By: ABP Desam | Updated at : 15 Dec 2021 11:15 AM (IST)
Edited By: RamaLakshmibai
2022 వార్షిక రాశి ఫలితాలు
రెండేళ్లుగా కరోనా చెడుగుడు ఆడేస్తోంది. ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త సర్దుమణుగుతోంది. గడిచిన బ్యాడ్ డేస్ ని వదిలేసి సరికొత్తగా కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారంతా. కొత్త ఆశలు, ఎన్నో కోర్కెలు, మరెన్నో అంచనాలతో 2022 కి వెల్ కమ్ చెప్పనున్నారు. మరి జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 2022 కొత్త ఏడాదిలో సింహం, కన్య, తుల, వృశ్చక రాశిఫలితాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.
సింహం
ఈ రాశి వారికి 2022 సంవత్సరం చాలా ముఖ్యమైనది. ఏడాది ఆరంభంలో మీ జీవితంలో సానుకూల మార్పులు ఉండొచ్చు. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి, ఆదాయం పెరుగుతుంది. ఏడాది మధ్యలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కెర కెరీర్ పరంగా 2022 మీకు అదుర్స్ అనేలా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితాలు పొందడమే కాదు..ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న పాత సమస్య కొత్త ఏడాదిలో ఓ కొలిక్కి వస్తుంది. ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రమోషన్, ఇంక్రిమెంట్ లభిస్తుంది. వ్యాపారులకు మొదటి మూడు నెలలు మినహా మిగిలిన తొమ్మిది నెలలు అనూకూలంగా ఉంటుంది.
కన్య
కన్య రాశివారికి కొత్త ఏడాది బాగా కలిసొస్తుంది. ఏడాది మొదలైన వెంటనే ఏదో రిలీఫ్ గా ఉంటుంది. ఆర్థికం పరిస్తితి బావుంటుంది. హార్ట్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేస్తారు. ఈ ఏడాది అన్నిరంగాల వారూ విజయం సాధిస్తారు. తలపెట్టిన పనిలో ఏదైనా అడ్డంకి వచ్చినా అవలీలగా అధిగమించగలరు. ధైర్యంగా దూసుకెళతారు. మీ వ్యక్తిగత జీవితంలో కాస్త హెచ్చుతగ్గులు ఉండొచ్చు. కెరీర్ పరంగా చూస్తే ఏడాది మొత్తం అన్నీ అనుకూలఫలితాలే గోచరిస్తున్నాయి. పెద్ద పెద్ద అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఉద్యోగంలో మార్పులు, బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు ఊహించని లాభాలందుకుంటారు.
Also Read: స్వర్గానికి షార్ట్ కట్! రూట్ మ్యాప్ క్లియర్‌గా ఉందిగా!
తుల
ఈ రాశి వారికి 2022 కొత్తకొత్తగా ఉంటుంది. మీ ఆదాయం పెరిగే సంకేతాలున్నాయి. వ్యాపారులకు సవాల్ గా ఉంటుంది. విద్యార్థులు మరింత కష్టపడాల్సిందే. మీరు చాలా సులువుగా పూర్తిచేసే పనుల్లో ఆటంకాలు ఎదురవొచ్చు. ఈ రాశి అవివాహితులకు నవంబర్ తర్వాత పెళ్లి జరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు పదోన్నతి పొందొచ్చు. మార్చి తర్వాత కార్యాలయంలో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. కెరీర్ పరంగా చూస్తే గతేడాది కన్నా ఈ ఏడాది మెరుగ్గానే ఉండనుంది. వాహన పరిశ్రమ, సినిమా రంగాలకు సంబంధించిన వారికి మంచి సమయం.
వృశ్చికం
ఈ రాశి వారికి 2022 మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఏడాది మొదట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ద్వితీయార్థం వచ్చేసరికి ఉపశమనం పొందుతారు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించండి. సోమరితనాన్ని విడిచిపెట్టి పూర్తి ఉత్సాహంతో ముందుకు అడుగేయండి. మీ శృంగార జీవితంలో కొన్ని హెచ్చు తగ్గులు చూడొచ్చు. చిన్న చిన్న విషయాలకే మీ భాగస్వామితో గొడవలకు దూరంగా ఉండాలి. కెరీర్ పరంగా ఈ రాశికి మిశ్రమ ఫలితాలున్నాయి. కొత్త ఉద్యోగం కానీ చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. మీ లక్ష్యాలను సాధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది.
Also Read: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... అన్నమయ్య కాలిబాటకు టీటీడీ గ్రీన్ సిగ్నల్... తిరుమలకు 40 కి.మీ తగ్గనున్న దూరం
Also Read: గుడికి వెళుతున్నారా...ఇలా మాత్రం చేయకండి..
Also Read: పూజ కోసం ఈ పూలు చెట్టునుంచి కోయకూడదు, ఎవ్వరి దగ్గరా తీసుకోకూడదు..ఎందుకో తెలుసా..
Also Read: చిన్న పిల్లలపై శని ప్రభావం ఉండదని ఎందుకంటారు...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Vastu Tips:ఫెంగ్ షుయ్ ప్రకారం ఈ వస్తువులు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి తిష్టవేసుకుని కూర్చుంటుదట
Vastu Sastra: మీ ఇంట్లో నీరు ప్రవహించే దిశే (వాలు) మీ ఆర్థిక పరిస్థితిని నిర్ణయిస్తుంది
Horoscope 8th July 2022: ఈ రాశివారు అస్సలు రిస్క్ చేయొద్దు, ఈ రెండు రాశులవారిపై లక్ష్మీదేవి కరుణ, జులై 8 రాశి ఫలాలు
Gorintaku: గోరింట ఆషాడమాసంలోనే ఎందుకంత ప్రత్యేకం, దీని పుట్టుక వెనుక ఇంత కథ ఉందా!
Panchang 8th July 2022: జులై 8 శుక్రవారం తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శుక్రవారం పఠించాల్సిన మహాలక్ష్మి అష్టకం
YSRCP Plenary 2022 : ప్లీనరీ సక్సెస్ చూసి చంద్రబాబు మళ్లీ బోరు బోరున ఏడుస్తారు - ఎంపీ విజయసాయి రెడ్డి
IND-W vs SL-W, 3rd ODI: హర్మన్ ప్రీత్ డిస్ట్రక్షన్! లంకను కుప్పకూల్చిన రాజేశ్వరీ, మేఘనా
Multibagger stock: ఏడాదిలో లక్షకు రూ.13 లక్షల ప్రాఫిట్! 800% ర్యాలీ చేసిన మల్టీబ్యాగర్
Auto Insurance new Rules: వాహన బీమా రూల్స్ ఛేంజ్! ఎన్ని కి.మీ. తిప్పితే అంతే ప్రీమియం!