అన్వేషించండి

IND vs AUS 3rd Test Match: డ్రాగా ముగిసిన "గబ్బా" టెస్టు - 1-1తో సిరీస్‌ సమానం- కపిల్ రికార్డు బ్రేక్ చేసిన బుమ్రా

IND vs AUS: కంటిన్యూగా కురుస్తున్న వర్షం కారణంగా గబ్బా టెస్టు డ్రాగా ముగిసింది. ఐదో రోజు ఆట ప్రారభంలోనే వికెట్లు టపటపా పడిపోయాయి. అయితే టీ బ్రేక్ తర్వాత మ్యాచ్ ముందుకు సాగే పరిస్థితి లేకుండా పోయింది.

IND vs AUS 3rd Test Target: అనూహ్య మలుపు తిరిగిన గాబ్బా టెస్టు చివరికి డ్రాగా ముగిసింది. జోరు వాన కారణంగా టీ బ్రేక్ తర్వాత మ్యాచ్‌ ఆడే వీలు లేకుండా పోయింది. అందుకే మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. పిచ్‌ బౌలింగ్‌ అనుకూలంగా ఉండటంతో భారత్‌ను త్వరగా ఆలౌట్ చేయాలనే ఉద్దేశంతో ఆస్ట్రేలియా 89 పరుగులకే డిక్లేర్ చేసింది. తొలి సెషన్ ఆడిన తర్వాత రిక్లేర్ చేసి భారత్ ముందు 275 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇవాళ రెండో ఇన్నింగ్స్‌లో 89 పరుగుల చేసింది. మొత్తంగా టీమిండియా గెలవాలంటే 275 పరుగులు చేయాల్సి ఉండేది. 

భారత్‌ తరఫున రెండో ఇన్నింగ్స్‌లో జస్‌ప్రీత్‌ బుమ్రా 3 వికెట్లు తీయగా, మహ్మద్‌ సిరాజ్‌, ఆకాశ్‌దీప్‌ చెరో రెండు వికెట్లు తీశారు. ఐదో రోజు ప్రారంభంలో భారత జట్టు 8 పరుగులు మాత్రమే జోడించి ఆకాశ్‌దీప్‌ వికెట్ కోల్పోయి అలౌట్ అయింది. టీమ్ ఇండియా మొదటి ఇన్నింగ్స్ 260 పరుగుల వద్ద ముగిసింది.

ఐదో రోజు ఆస్ట్రేలియా 185 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే దెబ్బ తీశాడు. ఉస్మాన్ ఖ్వాజా 8 పరుగులు చేసి ఔటవ్వగా, మార్నస్ లాబుషేన్‌ కేవలం 1 పరుగు చేసి ఔటయ్యాడు. ఆకాశ్‌దీప్ కూడా కంగారూ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడు. ఈ క్రమంలోనే నాథన్ మెక్‌స్వీనీ, మిచెల్ మార్ష్‌ల వికెట్లు తీశాడు. మొహమ్మద్ సిరాజ్ కూడా వారిచ్చిన ఉత్సాహంతో స్టీవ్ స్మిత్‌ను, తర్వాత ట్రావిస్ హెడ్‌ను అవుట్ చేశాడు.  

గబ్బాలో చరిత్ర సృష్టిస్తుందని అనుకున్నారు. కానీ... 

చివరిసారిగా గబ్బా మైదానంలో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడగా, టీమ్ ఇండియా 3 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. రిషబ్ పంత్ 89 పరుగుల ఇన్నింగ్స్ అద్భుతం చేశాడు. అప్పుడు 28 ఏళ్ల తర్వాత గబ్బా మైదానంలో ఓ జట్టు ఆస్ట్రేలియాను ఓడించింది. ఇప్పుడు కూడా అలాంటి అద్భుతం చూస్తామనుకుంటే దానికి వరుణుడు అడ్డుపడ్డాడు. అయితే నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ఈజీ కాకపోయినా  ఏదైనా మ్యాజిక్ జరగబోతోందా అని అభిమానులు ఎదురు చూశారు. కానీ వరుణుడు అడ్డుపడ్డాడు. 

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియాలు ఒక్కో మ్యాచ్ గెలిచాయి. వర్షం కారణంగా గాబా టెస్టు డ్రాగా ముగియడంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పట్టికలో ఇరు జట్లకు 4-4 పాయింట్లు లభించా.యి. దీంతో ఫైనల్ రేసు మరింత ఉత్కంఠగా మారింది. 

ఈ సిరీస్‌లో భారత జట్టు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియాపై రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఆసీస్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి లెజెండరీ కెప్టెన్ కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియాలో అత్యంత వేగంగా ఎక్కువ టెస్టు వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు.

కపిల్ దేవ్ రికార్డు బ్రేక్
రెండో ఇన్నింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్‌తో ఉస్మాన్ ఖవాజా వికెట్ తీసి కపిల్ దేవ్‌ రికార్డును అధిగమించాడు. కపిల్ దేవ్ పేరిట ఉన్న 51 వికెట్ల రికార్డును బుమ్రా అధిగమించాడు. ప్రస్తుత సిరీస్‌లో మూడో టెస్టు మ్యాచ్‌లో 20 వికెట్లు పడగొట్టాడు. భారత బౌలర్లు వికెట్ల కోసం ఇబ్బంది పడుతున్న టైంలో కూడా గబ్బా టెస్టులో బుమ్రా 6 వికెట్లు తీశారు. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా 3 వికెట్లు తీసి  గేమ్ ఛేంజర్ అయ్యాడు.  

