Mahabharat: స్వర్గానికి షార్ట్ కట్! ధర్మరాజు తమ్ముళ్లు కుక్కతో కలసి వెళ్లిన రూట్ మ్యాప్ క్లియర్‌గా ఉందిగా!
మీరు స్వర్గానికి వెళతారా-నరకానికి వెళతారా అంటే.. స్వర్గానికే అని ఠక్కున చెబుతారు. అయితే ఏ రూట్లో ఎలా వెళ్లాలో మ్యాప్ క్లియర్ గా ఉందిక్కడ..
మహాభారతయుద్ధం అనంతరం పాండవులు ఏమయ్యారు, ఎక్కడికి వెళ్లారు అనే ఎన్నో ప్రశ్నలకు సమాధానం స్వర్గారోహణ పర్వం. భూమి నుంచి స్వర్గానికి పాండవులు ఎలా వెళ్లిన మార్గం ఇప్పటికీ ఉందని చెబుతారు. ఉత్తరాఖండ్ బదరీనాథ్ క్షేత్రం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో పాండవులు ప్రయాణం ప్రారంభించారు. దీన్ని "సాతో పంథ్ ట్రెక్" అని పిలుస్తారు. ఈ మార్గం నుంచి పాండవులు తమ స్వర్గారోహణను ప్రారంభించారని చెబుతారు. పాండవులు వెళ్లిన ఈ మార్గంలో నడిస్తే స్వర్గప్రాప్తి కలుగుతుందని కొందరి విశ్వాసం. అందుకే దీన్ని స్వర్గారోహణం అని పిలుస్తారు.
Also Read: 2022 మరింత అరాచకం.. నోస్ట్రడామస్ భవిష్యవాణి, గతంలోనూ చెప్పిందే జరిగింది..
అంత సులువేం కాదు
అత్యంత కఠినమైన ఈ యాత్ర చేయాలంటే మొదట ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. ఈ మార్గంలో వెళ్లిన పాండవుల్లో ధర్మరాజు, కుక్క మాత్రమే స్వర్గానికి చేరుకున్నాయి ...మిగిలిన నలుగురూ మార్గమధ్యలోనే పడిపోయారంటే ఈ మార్గం ఎంత కఠినమైనదో ఆలోచించండి. ఈ ట్రెక్కింగ్ కి కేవలం శారీరక ధారుఢ్యం ఉంటే చాలదు, మానసిక స్థైర్యం కూడా ఉండాలి. తినడానికి ఏమీ దొరకవు, ఎలాంటి వసతి సౌకర్యాలు ఉండవు. పాండవుల్లో ధర్మరాజు తప్ప మిగిలిన వారందరూ ఈ మార్గ మధ్యంలో తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు.
Also Read: కిచెన్లో పూజామందిరం పెట్టేశారా... దేవుడి మందిరం ఎక్కడ ఉండాలి..ఎక్కడ ఉండకూడదు...
స్వర్గానికి రూట్ మ్యాప్
బదరీనాథ్ నుంచి సుమారు దాదాపు 20కిలోమీటర్ల దూరంలో సాతో పంథ్ సరోవరం ఉంది. అయితే బదరీనాథ్ కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న వసుధారా జలపాతం నుంచి ఈ ట్రెక్ ప్రారంభమవుతుంది. పవిత్రమైన అలకనందా నది ఒడ్డు నుంచి వసుధారా జలపాతం అత్యంత అద్బుతంగా ఉంటుంది. వసుధారా జలపాతం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో లక్ష్మీ వనం ఉంది. అక్కడికి వెళ్లాలంటే 'ధానో' అనే హిమనీనది దాటాల్సి ఉంటుంది. ఈ మార్గం అత్యంత ప్రమాదకరం. దీన్ని దాటిన తరువాత వచ్చేదే 'లక్ష్మీ వనం'. ఇక్కడే నకులుడు, సహదేవుడు ప్రాణాలు విడిచారని చెబుతారు
Also Read: పుక్కిటి పురాణాలు కాదు… ప్రపంచాన్ని నడిపించే దిక్సూచీలు..
అర్జునుడు ప్రాణాలు విడిచింది ఇక్కడే..
లక్ష్మీ వనం నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో చక్రతీర్థం ఉంది. పురాణాల ప్రకారం 'చక్రతీర్థం'లోనే అర్జునుడు తన ప్రాణాలను త్యాగం చేసాడంటారు. చక్రతీర్థం తర్వాత వచ్చే ప్రదేశం 'సహస్ర ధారా'...ఇక్కడే భీముడు ప్రాణం విడిచాడని చెబుతారు. స్వర్గానికి వెళ్ళే స్థలం ఈవిధంగా సహస్ర ధారా అనంతరం ట్రెక్ ఈ విధంగా ముందుకు సాగుతూ ఉంటే చివరిగా చేరుకునే ప్రదేశమే సత్యపంథ్ అనే సరోవరం. దీనిని "సత్యపంథ" అని పిలుస్తారు. ఈ సరోవరాన్ని సత్యానికి ప్రతిబింబంగా చెబుతారు. ఈ త్రికోణాకార సరోవరం ఎంత పవిత్రమైనది అంటే ఏకాదశి సమయంలో స్వయంగా త్రిమూర్తులు స్నానం చేస్తారట. గంధర్వులు పక్షుల రూపంలో ఈ స్థలంలో కాపలాకాస్తుంటారని అంటారు. ఈ ప్లేస్ తోనే ట్రెక్కింగ్ ముగుస్తుంది. స్వర్గారోహణ పర్వంలో ఈ ప్రదేశానికి చేరేసరికి పాండవుల్లో కేవలం ధర్మరాజు, కుక్క మాత్రమే మిగులుతారు. ఇంద్రుడు రథంతో సహా వచ్చి ధర్మరాజుని మాత్రం రథంలో ఆహ్వానిస్తాడు. దారిలో తనతో పాటూ కష్టనష్టాలు ఎదుర్కొంటూ వచ్చిన కుక్కను కూడా అనుమతించాల్సిందే అంటాడు. అప్పుడు కుక్కను కూడా స్వర్గానికి తీసుకెళతాడు ఇంద్రుడు. ఇంతకీ ఆ కుక్క ఎవరంటే ధర్మరాజుని పరీక్షించేందుకు వచ్చిన ధర్మదేవత.
Also Read: ఫెంగ్‌షుయ్ ప్రకారం ఆ రెండు బొమ్మలు ఇంట్లో ఉంటే భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుందట
అయితే స్వర్గం, నరకం ఉన్నాయా..ఎవరైనా చూశారా అని ప్రశ్నించవద్దు. ఎందుకంటే సమాధానం దొరకని అందమైన ప్రశ్న అది. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే స్వర్గం అంటే మంచి పనులు, నరకం అంటే ఇతరులకి హాని కలిగించే పనులని భావించాలి. పైగా చెడుపనులు చేసేవారంతా పర్యవసానంగా నరకం లాంటి కష్టాలు ఎదుర్కొంటారు.. మంచి పనులు చేసేవారు ఆత్మతృప్తితో సంతోషంగా బతుకుతారు. ఇదే స్వర్గం-నరకం...
Also Read: పర స్త్రీ పై మోజుపడుతున్నారా... అయిదే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే....
Also Read: ఆదిశంకరాచార్యులను అమ్మవారు ఎందుకు కబళించాలని అనుకున్నారు? పాచికలాటలో గెలిచిందెవరు?
Also Read: చిన్న పిల్లలపై శని ప్రభావం ఉండదని ఎందుకంటారు...
Also Read: పుష్కరాల సమయంలో తప్పనిసరిగా నదీ స్నానం చేయాలని ఎందుకంటారు...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి