అన్వేషించండి
Advertisement
Kalikalam: దొంగలే పాలకులు.. పాలకులే దొంగలు...కలికాలం అంటే ఇదే
అంతా కలికాలం అని అంటుంటారు కానీ ఎందుకలా అంటారు..ధర్మం ఒక్క పాదంపై నడిచే కలికాలంలో స్త్రీ, పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా...
నాలుగు యుగాల్లో కలియుగం చివరిది. ఈ యుగంలో కలిపురుషుడి పుట్టుకే ప్రకృతి విరుద్ధంగా ఉంటుంది. క్రుద్దుడు అనే యువకుడు 'హింస' అనే తోడబుట్టిన చెల్లెల్నే పెళ్లిచేసుకుంటాడు. వారికి పుట్టినవాడే "కలిపురుషుడు". అంటే ఎంత వేద విరుద్దంగా అతడు జన్మించాడో అర్ధమవుతుంది. కలిపురుషుడి ఆలోచనలు ఎలా ఉంటాయంటే "ధర్మమా"! అంటే ఏంటి అంటాడు. అలాంటి వాడు పాలకుడైతే ఎంత అధర్మంగా బతుకుతామో చెప్పేదేముంది. అందుకే కలిపురుషుడిది పాపభూష్టమైన, వేద విరుద్దమైన జీవితం. ఈశ్వరుడు ఏది నిషిద్ద కర్మగా చెప్పాడో.. దానిపై ఆసక్తి కలిగించడమే కలిపురుషుడి పని. జీవితాలను ఎంత పతనావస్తకైనా తీసుకుపోగలడని చెబుతారు.
Also Read: జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలివి
కలియుగం లక్షణాలివే...
- కలియుగం ఆరంభమైన వెంటనే మనుషుల్లో పవిత్రత నశిస్తుంది. నిజం మాట్లాడటమే మహాపాపం అన్నట్టు భావిస్తారు. 'పర' నింద చేస్తారు, పరద్రవ్యములై ఆసక్తి పెరుగుతుంది, పరస్త్రీలమీద అభిలాష కలిగి ఉంటారు. ఎదుటి వారిని ధూషిస్తూ కాలం గడిపేస్తారు.
- సర్వపాపాలకూ మూలం దేహం. శరీరాన్ని తృప్తి పరిచేందుకు సర్వపాపాలు చేస్తారు. దేహానికి అతీతమైనది ఒకటి ఉందని చెప్పినా చెవికి ఎక్కించుకోరు. కలియుగంలో నాస్తికులు ఎక్కువమంది ఉంటారు.
- “నాస్తికో వేదనిందకః” అన్నట్టు…వేదాలను నిందిస్తూ, పశుబుద్ధితో తల్దిదండ్రులపై ద్వేషం కలిగి ఉంటారు.
- కలియుగంలో కామానికి తలొంచని పురుషుడు ఉండడు
- ధనార్జనే ప్రధాన ధ్యేయంగా బతుకుతారు. వేదవిద్యలను, జ్ఞానాన్ని అమ్మకుంటారు. విద్యల ప్రయోజనం ధనమే అన్నట్టు ప్రవర్తిస్తారు. జీవిత పరమార్థాన్ని తెలియజెప్పే విద్యలనూ ధనార్జన దృష్టితోనే నేర్చుకుంటారు.
- బ్రాహ్మణులు తాము చేయవలసిన కర్మలు విడిచిపెట్టి పరులను వంచిస్తూ తిరుగుతూంటారు. త్రికాల సంధ్యావందనం విడిచిపెట్టి బ్రహ్మజ్ఞానం లేకుండా ఉంటారు.
- దయలేనివారే పండితుల్లా చలామణి అవుతూ.. నిజమైన పండితులకి, వారి ఆచారాలకీ, వ్రతాలకీ లోపం కలిగిస్తూ ఉంటారు.
- క్షత్రియులు స్వధర్మాన్ని విడిచిపెట్టి చెడ్డవారితో స్నేహం చేస్తారు. వారిలో శూరత్వం ఉండదు. ఇక్కడ క్షత్రియులు అంటే పాలకులు అని భావించవచ్చు.
- దొంగలే పాలకులవుతారు, పాలకులు దొంగల్లా ప్రవర్తిస్తారు.
- గోవులను హింసిస్తారు. పండితుల సంపదలపై ఆశపడతారు, దేవుడికి సంబంధించిన ఆస్తులు కాజేస్తారు, హింసాపరులవుతారు
- గురువుల పట్ల భక్తిలేనివారై ఉంటారు… పండితులను దూషిస్తూ తిరుగుతారు
- ధనవంతులు చేయకూడని పనులు చేస్తారు, విద్యావంతులు వితండవాదం చేస్తారు
- స్త్రీలు ఎక్కువమంది చెడిపోవడమే కాదు, భర్తను అవమానించడంలోనే ఉత్సాహం చూపిస్తారు, అత్తింటికి ఎసరు పెట్టే లక్షణాలు కలిగి ఉంటారు
- అధర్మానికి పాల్పడడంలో కలియుగంలో స్త్రీలకు తెగింపు ఎక్కువ. ఒకప్పుడు శుద్ధమైన అన్నం పుట్టింది అంటే స్త్రీవల్లనే. ఆ స్త్రీయే ధర్మాన్ని విడిచిపెట్టడం వల్ల మలినాన్ని తింటారు. అంటే ఇళ్లలో ఆచార రహితంగా వండిన అన్నం తింటారు.
Also Read: అఘోరాలు పూజలు చేసే దేవాలయాలివే....
Also Read: దీపారాధనకు ఏ కుందులు వాడుతున్నారు... ఎందులో దీపం పెడితే ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసా..
Also Read: కాశీలో వదిలేయాల్సింది కాకరకాయో, కమలాపండో కాదు…
Also Read: దక్షుడు, ఇంద్రుడు, చంద్రుడు, రాముడు, కుమారస్వామి ప్రతిష్టించిన శివలింగాలివే...
Also Read: నీరు, నిప్పు, నింగి, గాలి, పృథ్వి .. పంచభూత శివలింగాలు ఎక్కడ ఉన్నాయంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement