By: ABP Desam | Updated at : 27 Nov 2021 12:27 PM (IST)
Edited By: RamaLakshmibai
అద్దం పగిలితే అరిష్టమా...
అద్దం పగిలితే అరిష్టం, పగిలిన అద్దంలో మొహాన్ని చూసుకోకూడదు, పగిలిన అద్దాన్ని ఇంట్లో ఉంచకూడదు, మరకలు పడిన లేదా మాసిపోయిన అద్దాన్ని అస్సలే ఉంచకూడదు, అద్దం లక్ష్మీదేవి అని పెద్దలు చెబుతాంటారు. అప్పట్లో అద్దాలు లేవు కాబట్టి నదులు, సరస్సులు, చెరువులూలో ప్రతిబింబాన్ని చూసుకునేవారు.ఈ ప్రతిబింబాలు మన ఆత్మలాగే మనతోనే ఉంటాయి కూడా నమ్మేవారు. ఇలా ప్రతి బింబాలని చూసుకునేటప్పుడు ఏ మాత్రం అటూ ఇటూ అనిపించినా అశుభమనుకునేవారు. అద్దాలు వచ్చాకా అవి పగిలితే అశుభం అన్నట్టు మారిందంటారు.
అద్దం అమ్మవారి స్వరూపం అని, గడియారం ఈశ్వర స్వరూపం అని విశ్వసిస్తారు. లక్షీ స్వరూపంగా భావించే అద్దం పగిలితే ఏదో కీడు జరుగుతుందనే సంకేతం అట. సంపద నష్టపోతారని, ఇంట్లో మనశ్సాంతి ఉండదని చెబుతారు. ఎందుకంటే అద్దంలో ఎప్పుడూ ఒకే బొమ్మ నిలకడగా ఉండదు..లక్ష్మీదేవి కూడా ఒకే దగ్గర ఉండిపోదంటారు. అద్దం ముక్కలైనట్టే సంపద చెల్లాచెదురు అయిపోతుందని చెబుతారు. ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా అద్దం ఉంటే, ఇంట్లోకి ప్రవేశించే ఆరోగ్యకరమైన శక్తి పరావర్తనం చెంది తిరిగి వెళ్లిపోతుందని విశ్వసిస్తారు. దైవ స్వరూపంగా భావించడం వల్లే మైల వచ్చినప్పుడు అద్దాన్ని వినియోగించనివ్వరు పెద్దలు. ఇంట్లో అద్దం పగిలిప్పుడు ఆ అరిష్టం పోవాలంటే ముత్తైదువులకు అద్దం దానం చేయాలట.
Also Read:
విదేశీయులకూ అద్దం సెంటిమెంట్
అద్దం పగిలితే హిందువులు కొన్ని విశ్వశించినట్టే విదేశీయులూ కొన్ని పాటిస్తుంటారు. ముఖ్యంగా రోమన్లు, గ్రీకులు, చైనీయులు, ఆఫ్రికన్లకి అద్దం చాలా సెంటిమెంట్. అద్దం మనను ప్రతిబింబిస్తుందని, అది పగిలిందంటే మన రూపం ఛిద్రమైనట్టే..అంటే మరణించే సమయం ఆసన్నమైందని తెలసుకోవాలంటారు. పగిలిన అద్దంలో ముఖం చూసుకోవద్దనేది కూడా అందుకే చెబుతారు. అద్దం విషయంలో అమెరికా, ఐర్లాండ్ దేశాల్లోని కొన్ని ప్రాంతాలవారికి ఓ బలమైన నమ్మకం ఉంది. తెలిసినవాళ్లెవరైనా చనిపోతే, వెంటనే ఇంట్లో ఉన్న అద్దాలన్నిటి మీదా గుడ్డ కప్పేస్తారట. చనిపోయి వారి ఆత్మ వెంటనే ఈ లోకాన్ని విడిచిపెట్టి పోదని, తనవాళ్ల చుట్టూ తిరుగుతుందని, తనకు ఆశ్రయమిచ్చే మరో శరీరం కోసం వెతుకుతుందని, అది దొరికేవరకూ అద్దంలో తలదాచుకుంటుందని అంటారు. అందువల్లే ఎక్కడ ఆ ఆత్మ వచ్చి చేరుతుందో అని భయపడి అద్దాలను కప్పేస్తారట.
Also Read: ఈ దిక్కున తలపెట్టి నిద్రిస్తే ఐశ్వర్యం, ఆ దిక్కున తలపెడితే అకాల మృత్యువు- వాస్తు ఏం చెబుతోంది-సైన్స్ ఏమంటోంది..
అద్దం పగిలితే అరిష్టం, సంపద పోతుంది, ఆత్మలొస్తాయి ఇవన్నీ మాటల్లో చెప్పుకోవడమే కానీ నిజంగా అలా జరిగినట్టు ఎక్కడా ఆధారాలు లేవు. వాస్తవానికి పగిలిన అద్దంలో చూసుకుంటే కళ్లకు మంచిది కాదంటారు. పొరపాటున చిన్న గాజు పెంకు గుచ్చుకున్నా కొన్నిసార్లు ప్రాణాపాయం జరగొచ్చు. ఆరోగ్య పరంగా చెప్పేకన్నా అరిష్టం అంటూ సెంటిమెంట్స్ కి ముడిపెడితే తొందరగా అర్థమవుతుందని కూడా అలా చెప్పి ఉండొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. ఏదేమైనా పెద్దలు చెప్పినవి పాటించడం వల్ల లాభమే కానీ నష్టం లేదని గుర్తించే చాలంటున్నారంతా.
Also Read: భక్తి తొమ్మిది రకాలు.. ఇందులో మీరు అనుసరిస్తున్న విధానం ఏంటి..
Also Read: రాళ్లు మాట్లాడతాయా… విగ్రహాలకు పూజలెందుకు అనేవారి ఇదే సమాధానమా..!
Also Read: కార్తీక దీపాలు నదులు, చెరువుల్లోనే ఎందుకు వదులుతారు...
Also Read: జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలివి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్
ఈ తేదీన రాహు-చంద్ర గ్రహణ యోగం – ఈ 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే..
భద్రాచల రాములోరి పెండ్లికి ఈసారి చేస్తున్న ఏర్పాట్లివే! మంత్రికి వివరించిన అధికారులు
ఇంట్లో అద్దం ఇక్కడ పొరపాటున పెట్టినా సమస్యలు తప్పవు
Chanakya Neethi: ఇలాంటి ఇంట్లో లక్ష్మి నిలవదు, ఆర్థికంగా నష్టపోతారు - చాణక్యుడు చెప్పిన కఠోర వాస్తవాలు
Ugadi Panchangam in Telugu (2023-2024): శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి ఏలినాటి శని ఉన్నప్పటికీ అన్నీ అనుకూల ఫలితాలే!
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్