టాప్ హెడ్ లైన్స్

Priyansh Arya Record: రాహుల్ రికార్డును బద్దలు కొట్టిన ప్రియాంశ్ ..19 సిక్సర్లతో ప్రపంచ రికార్డు సమం చేసిన ఢిల్లీ కెప్టెన్
రాహుల్ రికార్డును బద్దలు కొట్టిన ప్రియాంశ్ ..19 సిక్సర్లతో ప్రపంచ రికార్డు సమం చేసిన ఢిల్లీ కెప్టెన్
Prithvi Shaw Warning: యువరాజ్ సింగ్ తండ్రికి పృథ్వీ షా స్ట్రాంగ్ వార్నింగ్..!! కాంబ్లీతో పోల్చడంపై ఆగ్రహం, పబ్లిసిటీ కోసం పరువు తీస్తే ...
యువరాజ్ సింగ్ తండ్రికి పృథ్వీ షా స్ట్రాంగ్ వార్నింగ్..!! కాంబ్లీతో పోల్చడంపై ఆగ్రహం, పబ్లిసిటీ కోసం పరువు తీస్తే ...
Shubman Gill Statement:  తొలిటెస్టును 15 ఓవర్ల ముందే డ్రాగా ముగించడంపై కెప్టెన్  గిల్ కీలక వ్యాఖ్యలు.. ఆ నిబంధ‌న ఎత్తివేయాలని ఐసీసీకి విజ్ఞప్తి
Shubman Gill Statement:  తొలిటెస్టును 15 ఓవర్ల ముందే డ్రాగా ముగించడంపై కెప్టెన్  గిల్ కీలక వ్యాఖ్యలు.. ఆ నిబంధ‌న ఎత్తివేయాలని ఐసీసీకి విజ్ఞప్తి
Tilak Varma Century: కెప్టెన్ తిలక్ శతకం వృథా.. ఇండియా ఏపై పాక్ ఘన విజయం, అభిషేక్ , షాబాజ్ పోరాడినా తప్పని ఓటమి
కెప్టెన్ తిలక్ శతకం వృథా.. ఇండియా ఏపై పాక్ ఘన విజయం, అభిషేక్ , షాబాజ్ పోరాడినా తప్పని ఓటమి

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trainee IPS Harassment Case: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్.. ఏ2గా సోదరుడు ప్రణయ్ పేరు చేర్చిన పోలీసులు
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్.. ఏ2గా సోదరుడు ప్రణయ్ పేరు
దేవ దీపావళి 2026: వారణాసిలో లేజర్, డ్రోన్ షోలతో 11 లక్షల దీపాల వెలుగులు!
దేవ దీపావళి 2026: వారణాసిలో లేజర్, డ్రోన్ షోలతో 11 లక్షల దీపాల వెలుగులు!
MIM Murtuza Pahalwan Murder: శంషాబాద్‌లో ఎంఐఎం నేత ముర్తుజ పైల్వాన్ దారుణ హత్య.. కత్తులతో 10 మంది మెరుపు దాడి!
శంషాబాద్‌లో ఎంఐఎం నేత ముర్తుజ పైల్వాన్ దారుణ హత్య.. కత్తులతో 10 మంది మెరుపు దాడి!
లాంచ్‌కు ముందే షోరూమ్‌లో దర్శనమిచ్చిన Bajaj Pulsar 125 Neon.. పాత క్లాసిక్ లుక్‌తో అదరగొడుతున్న బైక్!
తక్కువ ధరలో కొత్త పల్సర్ 125 వస్తోందా? లాంచ్‌కు ముందే కనిపించిన Bajaj Pulsar 125 Neon
Contaminated Drinking Water : కలుషితమైన నీరు తాగుతున్నారా? కిడ్నీలు, లివర్‌పై ప్రభావం ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కలుషితమైన నీరు తాగుతున్నారా? కిడ్నీలు, లివర్‌పై ప్రభావం ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కార్తీక పౌర్ణమి 2026: ఇంటి పైకప్పుపై ఆకాశ దీపం.. పితృ మోక్షం, శ్రేయస్సు
కార్తీక పౌర్ణమి 2026: ఇంటి పైకప్పుపై ఆకాశ దీపం.. పితృ మోక్షం, శ్రేయస్సు
Nvidia CEO జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ఒక్కరోజులో 31శాతం పెరిగిన షేర్ల విలువ, AI స్టాక్స్‌ భారీ ర్యాలీ
Nvidia CEO జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ఒక్కరోజులో 31శాతం పెరిగిన షేర్ల విలువ
Renigunta Temple Removal: రేణిగుంట ఆలయ తొలగింపుపై భూమన ఆరోపణలు అవాస్తవం.. భక్తుల మనోభావాలను రెచ్చగొడుతున్నారు: మంత్రి ఆనం
రేణిగుంట ఆలయ తొలగింపుపై భూమన ఆరోపణలు అవాస్తవం.. భక్తుల మనోభావాలను రెచ్చగొడుతున్నారు: మంత్రి ఆనం
Embed widget