By: ABP Desam | Updated at : 23 Nov 2021 05:51 PM (IST)
Edited By: RamaLakshmibai
Vegetables
మార్కెట్ కి వెళితే మహా అయితే ఆకుకూరలు, కూరగాయలు కలపి మహా అయితే ఓ 30 రకాలు ఉంటాయేమో. వాటిలో కొనుక్కున్నా వారానికి సరపడా ఓ పది రకాలు కొంటారు. మరి ఈ వెయ్యి ఎనిమిది లెక్క ఎక్కడినుంచి వచ్చిందంటారా. ఈ ప్రస్తావన ఎక్కడ మొదలైందో తెలుసుకునేందుకు పురాణాల్లోకి వెళ్లాలి. ఓ సారి తన తండ్రి తద్దిన సందర్భంగా భోక్తగా ( భోజనానికి) రమ్మని వశిష్ఠ మహర్షి... విశ్వామిత్రుడిని పిలిచారు. సరే అన్న విశ్వామిత్రుడు ఓ షరతు విధించాడు.తనకు వెయ్యి ఎనిమిది రకాల కూరగాయలతో వంట చేసి వడ్డించాలని అడగ్గా.. వశిష్ట మహర్షి అందుకు అంగీకరించి తన భార్య అరుంధతికి చెబుతాను అన్నారు.
Also Read: 18 నంబర్ కి అయ్యప్పకి సంబంధం ఏంటి... మీ లక్షణాలను బట్టి మీరు ఎన్నో మెట్టుపై ఉన్నారో తెలుసుకోండి..
కార్యక్రమం రోజున చెప్పినట్టే విశ్వామిత్రుల వారు వశిష్టుడి ఇంటికి భోజనానికి వచ్చారు. అరటి ఆకు వేసిన అరుంధతి... కాకర కాయకూర, పనస పండు, నల్లేరు తీగతో పచ్చడి , కొన్ని కూరలు మాత్రమే వడ్డించింది. అదిచూసిన తర్వాత విశ్వామిత్రుడు కోపంతో..ఏంటిది... ఈ ఆకులో వెయ్యిన్ని ఎనిమిది రకాల కూరలు ఎక్కడున్నాయి అని అడిగారు. స్పందించిన వశిష్ఠుడు...తమ కోరికను అరుంధతికి చెప్పానని... అలాగే అని చెప్పిందని.. పిలిచి అడుగుతా అన్నారు వశిష్ట మహర్షి. వీరి మాటలు విన్న అరుంధతి తనకు తానే ముందుకు వచ్చి విశ్వామిత్రుల వారికి ఓ శ్లోకం చెప్పింది.
కారవల్లీ శతం చైవ వజ్రవల్లీ శత త్రయం
పనసమ్ షట్ శతశ్చైవ శ్రాద్ధకాలే విధీయతే
ఈ శ్లోకం అర్థమేంటంటే...శ్రాద్ధ సమయంలో వడ్డించిన ఒక కాకరకాయ నూరు కూరగాయలకు సమానము. వజ్రవళ్ళి (నల్లేరు) పచ్చడి మూడు వందల కూరలకు సమాన. పనసపండు ఆరు వందల కూరలకు సమానం. ఈ మూడు కలిపితే మొత్తం వెయ్యి కూరలు. ఇవికాక ఇంకొక ఎనిమిది రకాల కూరలు వండి వడ్డించాను అని చెప్పి నమస్కరించింది. అది విన్న విశ్వామిత్రుల వారు భోజనం చేసి వెళ్లిపోయారు.
Also Read: శివుడికే కాదు మనకూ మూడో కన్ను ఉందని మీకు తెలుసా...!
Also Read: అయ్యప్ప మాల వెనుక ఆరోగ్యం రహస్యం ఏంటి.. స్వామి అని ఎందుకు పిలవాలి...
Also Read: వెయ్యేళ్లనాటి ఆ ఆలయం చుట్టూ రంధ్రాలు... ఎందుకో ఇప్పటికీ అంతుచిక్కడం లేదు...
Also Read: జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలివి
Also Read: అప్సరసలంటే ఎవరు.. మొత్తం ఎంత మంది ఉన్నారో తెలుసా..!
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
Also Read: దక్షుడు, ఇంద్రుడు, చంద్రుడు, రాముడు, కుమారస్వామి ప్రతిష్టించిన శివలింగాలివే...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Revanth Reddy Astrology 2023 : ఇదీ రేవంత్ రెడ్డి జాతకం - అందుకే అఖండ విజయం- రాజయోగం!
Election Result 2023 Astrology: ఎన్నికల ఫలితాల్లో ఈ రాశులవారికి విజయం - వారికి అపజయం, గ్రహాలు చెప్పే ఎగ్జిట్ పోల్ ఇదే!
Horoscope Today December 23rd, 2023: ఈ రాశులవారికి ఆనందం - ఆ రాశులవారికి ఆందోళన, డిసెంబరు 03 రాశిఫలాలు
Astrology: ఈ 5 రాశులవారు అపర చాణక్యులు, వ్యూహం రచిస్తే తిరుగుండదు!
Margashira Masam 2023 Starting Ending Dates: ముక్కోటి ఏకాదశి, గీతాజయంతి సహా మార్గశిరమాసం ( డిసెంబరు) లో ముఖ్యమైన రోజులివే!
Chandrababu Srisailam Tour: మిగ్జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా
Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!
Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం
Cyclone Michaung Updates: మిగ్జాం తుపాను ఎఫెక్ట్, నిజాంపట్నం వద్ద 10వ నెంబర్ హెచ్చరిక జారీ
/body>