
Share:

"అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతికాపురీ, ద్వారావతీ చైవ సప్తైతే మోక్షదాయికా"

భూమ్మీద పుట్టినందుకు కన్నుమూసేలోగా కొన్ని ఆలయాలు సందర్శించుకోవాలని చాలామంది అనుకుంటారు. అయితే అన్నిటికన్నా ఈ ఏడు క్షేత్రాలను దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని చెబుతారు. పాండవులు కూడా మహాభారత యుద్ధం తర్వాత బ్రహ్మణ, గురువు, బంధు పరివారం హత్యదోష నివారణార్థం ఏడు పుణ్యక్షేత్రాలను సందర్శించాకే స్వర్గానికి ప్రయాణమయ్యారని చెబుతారు. ఈ ఏడు క్షేత్రాల్లో  వైష్ణవ, శైవ క్షేత్రాలు రెండూ ఉన్నాయి. అంత మహిమాన్వితమైన సప్తపురి క్షేత్రాలేంటో ఇప్పుడు చూద్దాం..

అయోధ్య
మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన శ్రీరామచంద్రుడు పుట్టి పెరిగిన ప్రాంతం అయోధ్య. ఉత్తర ప్రదేశ్ ఫైజాబాద్ జిల్లాలో  ఉన్న ఈ క్షేత్రానికి రామజన్మ భూమి అని ప్రసిద్ధి.  రామాయణ కాలం కన్నా ముందే సాకేత పురం అనే పేరుతో ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. స్కంధ పురాణంలో అయోధ్యను ఏడు పవిత్ర నగరాల్లో ఒకటిగా పేర్కొన్నారు. అధర్వణ వేదంలో కూడా అయోధ్యను సాక్షాత్తు ఆ భగవంతుడు నిర్మించిన నగరంగా పేర్కొన్నారు. దేవుడు నిర్మించిన నగరం కాబట్టి ధార్మికంగా ఈ నగరం అత్యంత ప్రాధాన్యత కలిగిఉందని  భక్తుల విశ్వాసం. సరయూ నది ఒడ్డున నిర్మించిన ఈ అయోధ్యను నిత్యం వేల మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. 
Also Read: 2022 లో ఈ నాలుగు రాశుల వారు అన్నింటా విజయం సాధిస్తారు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం..

ద్వారక
సప్తపురి క్షేత్రాల్లో ద్వారక కూడా ఒకటి. విష్ణుమూర్తి దశావతారాల్లో ఒకటైన శ్రీ కృష్ణుడు మధురను విడిచి దాదాపు వందేళ్లు నివశించిన ప్రాంతం  ద్వారక అంటారు.  గుజరాత్ గోమతి నదీ తీరంలో ఉన్న ఈ క్షేత్రంలో ద్వారకాదీశ దేవాలయం, రుక్మిణి దేవాలయం, శారదాపీఠం లాంటి ఎన్నో ముఖ్యమైన ధార్మిక క్షేత్రాలున్నాయి. ఎనిమిదో శతాబ్దంలో ఆది శంకరాచార్యలు స్థాపించిన నాలుగు శారద పీఠాల్లో ద్వారకలో కూడా ఒకటుంది.  పశ్చిమ శారదా పీఠం ద్వారకలో ఉండటం వల్ల ఈ క్షేత్రానికి అత్యంత శక్తి ఉందని నమ్ముతారు. సంస్కతంలో ద్వార అంటే ప్రవేశం అని, కా అంటే పరబ్రహ్మ సన్నిధి అని అర్థం. అందువల్లే పురాణ కాలం నుంచి ద్వారకా... మోక్షానికి ప్రవేశ ద్వారమని అంటారు. 

