Mahesh Babu: మహేష్ బాబుకు ఈడి నోటీసులు... రియల్ ఎస్టేట్ కంపెనీ కేసులో విచారణకు... 6 కోట్లకు లెక్కలు చెప్పాలని...
సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు రావాలని ఆదేశించింది. రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన కేసులో ఆయనకు ఎందుకు నోటీసులు ఇచ్చారనే వివరాల్లోకి వెళితే....

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనల్లో కూడా నటిస్తున్నారు. కొన్ని నిమిషాల పాటు కనిపించే యాడ్స్ కోసం కోట్ల రూపాయలలో పారితోషికం అందుకుంటున్నారు. గతంలో చేసిన ఒక యాడ్ విషయమై... విచారణకు రావలసిందిగా ఈడి (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే...
సాయి సూర్య డెవలపర్స్ కేసులో హీరోకి నోటీసులు!
సాయి సూర్య డెవలపర్స్, సురనా గ్రూప్ కంపెనీలలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ (Enforcement Directorate) విచారణ మొదలు పెట్టింది. ఆ సంస్థకు మహేష్ బాబు యాడ్స్ చేశారు. అందుకుగాను ఆయనకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ అందినట్లు సమాచారం.
Mahesh Babu remuneration per Sai Surya Developers advertisement: సాయి సూర్య డెవలపర్స్ కంపెనీకి చెందిన ప్రాపర్టీలకు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ కింద వ్యవహరించారు. ఆ యాడ్స్ చేసినందుకు గాను ఐదు కోట్ల 90 లక్షల రూపాయలను ఆయన తీసుకున్నారట. మూడున్నర కోట్ల రూపాయలు నగదు రూపంలో, రెండున్నర కోట్ల రూపాయలు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మహేష్ బాబుకు సాయి సూర్య డెవలపర్స్ అందజేసిందట. ఆ పారితోషికం విషయంలో (ఆర్థిక లావాదేవీలకు సంబంధించి) ఈ నెల 27న విచారణకు రావాల్సిందిగా మహేష్ బాబును ఈడి ఆదేశించింది. మరి సూపర్ స్టార్ స్వయంగా విచారణకు హాజరు అవుతారా? లేదంటే ఆయన న్యాయవాదిని పంపిస్తారా? వెయిట్ అండ్ సీ.
Also Read: డబ్బా రోల్స్ చేయడం కంటే ఆంటీగా నటించడం బెటర్ - జ్యోతికను టార్గెట్ చేసిన సిమ్రాన్?
రాజమౌళి సినిమా చిత్రీకరణలో మహేష్ బాబు బిజీ!
Mahesh Babu Rajamouli Movie: సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ అడ్వెంచరస్ సినిమాలో (SSMB29) మహేష్ బాబు నటిస్తున్నారు ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. సినిమా చిత్రీకరణ కోసం ప్రత్యేకంగా ఒక బోట్ సెట్ వేసినట్లు తెలిసింది. అందులో కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి రాజమౌళి సన్నాహాలు చేశారు.
Also Read: రాశీ కాదు... హాటీ... రెడ్ స్విమ్‌సూట్‌లో సెక్సీగా బ్యూటిఫుల్ ఖన్నా, ఫోటోలు చూడండి





















