By: ABP Desam | Updated at : 15 Dec 2021 08:30 AM (IST)
Edited By: RamaLakshmibai
2022 రాశి ఫలితాలు
రెండేళ్లుగా కరోనా చెడుగుడు ఆడేస్తోంది. ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త సర్దుమణుగుతోంది. గడిచిన బ్యాడ్ డేస్ ని వదిలేసి సరికొత్తగా కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారంతా. కొత్త ఆశలు, ఎన్నో కోర్కెలు, మరెన్నో అంచనాలతో 2022 కి వెల్ కమ్ చెప్పనున్నారు. మరి జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 2022 కొత్త ఏడాదిలో మేషం, వృషభం, మిథునం, కర్కాటకం రాశిఫలితాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.
మేషం
ఈ రాశి వారికి 2022 సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. విజయం సాధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితం అందుతుంది. కొత్త ఏడాదికి ఆర్థికంగా కలిసొస్తుంది. కొన్ని సందర్భాల్లో నిరాశ చెందుతారు. ఈ ఏడాది మీ వ్యక్తిగత, వృత్తి జీవితంలో పెద్ద మార్పులు ఉండొచ్చు. ఉద్యోగస్తులు పదోన్నతి పొందే అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారికి శుభసమయం. చిత్ర పరిశ్రమ, కళ, సంగీతం, దిగుమతి ఎగుమతుల రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంది. రాజకీయాల్లో ఉన్నవారికి కలిసొచ్చే సమయం. ఈ రాశికి చెందిన కొందరు వ్యక్తులు 2022లో పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు. ఏప్రిల్ తర్వాత మీ కుటుంబ జీవితంలో సయోధ్య కుదరక కొన్ని ఇబ్బందులును ఎదుర్కొంటారు. మీ కోపాన్ని అదుపులో ఉంచుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఈ రాశికి చెందిన వారు ఈ సంవత్సరం తమ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
వృషభం
2022 సంవత్సరం వృషభ రాశివారి జీవితంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. అయితే కష్టాల్లో కూడా మీరు ధైర్యంగా ఉంటారు. ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశి విద్యార్థులు విద్యా రంగంలో గొప్ప విజయాలు సాధిస్తారు. ఆర్థిక సమస్యలన్నీ ఈ ఏడాది ఓ కొలిక్కి వస్తాయి. గడిచిన సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. నిరుద్యోగులు ఈ సంవత్సరం మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారు. వ్యాపారులకు బావుంటుంది. సెప్టెంబర్ నెలలో మీ ఆదాయంలో పెరుగుదల ఉండొచ్చు.
Also Read: స్వర్గానికి షార్ట్ కట్! రూట్ మ్యాప్ క్లియర్‌గా ఉందిగా!
మిథునం
2022 ఏడాది ప్రారంభం మిథున రాశివారికి సవాలుగా ఉంటుంది. ఈ సమయంలో మీ ఆరోగ్యం బాగోదు. ఖర్చులు పెరగడంతో పాటూ ఆందోళనలు పెరుగుతాయి. గ్రహాల ప్రతికూల ప్రభావం వల్ల ముఖ్యమైన పనుల్లో అడ్డంకులు ఉండొచ్చు. ఏప్రిల్ తర్వాత కొంత ఉపశమనం లభిస్తుంది. ఈ రాశికి చెందిన నిరుద్యోగులకు ఆగస్టు నెలాఖరులోగా ఉపాధి లభించే అవకాశం ఉంది. మీ ప్రియమైన వారితో బలమైన సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నించండి. కెరీర్ పరంగా 2022 మీకు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగం మారాలని అనుకుంటే మీరు కోరుకున్న విధంగా ఫలితాలు పొందుతారు. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు లాభపడతారు. శత్రువుల కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
కర్కాటకం
ఈ రాశి వారు కొత్త సంవత్సరం ప్రారంభంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ కారణంగా వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. భాగస్వామ్యం వ్వాపారం చేసేవారికి సవాలుగా ఉంటుంది. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు వచ్చే అవకాశం లేదు. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ కొంత ఉపశమనం ఉండొచ్చు. మీ తెలివితేటలు మరియు కృషితో వైఫల్యాన్ని విజయంగా మార్చుకోవచ్చు. నిరుద్యోగులు ఈ ఏడాది మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారు. కొత్తగా ఏదైనా పని ప్రారంభించడానికి 2022 మంచి సంవత్సరం. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.ఏడాది ప్రధమార్థంలో కొన్ని సమస్యలు ఉన్నా..ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది.
Also Read: పుక్కిటి పురాణాలు కాదు… ప్రపంచాన్ని నడిపించే దిక్సూచీలు..
Also Read: పర స్త్రీ పై మోజుపడుతున్నారా... అయిదే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే....
Also Read: ఆదిశంకరాచార్యులను అమ్మవారు ఎందుకు కబళించాలని అనుకున్నారు? పాచికలాటలో గెలిచిందెవరు?
Also Read: చిన్న పిల్లలపై శని ప్రభావం ఉండదని ఎందుకంటారు...
Also Read: పుష్కరాల సమయంలో తప్పనిసరిగా నదీ స్నానం చేయాలని ఎందుకంటారు...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Vastu Sastra: మీ ఇంట్లో నీరు ప్రవహించే దిశే (వాలు) మీ ఆర్థిక పరిస్థితిని నిర్ణయిస్తుంది
Horoscope 8th July 2022: ఈ రాశివారు అస్సలు రిస్క్ చేయొద్దు, ఈ రెండు రాశులవారిపై లక్ష్మీదేవి కరుణ, జులై 8 రాశి ఫలాలు
Gorintaku: గోరింట ఆషాడమాసంలోనే ఎందుకంత ప్రత్యేకం, దీని పుట్టుక వెనుక ఇంత కథ ఉందా!
Panchang 8th July 2022: జులై 8 శుక్రవారం తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శుక్రవారం పఠించాల్సిన మహాలక్ష్మి అష్టకం
Tholi Ekadashi 2022: జులై 10 తొలి ఏకాదశి, ఈ రోజు ఉపవాసం ఉంటే మంచిదని ఎందుకంటారు!
Auto Insurance new Rules: వాహన బీమా రూల్స్ ఛేంజ్! ఎన్ని కి.మీ. తిప్పితే అంతే ప్రీమియం!
Raghurama Letter : సీఎం జగన్ నుంచి ప్రాణహానీ - ఎంపీలు అందరికీ లేఖలు రాసిన రఘురామ !
Maayon Telugu Movie Review - 'మాయోన్' రివ్యూ: శ్రీకృష్ణ మాయ నిజమా? కల్పితమా? ఈ మైథలాజికల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Redmi K50i: రెడ్మీ కే50ఐ వచ్చేది ఆరోజే - అధికారికంగా ప్రకటించిన కంపెనీ!