Sindhu Pushkaram: పుష్కరాల సమయంలో తప్పనిసరిగా నదీ స్నానం చేయాలని ఎందుకంటారు...
మనదేశంలో 12 నదుల్లో ప్రతి నదికీ 12 ఏళ్లకోసారి పుష్కరాలు వస్తాయి. ఇంతకీ పుష్కరుడు అంటే ఎవరు.. పుష్కరాలు ఎందుకు నిర్వహిస్తారు..ఆ సమయంలో నదుల్లో తప్పనిసరిగా స్నానాలు ఏందుకు చేయాలని చెబుతారు...
సమస్త ప్రాణకోటి మనుగడకు ఆధారం జలం. జలం పుట్టిన తర్వాతే జీవకోటి ఉద్భవించింది. జలధారల వెంటే నాగరికత విస్తరించింది. అలాంటి జలాన్ని దేవత రూపాలుగా పూజించడం హిందూ సంప్రదాయం. నదీ స్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు, మంగళ స్నానాలు అంటూ హిందువుల సంప్రదాయాలన్నీ నీటితోనే ముడిపడి ఉంటాయి. శ్రాద్ధకర్మలు, పిండ ప్రదానాలు, తర్పణాలు కూడా జలంతో ముడిపడినవే. నదీ స్నానాల్లో పుష్కర స్నానం పుణ్యప్రథమని హిందువుల విశ్వాసం. తైత్తరీయ ఉపనిషత్తు ప్రకారం బ్రహ్మ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి జలం, జలం నుంచి భూమి, భూమి నుంచి ఔషధాలు, ఔషధాల నుంచి అన్నం, అన్నం నుంచి జీవుడు పుట్టాయని వివరిస్తుంది .ఇలా జీవరాశులకు ప్రధానమైన జలం ప్రాముఖ్యతను గుర్తుచేసేవే పుష్కరాలు.
Also Read: అద్దం పగిలితే అరిష్టమా.. పగిలిన అద్దాన్ని ఇంట్లో ఎందుకు ఉంచకూడదు.. ఏం జరుగుతుంది..
పుష్కరాలు ఎలా మొదలయ్యాయి
పుష్కరం అంటే 12 సంవత్సరాలు అని ఆర్ధం. భారతకాలమానం ప్రకారం భారతదేశంలోని 12 ముఖ్యమైన నదులకు పుష్కరాలు బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించిన సమయంలో పుష్కరాలు వస్తాయి. ఈ పుష్కరాలు ఎలా మొదలయ్యాయి..ఎందుకింత ప్రఖ్యాతి సంపాదించుకున్నాయ్ అంటే దీనికి ఓ కథ చెబుతారు. పూర్వం పుష్కరుడు అనే బ్రాహ్మణుడు శివుని కోసం తపస్సు చేశాడట.ఆయన భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఏదైన వరం కోరుకోమని అడుగితే అందుకు పుష్కరుడు ఓ దేవా జీవులు చేసిన పాపాలతో నదులన్నీ అపవిత్రమవుతున్నాయి. నదులు పునీతమైతే ప్రజలు సుభిక్షంగా ఉంటారని నా శరీర స్పర్శచే పునీతమయ్యేట్లు వరం ఇవ్వమని అడిగాడట. అప్పుడు శివుడు నువ్వు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థం అవుతుందని, ఆ నదీలో స్నానం ఆచరించిన వారంతా పాప విముక్తులవు తారని వరం ఇచ్చినట్లు పురాణ గాథ
Also Read: ఆదిశంకరాచార్యులను అమ్మవారు ఎందుకు కబళించాలని అనుకున్నారు? పాచికలాటలో గెలిచిందెవరు?
ఈ ఏడాది సింధునది పుష్కరాలు
బృహస్పతి ఏడాదికి ఒక రాశి చొప్పున12 రాశుల్లో సంచరిస్తుంటాడు. బృహస్పతి ఆయా రాశుల్లో చేరినప్పుడు ఆయా నదులకు పుష్కరాలు నిర్వహిస్తుంటారు. తొలి 12 రోజులను ఆది పుష్కరాలుగా చివరి 12 రోజులను అంత్య పుష్కరాలుగా పరిగణించి వేడుకలు నిర్వహిస్తారు. ఈ ఏడాది బృహస్పతి కుంభరాశిలోకి నవంబర్ 20వ తేదీన ప్రవేశించడంతో డిసెంబర్ 1 వరకూ సింధు నదికి పుష్కరాలు జరుగుతున్నాయి. సింధు నది టిబెట్‌లోని మానస సరోవరం, కైలాసంలో పుట్టింది. టిబెట్ లో పుట్టిన సింధు నది.. మనదేశంలో కాశ్మీర్ దగ్గర ఉన్న లద్దాక్ డెమ్ చోక్ లో భారత్ లోకి ప్రవేశించి తర్వాత ఆక్రమిత కశ్మీర్ లోని గిల్గిట్ బాల్టిస్తాన్ మీదుగా ప్రవహించి కరాచీ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. సింధునది ఉప నదులు కశ్మీర్ లోయలో ప్రవహిస్తాయి. రావి, బియాస్, సట్లెజ్, చినాబ్, జీలం నదులు సింధు నదికి ఉపనదులే. లద్దాఖ్‌లోని లేహ్, శ్రీనగర్ సమీపంలో గంధర్‌బాల్ ప్రాంతాల్లో సింధూ నది పుష్కరాలు జరగుతున్నాయి.
Also Read: ఈ దిక్కున తలపెట్టి నిద్రిస్తే ఐశ్వర్యం, ఆ దిక్కున తలపెడితే అకాల మృత్యువు- వాస్తు ఏం చెబుతోంది-సైన్స్ ఏమంటోంది..
ఏ రాశిలో ఏ నదికి పుష్కరాలు
సింధు నది -కుంభ రాశి (20-11-2021)
ప్రణహిత నది -మీన రాశి (13-04-2022)
గంగానది - మేష రాశి (22-04-2023)
రేవా నది (నర్మద) -వృషభ రాశి (01-05-2024)
సరస్వతీ నది -మిథున రాశి (14-05-2025)
యమునా నది- కర్కాట రాశి (01-06-2026)
గోదావరి -సింహ రాశి (26-06-2027)
కృష్ణా నది -కన్యా రాశి (24-07-2028)
కావేరీ నది -తులా రాశి (24-08-2029)
భీమా నది -వృశ్చిక రాశి ( 23-09-2030)
పుష్కరవాహిని -ధనుర్ రాశి (15-10-2031)
తుంగభద్ర నది -మకర రాశి (24-10-2032)
Also Read: భక్తి తొమ్మిది రకాలు.. ఇందులో మీరు అనుసరిస్తున్న విధానం ఏంటి..
Also Read: రాళ్లు మాట్లాడతాయా… విగ్రహాలకు పూజలెందుకు అనేవారి ఇదే సమాధానమా..!
Also Read: కార్తీక దీపాలు నదులు, చెరువుల్లోనే ఎందుకు వదులుతారు...
Also Read: జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలివి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్