By: ABP Desam | Updated at : 11 Dec 2021 12:32 PM (IST)
Edited By: RamaLakshmibai
పారిజాత పూలు
దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు ఉద్భవించిన పారిజాత వృక్షాన్ని విష్ణుమూర్తి స్వర్గానికి తీసుకెళ్లారు. ఈ పూల పరిమళం స్వర్గలోకం మొత్త విరజిమ్మేదట. ద్వాపర యుగంలో సత్యభామ కోరిక మేరకు ఈ వృక్షాన్ని కృష్ణుడు భూలోకానికి తీసుకొచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. స్వర్గం నుంచి తీసుకురావడం వల్ల పారిజాత వృక్షాన్ని దేవతా వృక్షం అంటారు. అయితే పారిజాత పూలు అనగానే ఎర్రటి కాడ..తెల్లటి పూలు అని అందరికీ తెలుసు. అయితే ఈ పూలు ఎరుపు, తెలుపు, పసుపు, నీలి రంగు, గులాబీ రంగు సహా మొత్తం తొమ్మిది రంగుల్లో ఉంటాయి. ఇందులో ఎరుపు రంగు పారిజాతంతో విష్ణుమూర్తిని పూజచేయకూడదని చెబుతారు.
Also Read: ఈ సింబల్ మీ ఇంటి ఎంట్రన్స్ లో ఉంటే దృష్టి దోషాలు తగలవు, దుష్ట శక్తులు పారిపోతాయట...
చెట్టునుంచి కోయకూడదు.. ఎవ్వరి దగ్గరా తీసుకోకూడదు
సాధారణంగా దేవుడికి పూజ చేసే పూలు నేలరాలినవి తీసుకోం. చెట్టునుంచి కోసుకున్నపూలనే తీసుకొచ్చి భగవంతుడికి నివేదిస్తాం. కానీ పారిజాత పూలు మాత్రం ఎప్పుడూ చెట్టునుంచి కోయరాదట. నేల రాలిన పూలనే పూజకు వినియోగించాలని చెబుతారు. మిగిలిన పూలకు, పారిజాత పూలకు వ్యత్యాసం ఏంటంటే... మిగిలిన పూలన్నీ భూమ్మీద పుట్టినవే. కానీ పారిజాత చెట్టు మాత్రం స్వర్గం నుంచి తీసుకొచ్చాడు శ్రీకృష్ణుడు. అందుకే ఈ దేవతా వృక్షం నుంచి పూలు కిందకు పడినప్పుడే అవి భూమికి సొంతమవుతాయట. అప్పుడు వాటిని తీసుకోవాలి కానీ చెట్టునుంచి కోసుకోరాదు. అందుకే పారిజాత వృక్షం కింద ఎప్పుడూ ఆవుపేడతో కళ్లాపి చల్లి ఉంచాలని..అప్పుడు నేల రాలిన పూలను తీసుకోవాలంటారు. మరో ముఖ్య విషయం ఏంటంటే వీటిని ఎవరి వద్ద నుంచీ తీసుకోకూడదంటారు..ఎందుకంటే.. పూలు ఇచ్చిన వారికే మీ పూజాఫలం వెళ్లిపోతుందట.
Also Read: ఆర్థిక సమస్యలు తీరి ఐశ్వర్యాన్నిచ్చే వ్రతం ఇది..
పారిజాతం వృక్షం ఉన్న ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అంటారు. ఈ పూల వాసన ఆరోగ్యం, ఆహ్లాదాన్నిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతారు.
Also Read: నెలకు రెండుసార్లు మంటతో స్నానం చేసే అమ్మవారు..
Also Read: కర్మ అంటే ఏంటి.. పదే పదే ఈ మాట అనొచ్చా.. పురాణాలు ఏం చెబుతున్నాయి...
Also Read: భారతదేశం అనే పేరుకి కారణం ఒకరు, గోదావరి నదిని భూమిపైకి తీసుకొచ్చింది మరొకరు.. ఈ ఏడుగురి కథే వేరు..
Also Read: శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన రోజు ఇదే... ఈ నెలంతా ప్రత్యేకమే
Also Read: స్వర్గానికి షార్ట్ కట్! రూట్ మ్యాప్ క్లియర్‌గా ఉందిగా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Chitrakoot Temple: చారిత్రక ఆలయంలో విగ్రహాల చోరీ - పీడకలలు రావడంతో దొంగల ముఠా ఏం చేసిందంటే !
Hanuman Special: 'లూసిఫర్' కి పంచముఖ ఆంజనేయుడికి లింకేంటి
Astrology: జూలైలో పుట్టినవారు కష్టాలు పడతారు కానీ మీరు ఓ అద్భుతం అని మీకు తెలుసా!
Today Panchang 17th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, ఆంజనేయ అష్టోత్తరం
Horoscope Today 17th May 2022: ఈ రాశివారికి గ్రహాల అనుగ్రహం పుష్కలంగా ఉంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
YSRCP Rajyasabha Equation : వైఎస్ఆర్సీపీలో అర్హులు లేరా ? రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?
Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?
Vaaradhi App: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా, అయితే మీకు గుడ్న్యూస్
Bhavani Island: పర్యాటక అద్బుతం విజయవాడ భవానీ ఐల్యాండ్, నది మధ్యలో ప్రకృతి అందాలు