Vidudala OTT: డిసెంబర్ 20న విజయ్ సేతుపతి ‘విడుదల 2’... ఓటీటీలో ఫ్రీగా ప్రీక్వెల్ చూసేయండి - ఎందులోనో తెలుసా?
Vidudala OTT Platform: తమిళ హీరో విజయ్ సేతుపతి కొత్త సినిమా ‘విడుదల పార్ట్ 2’ థియేటర్లలోకి రానుంది. ఏడాది క్రితం వచ్చిన ‘విడుదల’ ఫస్ట్ పార్ట్ ను ఉచితంగా చూసే ఛాన్స్ ఇచ్చింది జీ5 యాప్.
‘మహారాజ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టారు తమిళ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi). నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ మూవీ ఓటీటీ ఆడియన్స్ కూ బాగా కనెక్ట్ అయింది. ఇటీవల చైనాలో కూడా విడుదలై మంచి కలెక్షన్లు సాధిస్తోంది. తాజాగా ఆయన నటించిన తాజా సినిమా ‘విడుదల’ పార్ట్ 2 డిసెంబర్ 20న విడుదల కానుంది. సామాజిక అంశాల నేపథ్యంలో సినిమాలు తీసే దర్శకునిగా వెట్రిమారన్ (Vetrimaaran)కు తమిళనాట ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలుగులోనూ ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. ఏడాది క్రితం వచ్చిన ‘విడుదలై పార్ట్ 1’ తమిళంలో మంచి విజయం సాధించింది. తెలుగు వెర్షన్ కు ఇక్కడ అంతగా ప్రజాదరణ దక్కలేదు. ఈ సినిమా సీక్వెల్ ‘విడుదలై పార్ట్ 2’ థియేటర్లలోకి రానుంది.
జీ 5 ఓటీటీలో ఫ్రీగా చూసేయండి
శ్రీ వేదాక్షరి మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు ‘విడుదలై పార్ట్ 2’ సినిమా తెలుగు వెర్షన్ ను విడుదల చేస్తున్నారు. రజనీకాంత్ ‘వేట్టయాన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల పరిచయమైన మలయాళ నటి మంజు వారియర్ (manju warrier) ఇందులో ఓ ముఖ్య పాత్రలో నటించారు. విడుదల పార్ట్ 2 థియేట్రికల్ రిలీజ్ సందర్భంగా ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఓటీటీ ప్రేక్షకులకు మంచి ఆఫర్ కల్పించింది. అది ‘విడుదల పార్ట్ 1’ను ఉచితంగా జీ5 లో ఉచితంగా చూడవచ్చు. అయితే, ఈ అవకాశం కేవలం డిసెంబర్ 20 వరకే !
పెరుమాళ్ ఫ్లాష్ బ్యాక్ మూవీ!
పెరుమాళ్ అనే తిరుగుబాటు నాయకుడి కథతో ఈ సినిమాను రూపొందించారు దర్శకుడు వెట్రిమారన్. ప్రభుత్వాన్ని ఎదిరించాలంటే హింసా మార్గమే సరైనదని నమ్మే వ్యక్తి పెరుమాళ్. ఆయన్ని పట్టుకోవడానికి పోలీస్ యంత్రాంగం మొత్తం అడవిని జల్లెడ పడుతుంది. అడవిని కూంబింగ్ చేసే పోలీసుల్లో ఒకరైన హోంగార్డు కుమరేశన్ గా కనిపిస్తారు సూరి (Soori). అప్పటివరకూ కామెడీ పాత్రలు చేసిన సూరి తొలిసారిగా ఓ సీరియస్ రోల్ చేయడం కొసమెరుపు. ఈ సినిమా తర్వాతే సూరి హీరోగా నిలదొక్కుకున్నారు. ఆయన ఇటీవలే నటించిన ‘కొట్టుక్కళి’ సినిమా తమిళ నాట మంచి విజయం సాధించింది. విడుదల రెండో భాగంలో పెరుమాళ్ ఫ్యాష్ బ్యాక్ చూపిస్తారు. ఆయన చిన్నతనం, పెరుమాళ్ ఏ పరిస్థితుల్లో ఉద్యమ బాట పట్టాడో ఇవన్నీ రెండో భాగంలో చూపిస్తారు. ఇందులోనే పెరుమాళ్ భార్య పాత్రలో మంజూ వారియర్ నటించారు.
Also Read: ఆస్కార్ 2025 రేసులో ఇండియన్ సినిమా అవుట్... టాప్ 10లో 'లాపతా లేడీస్' లేదు
కథ తేలుస్తారా? కొనసాగిస్తారా?
అసలు ‘విడుదల’ మొదటి భాగమే అసంపూర్తిగా ముగిసిన ఫీలింగ్ కలుగుతుంది. మరి రెండో భాగంలోనైనా కథను ముగిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. దర్శకుడు వెట్రిమారన్ వద్ద మూడు, నాలుగు భాగాలకు సరిపడా సీన్లు ఉన్నాయని హీరో విజయ్ సేతుపతి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. ‘విడుదలై’ మొదటి భాగంలో దర్శకుడు గౌతమ్ మీనన్ పోలీస్ అధికారిగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండో భాగంలోనూ ఆయన పాత్ర కొనసాగుతుంది. ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందించారు. దర్శకుడు వెట్రిమారన్ త్వరలోనే హీరో జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా తీస్తారననే ప్రచారం జరుగుతోంది.
Also Read: సౌత్ కంటే డబుల్... హిందీలో మొదటి సినిమా 'బేబీ జాన్' కోసం రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్