IPL, 2022 | Match 68 | Brabourne Stadium, Mumbai - 20 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
CSK
CSK
IPL, 2022 | Match 69 | Wankhede Stadium, Mumbai - 21 May, 07:30 pm IST
(Match Yet To Begin)
MI
MI
VS
DC
DC

Navavidha Bhakti: భక్తి తొమ్మిది రకాలు.. ఇందులో మీరు అనుసరిస్తున్న విధానం ఏంటి..

భగవంతుడిని చేరుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని అనుసరిస్తారు. ఈ భక్తిని తొమ్మిది రకాలుగా చెబుతారు. అవేంటో చూద్దాం...

FOLLOW US: 

నవవిధ భక్తి మార్గాలు' గురించి ప్రస్తావన పురాణాల్లో కనిపిస్తుంది. భగవంతుడిని భక్తులు సేవించి తరించడానికి 'శ్రవణం', 'కీర్తనం', 'స్మరణం', 'పాదసేవనం', 'అర్చనం', ' వందనం', 'దాస్యం', 'సఖ్యం', 'ఆత్మనివేదనం' వంటి తొమ్మిది భక్తి మార్గాలు చెప్పారు.  వీటిలో ఏ ఒక్క మార్గాన్ని అనుసరించినా ఆ భక్తుడి జీవితం ధన్యం అవుతుందంటారు పెద్దలు. ఈ తొమ్మిది మార్గాల్లో ఒక్కొక్కరూ ఒక్కొక్క మార్గాన్ని అనుసరించి చరిత్రలో నిలిచిపోయిన భక్తులు ఎందరో ఉన్నారు. 
శ్రవణం
భగవంతుడి గుణగణాలు, నామాలు, కథలు వినడం ద్వారా జ్ఞానాన్ని పెంచుకుని భగవంతుడికి దగ్గర కావడం. ఈ మార్గానికి పరీక్షిత్‌ మహారాజుఉదాహరణ. కథా శ్రవణాన్ని యోగంలా అనుష్ఠించి దాని ద్వారా ముక్తిని పొందాడు.
కీర్తనం
కీర్తనంలో ఉండే గానధర్మం వల్ల మనస్సు సహజంగా భగవంతుడివైపు ఆకర్షితమవుతుంది. భగవత్సంకీర్తనలో ప్రథమాచార్యుడిగా కీర్తి గాంచిన నారదుడు ఇందుకు ఉదాహరణ.
స్మరణం
భగవంతుణ్ని ధ్యానించడమే స్మరణ భక్తి. నిరంతరం నారాయణ నామస్మరణతో తరించి ఎన్నో అడ్డంకులను అవలీలగా ఎదుర్కొన్న  ప్రహ్లాదుడు ఇందుకు గొప్ప ఉదాహరణ.
పాదసేవనం
భగవంతుడి పాదాల్ని, గురువుల పాదాల్ని సేవించడమే పాద సేవన భక్తి. అన్నయ్యే అన్నీ అనే ఉద్దేశంతో లక్ష్మణుడు రాముడికి పాదసేవనం చేసి తరలించాడు
అర్చనం
తులసి, పుష్ప మాలలతో భగవంతుణ్ని పూజించడం అర్చన. దీనికి ఉదాహరణ మథురానగరంలో కంసుడి పరిచారిక అయిన కుబ్జ. రకరకాల సువాసనలతో లేపనాలు తయారుచేయడం ఆమె పని. కృష్ణుడికి ప్రేమతో తన దగ్గరున్న లేపనాలు అందిస్తుందామె. ఆ లేపనాలు పూసుకున్న కృష్ణుడు ఆమె పాదాలపై తనపాదాలు మోపి గడ్డాన్ని స్పృశించగానే కురూపిగా ఉన్న కబ్జ సురూపగా మారిపోతుంది. పృధు చక్రవర్తిని కూడా ఇందుకు ఉదాహరణగా చెబుతారు.
వందనం
భక్తి, శ్రద్ధలతో భగవంతుడికి నమస్కరించడం వందనభక్తి. దీనికి ఉదాహరణ అక్రూరుడు. బలరామకృష్ణుల్ని రథం మీద మథురకు తీసుకెళ్లడానికి వచ్చిన అక్రూరుడు.. బృందావనంలో శ్రీకృష్ణ, బలరాముల్ని సమీపించి వినయంతో వందనం చేసి భగవంతుడి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు.
దాస్యం
సర్వకాల సర్వావస్థల్లో భగవంతుడి సేవ చేస్తూ అదే భావనతో జీవించడమే దాస్యం.  శ్రీ కృష్ణుడి చరణ సేవా భాగ్యాన్ని కోరుతూ ‘నీకు దాస్యంబు చేయని జన్మమేలా’ అని రుక్మిణి భక్తిని ప్రదర్శించింది. గరుత్మంతుడు, ఆంజనేయులది కూడా దాస్యభక్తే.
సఖ్యం
భగవంతుణ్ని స్నేహితుడిగా భావించి ఆయన గుణగణాల్ని అలవర్చుకోవడమే సఖ్య భక్తి. దీనికి అర్జునుడు మంచి ఉదాహరణ. సఖ్యం ద్వారా సన్మార్గంలో నడవడమే కాదు విజయం దిశగా అడుగులు వేయొచ్చని నిరూపించాడు అర్జునుడు.
ఆత్మనివేదనం 
మనోవాక్కాయ కర్మలతో భగవంతుడికి తననుతాను అర్పించుకోవడం ఆత్మనివేదన భక్తి. బలి చక్రవర్తి ఇందుకు ఉదాహరణ. వచ్చినదెవరో తెలుసినప్పటికీ ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు తనని తాను అర్పించుకుని ఆత్మనివేదనం చేసుకున్నాడు బలిచక్రవర్తి. 
ఈ తొమ్మిది రకాల భక్తి మార్గాల్లో ఏం అనుసరించినా మోక్షం పొందొచ్చని భక్తుల విశ్వాసం.
Also Read: ఈ దిక్కున తలపెట్టి నిద్రిస్తే ఐశ్వర్యం, ఆ దిక్కున తలపెడితే అకాల మృత్యువు- వాస్తు ఏం చెబుతోంది-సైన్స్ ఏమంటోంది..
Also Read:  రాళ్లు మాట్లాడతాయా… విగ్రహాలకు పూజలెందుకు అనేవారి ఇదే సమాధానమా..!
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
Also Read: దొంగలే పాలకులు.. పాలకులే దొంగలు...కలికాలం అంటే ఇదే
Also Read: జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలివి
Also Read: అప్సరసలంటే ఎవరు.. మొత్తం ఎంత మంది ఉన్నారో తెలుసా..!
Also Read: 1008 రకాల కూరగాయలు ఉన్నాయా... ఇప్పటి వరకూ తిన్నారా ఎవరైనా...!
Also Read:  సంపాదన పెరగాలన్నా, వచ్చింది నిలవాలన్నా ఇలా చేస్తే మంచిదట...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 26 Nov 2021 06:54 PM (IST) Tags: nivedana Navavidha Bhakti Nine Ways Of Bhakti Archana Daasyam Keertanam Smaranam Vandanam Padasevanam Atmanivedanam Sakhyam

సంబంధిత కథనాలు

Gyanvapi Mosque Row: మూడు దశాబ్దాల క్రితమే మొదలైన జ్ఞానవాపి మసీదు వివాదం

Gyanvapi Mosque Row: మూడు దశాబ్దాల క్రితమే మొదలైన జ్ఞానవాపి మసీదు వివాదం

Bhanu Saptami 2022: ఈ ఆదివారం భానుసప్తమి, ఆ రోజు మాత్రం ఈ పనులు చేయకండి

Bhanu Saptami 2022: ఈ ఆదివారం భానుసప్తమి, ఆ రోజు మాత్రం ఈ పనులు చేయకండి

Today Panchang 19th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శ్రీ షిరిడీ సాయి బాబా అష్టోత్తర శత నామావళి

Today Panchang 19th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శ్రీ షిరిడీ సాయి బాబా అష్టోత్తర శత నామావళి

Horoscope Today 19th May 2022: ఈ రాశివారిని ఏదో ఆందోళన వెంటాడుతుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 19th May 2022:  ఈ రాశివారిని ఏదో ఆందోళన వెంటాడుతుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Gyanvapi Mosque : 'జ్ఞానవాపి' వెనుక ఇంత కథ ఉందా, శివలింగంతో పాటూ బావిలో దూకిన పూజారి!

Gyanvapi Mosque : 'జ్ఞానవాపి' వెనుక ఇంత కథ ఉందా, శివలింగంతో పాటూ బావిలో దూకిన పూజారి!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్క‌డ దాక్కున్నా లాక్కొచ్చి లోప‌లేయిస్తా: చంద్ర‌బాబు సంచలన వ్యాఖ్యలు

Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్క‌డ దాక్కున్నా లాక్కొచ్చి లోప‌లేయిస్తా: చంద్ర‌బాబు సంచలన వ్యాఖ్యలు

RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్‌పై బెంగళూరు ఘనవిజయం!

RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్‌పై బెంగళూరు ఘనవిజయం!

NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!

NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!

Nikhat Zareen: తెలంగాణ బంగారు కొండ - ప్రపంచ చాంపియన్‌గా నిఖత్ జరీన్!

Nikhat Zareen: తెలంగాణ బంగారు కొండ - ప్రపంచ చాంపియన్‌గా నిఖత్ జరీన్!