మధుర
ఉత్తర ప్రదేశ్ లో ఉన్న మధుర శ్రీకృష్ణుడి జన్మస్థానం. ద్వాపర యుగం నుంచి ఇప్పటి వరకూ మధుర ఓ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. దీనిని ల్యాండ్ ఆఫ్ ఎటర్నల్ లవ్ అని పిలుస్తారు. బాల్యంలో కృష్ణుడు గోపికలతో గడిపన స్థలం ఇదే కావడంతో ఈ ప్రాంతం అంతా ఆధ్యాత్మికతతో నిండి ఉంటుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఇక్కడ చాలా వైభవంగా జరుపుకుంటారు.
Also Read: 2022 ఈ నాలుగు రాశుల వారికి కొత్తకొత్తగా ఉంటుంది, చాలా సమస్యల నుంచి రిలీఫ్ పొందుతారు..

ఉజ్జయిని
మధ్యప్రదేశ్ ఉజ్జయినీ కూడా సప్తపురి క్షేత్రాల్లో ఒకటి. క్షిప్రా నదీ తీరంలో వెలిసిన ఈ పుణ్యక్షేత్రం అటు వైష్ణవులకు, ఇటు శైవులకు కూడా అత్యంత పవిత్రమైన నగరంగా పేరొందింది. ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు బాగా జరుగుతాయి. మహాకాళేశ్వర, కాలభైరవ, చింతామణి గణేశ, గోపాల మందిరంలో నిత్యం భక్తుల సందడి ఉంటుంది. మహాకాళేశ్వర దేవాలయం దేశంలో ఉన్న పరమ పవిత్రమైన శివలింగం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి.

హరిద్వార్
ఉత్తరాఖండ్ లో ఉన్న హరిద్వార్ సప్తగిరి క్షేత్రాల్లో విశిష్టమైన పుణ్యక్షేత్రం. గంగోత్రి వద్ద జన్మించి దాదాపు 2543 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత హరిద్వార్ లోనే ఉధృతంగా ప్రవహించడం మొదలుపెడుతుంది. అందుకే హరిద్వార్ ను గంగా ద్వారమని కూడా పిలుస్తారు.  గరుడ పురాణంలో ఈ క్షేత్రాన్ని మాయానగరమని పిలుస్తారు. గరుడుడు అమృతాన్ని తీసుకెళుతుండగా ఇక్కడ ఓ చుక్క పడిపోయిందని చెబుతారు. అందుకే ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే మోక్షం తథ్యం అంటారు. కుంభమేళ జరిగే సమయంలో లక్షల మంది హరిద్వార్ ను చేరుకుని పవిత్ర స్నానాలు చేస్తారు. 
Also Read: 2022 లో ఈ నాలుగు రాశులవారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే...

వారణాసి
వరుణ, అసి అనే రెండు నదుల సంగమాల మధ్య ఉన్నందున 'వారణాసి' అనే పేరువచ్చింటారు. వారణాసి పేరును పాళీభాషలో బారణాసిగా రాసేవారు. అది తర్వాత బనారాస్ గా మారింది. వారణాసి నగరాన్ని పురాణ ఇతిహాసాల్లో "అవిముక్తక", "ఆనందకానన", "మహాస్మశాన", "సురధాన", "బ్రహ్మవర్ధ", "సుదర్శన", "రమ్య", "కాశి" అనే ఎన్నో పేర్లతో ప్రస్తావించారు. సుమారు 5,000 సంవత్సరాల క్రితం శివుడు వారాణసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాథ. ఇది హిందువుల ఏడు పవిత్ర నగరాలలో ఒకటి. ఇక్కడ శివుడు నివసిస్తాడని భక్తుల విశ్వాసం.  అందుకే ఈ పుణ్యక్షేత్రానికి హిందూ ధార్మిక పర్యటనలో విశిష్ట స్థానం కల్పించారు.  గంగానది తీరంలో వెలిసిన వారణాసిలో అడుగుకో దేవాలయం ఉంటుంది.  పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన వారణాసిలో చనిపోయినా,  అంత్య క్రియలు జరిగినా నేరుగా స్వర్గానికి పోతారని భక్తుల నమ్మకం. 

కాంచిపురం
సప్తపురి క్షేత్రాల్లో  దక్షిణ భారత దేశంలో ఉన్న ఏకైక పుణ్యక్షేత్రం కాంచిపురం. ఇక్కడ దేవాలయాల్లో ప్రమఖమైనది కామాక్షి అమ్మవారి దేవాలయం. ఇది ఒక శక్తిపీఠం.  ఇక్కడ శివుడు కూడా కొలువై ఉండడంతో  శైవులకు  అత్యంత పవిత్రమైన క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఈ క్షేత్రాన్ని కాంచి అని కూడా పిలుస్తారు.

Also Read: ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 1
Also Read: భగవద్గీత మా అమ్మ లేని లోటు తీర్చిందన్న స్వాతంత్ర్య సమరయోధుడెవరు… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 2
Also Read:  ఆనందం ఎక్కడ దొరుకుతుంది… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 3
Also Read:  మనసు నిగ్రహంగా ఉండాలంటే ఏం చేయాలి… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 4
Also Read: భగవద్గీత బోధన తర్వాత విశ్వరూపం చూసింది కేవలం అర్జునుడు మాత్రమే కాదు.. మరో మగ్గురున్నారు, ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 5
Also Read: ప్రతిష్ఠాత్మక యునెస్కో జాబితాలో చేరిన కోల్ కతా దుర్గామాత వేడుకలు
Also Read:  ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 16 Dec 2021 01:23 PM (IST) Tags: Varanasi ayodhya Madhura dwaraka Spiritual spiritual facts in seven seven spiritual healing spiritual places spiritual show best spiritual destinations spiritual awakening spiritual awakening stages best spiritual retreats best spiritual places to visit in us spiritual teachers best destinations for spiritual retreats Kaashi Kanchi Haridwar Ujjaini

ఇవి కూడా చూడండి

Bhagavad Gita: అనవసర విషయాల గురించి బాధపడుతున్నారా - గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా!

Bhagavad Gita: అనవసర విషయాల గురించి బాధపడుతున్నారా - గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా!

Friday Tips: శుక్రవారం రోజు ఈ పని చేస్తే లక్ష్మీదేవి కృప‌కు పాత్రుల‌వుతారు, శుక్రుడి అనుగ్ర‌హం కూడా!

Friday Tips: శుక్రవారం రోజు ఈ పని చేస్తే లక్ష్మీదేవి కృప‌కు పాత్రుల‌వుతారు, శుక్రుడి అనుగ్ర‌హం కూడా!

Horoscope Today September 22, 2023 :ఈ రాశివారు టైమ్ వేస్ట్ చేయడంలో ముందుంటారు, సెప్టెంబరు 22 రాశిఫలాలు

Horoscope Today September 22, 2023 :ఈ రాశివారు టైమ్ వేస్ట్ చేయడంలో ముందుంటారు, సెప్టెంబరు 22 రాశిఫలాలు

Astrology : ఈ రాశివారు బాగా సంపాదిస్తారు తక్కువ ఖర్చు చేస్తారు!

Astrology : ఈ రాశివారు బాగా సంపాదిస్తారు తక్కువ ఖర్చు చేస్తారు!

Astrology : ఈ రాశివారు ఎప్పుడూ ఒకరి అధీనంలోనే ఉంటారు, ఈ రాశివారి లక్షణమే ఇది!

Astrology : ఈ రాశివారు ఎప్పుడూ ఒకరి అధీనంలోనే ఉంటారు, ఈ రాశివారి లక్షణమే ఇది!

టాప్ స్టోరీస్

Nara Lokesh: మరికొన్ని రోజులు ఢిల్లీలోనే లోకేశ్! ఆ పరిణామంతో ఒక్కసారిగా మారిన నిర్ణయం!

Nara Lokesh: మరికొన్ని రోజులు ఢిల్లీలోనే లోకేశ్! ఆ పరిణామంతో ఒక్కసారిగా మారిన నిర్ణయం!

IND Vs AUS: ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో భారత్ విక్టరీ - చివరి వరకు ఉండి గెలిపించిన కెప్టెన్ కేఎల్!

IND Vs AUS: ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో భారత్ విక్టరీ - చివరి వరకు ఉండి గెలిపించిన కెప్టెన్ కేఎల్!

Pocharam Srinivas: చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pocharam Srinivas: చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత

Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత