X

Saturn Effect: చిన్న పిల్లలపై శని ప్రభావం ఉండదని ఎందుకంటారు...

ఏలినాటి శని, అష్టమ శని, అర్థాష్టమ శని..ఈ పేర్లు వింటేనే వణికిపోతారు. శని ఏళ్లతరబడి పట్టి పీడిస్తాడని మానసికంగా మరింత కుంగిపోతుంటారు. అయితే చిన్న పిల్లలపై మాత్రం ప్రభావం ఉండదంటారు ఎందుకో తెలుసా.

FOLLOW US: 

జాతకచక్రంలో 12 రాశులుంటాయి. గ్రహాలు ఆయా రాశుల్లో ప్రవేశించిన సమయంలో ఆయా గ్రహాల ప్రభావం ప్రారంభమవుతుంది.12, 1, 2 స్థానాల్లో శని ఉన్నప్పుడు ఏలినాటి శని అంటారు. ఒక్కోస్థానంలో రెండున్నర సంవత్సరాలు చొప్పున మొత్తం ఏడున్నరేళ్లు ఉంటాడు. ఆ సమయంలో ఆరోగ్యం, చదువు, ఉద్యోగం, ఆరోగ్య పరిస్థితి అన్నింటిపైనా ప్రభావం ఉంటుందంటారు. అయితే చిన్న పిల్లలపై మాత్రం శని ప్రభావం ఉండదని చెబుతారు. అదెందుకు అని చెప్పేందుకు ఓ పురాణ కథ ప్రచారంలో ఉంది..
Also Read:  2022 మరింత అరాచకం.. నోస్ట్రడామస్ భవిష్యవాణి, గతంలోనూ చెప్పిందే జరిగింది..
పిప్పలాదుడి వల్లే..
పిప్పలాదుడు కౌశికమహర్షి కుమారుడు. కౌశికుడు తన కుమారుడిని పోషించలేక ఒకరోజు అడవిలో వదిలేసి వెళ్లిపోతాడు. తల్లిదండ్రుల ప్రేమకి దూరమైన ఆ చిన్నారి రావిచెట్టు నీడలో తలదాచుకుంటాడు.  అందుకే పిప్పలాదుడు అనే పేరు వచ్చింది. ఆ పిల్లాడిని చూసి జాలిపడిన నారదుడు  ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ నామమే జీవితానికి వెలుగుచూపిస్తుందని చెప్పి వెళ్లిపోతాడు. ఆ క్షణం నుంచి ఆ మంత్రం జపిస్తూ మహర్షిగా మారిపోతాడు. 
Also Read: కిచెన్లో పూజామందిరం పెట్టేశారా... దేవుడి మందిరం ఎక్కడ ఉండాలి..ఎక్కడ ఉండకూడదు...
అభినందించేందుకు వచ్చిన నారదుడిని... బాల్యంలో తాను పడిన కష్టాలకు కారణం ఏంటని అడుగుతాడు పిప్పలాదుడు. శనిప్రభావం వల్లే నీకీ పరిస్థితి వచ్చిందని చెప్పడంతో తన తపోబలంతో గ్రహమండలం నుంచి శనిని కిందకు లాగేసిన పిప్పలాదుడు బాల్యంలో ఎవ్వరినీ వేధించవద్దని హెచ్చరించాడట.  అంతలో దేవతలంతా అక్కడకు చేరి పిప్పలాదుడికి నచ్చజెప్పడంతో శాంతించి తిరిగి శనిని గ్రహమండలంలో ప్రవేశపెడతాడు ఆ మహర్షి.  అందుకు సంతోషించిన బ్రహ్మ దేవుడు శనివారం రోజున ఎవరైతే ‘పిప్పలాద మహర్షి’ నామాన్ని స్మరిస్తారో, వాళ్లకి శని సంబంధమైన దోషాలు బాధలు ఉండవని వరం ఇస్తాడు.
Also Read: ఔను.. అది రాముడి కట్టిన వారధి ! నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టిందంటే..
పిప్పలాద ప్రోక్త శని స్తోత్రం
కోణస్థః పింగలో బభ్రుః కృష్ణో రౌద్రోంతకో యమః
శౌరః శనైశ్చరో మందః పిప్పలాదేన సంస్తుతః!!
నమస్తే కోణ సంస్థాయ పింగళాయ నమోస్తుతే
నమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోస్తుతే ||
నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయచ
నమస్తే యమ సంజ్ఞాయ నమస్తే సౌరయే విభో ||
నమస్తే మంద సంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే
ప్రసాదం కురు దేవేశ, దీనస్య ప్రణతస్య చ || 
Also Read: పుక్కిటి పురాణాలు కాదు… ప్రపంచాన్ని నడిపించే దిక్సూచీలు..
Also Read: ఫెంగ్‌షుయ్ ప్రకారం ఆ రెండు బొమ్మలు ఇంట్లో ఉంటే భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుందట
Also Read: పర స్త్రీ పై మోజుపడుతున్నారా... అయిదే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే....
Also Read: ఆదిశంకరాచార్యులను అమ్మవారు ఎందుకు కబళించాలని అనుకున్నారు? పాచికలాటలో గెలిచిందెవరు?
Also Read: అద్దం పగిలితే అరిష్టమా.. పగిలిన అద్దాన్ని ఇంట్లో ఎందుకు ఉంచకూడదు.. ఏం జరుగుతుంది..
Also Read: పుష్కరాల సమయంలో తప్పనిసరిగా నదీ స్నానం చేయాలని ఎందుకంటారు...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Children Yelinati Shani Ardhastama Shani Astama Shani

సంబంధిత కథనాలు

Spirituality: పర్యాటకంగానే కాదు ఆధ్యాత్మికతకూ గోవా ప్రత్యేకమే..

Spirituality: పర్యాటకంగానే కాదు ఆధ్యాత్మికతకూ గోవా ప్రత్యేకమే..

Srisailam- Corona: కరోనా ప్రభావం...శ్రీశైలం శ్రీ మల్లికార్జునుడి సన్నిధిలో ఆంక్షలివే..

Srisailam- Corona: కరోనా ప్రభావం...శ్రీశైలం శ్రీ మల్లికార్జునుడి సన్నిధిలో ఆంక్షలివే..

NAKSHATRA / STAR : పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే ఎలాంటి దోషం ఉంటుంది.. ఇక్కడ తెలుసుకోండి.. Part-1

NAKSHATRA / STAR : పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే ఎలాంటి దోషం ఉంటుంది.. ఇక్కడ తెలుసుకోండి.. Part-1

Mukkanuma Festival: ముక్కనుమ పండుగ ఉందా, లేదా.. ఈ రోజు ఏం చేయాలి...

Mukkanuma Festival: ముక్కనుమ పండుగ ఉందా, లేదా.. ఈ రోజు ఏం చేయాలి...

Horoscope Today 17th January 2022: ఈ రాశులవారు ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ అవుతారు, మీ రాశి ఫలితం ఇక్కడ చూసుకోండి..

Horoscope Today 17th January 2022: ఈ రాశులవారు ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ అవుతారు, మీ రాశి ఫలితం ఇక్కడ చూసుకోండి..
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Lokesh Corona : నారా లోకేష్‌కు కరోనా - హోం ఐసోలేషన్‌లో చికిత్స !

Lokesh Corona :   నారా లోకేష్‌కు కరోనా - హోం ఐసోలేషన్‌లో చికిత్స !

AP CM Covid Review : ఏపీలో స్కూళ్లు కొనసాగింపు.. ప్రికాషన్ డోస్ వ్యవధి తగ్గించాలని ప్రధానికి లేఖ రాయాలని సీఎం జగన్ నిర్ణయం !

AP CM Covid Review :  ఏపీలో స్కూళ్లు కొనసాగింపు.. ప్రికాషన్ డోస్ వ్యవధి తగ్గించాలని ప్రధానికి లేఖ రాయాలని సీఎం జగన్ నిర్ణయం !

Masala Rice: నోరు చప్పగా అనిపించినప్పుడు ఇలా మసాలా రైస్ చేసుకుంటే... అదిరిపోతుంది

Masala Rice: నోరు చప్పగా అనిపించినప్పుడు ఇలా మసాలా రైస్ చేసుకుంటే... అదిరిపోతుంది

Ram Vs Havish: 'వారియర్' టైటిల్ కోసం ఇద్దరు హీరోల ఫైట్.. నెగ్గేదెవరో..?

Ram Vs Havish: 'వారియర్' టైటిల్ కోసం ఇద్దరు హీరోల ఫైట్.. నెగ్గేదెవరో..?