Vaikuntha Ekadashi: శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన రోజు ఇదే... ఈ నెలంతా ప్రత్యేకమే
మార్గశిరమాసాన్ని ఎందుకు విలక్షణమైన నెల అంటారు, ఈ మాసం ప్రత్యేకత ఏంటి తెలుసుకుందా..
![Vaikuntha Ekadashi: శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన రోజు ఇదే... ఈ నెలంతా ప్రత్యేకమే Vaikuntha Ekadashi: This Is The Day When Lord Krishna Said The Bhagavad Gita To Arjuna, Know In Details Vaikuntha Ekadashi: శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన రోజు ఇదే... ఈ నెలంతా ప్రత్యేకమే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/03/37dcfaf0726ddb85f6fed86e4b704e5e_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
హిందూ సంప్రదాయాల ప్రకారం.. తెలుగు నెలల్లోని ప్రతి నెలకూ ఓ ప్రత్యేకత ఉంది. మార్గశిర మాసం ప్రత్యేకత ఏంటంటే..ఈ నెలను మార్గ శీర్షం అని కూడా పిలుస్తారు. శీర్షం అంటే అగ్రభాగం..మాసాలన్నింటిలో అగ్రగణ్యమైనది అని అర్థం. ఈ నెల 5 వ తేదీ ఆదివారం నుంచి మార్గశిరమాసం ప్రారంభమవుతుంది. ఈనెల లక్ష్మీదేవికి, మహావిష్ణువుకు, సూర్యుడికి ఎంతో ప్రీతికరమైనది. మరో విశిష్టత ఏంటంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి 'భగవద్గీత' బోధించినది ఈ నెలలోనే . సూర్యుడు 12 రాశుల్లో ఒకదాని నుండి మరోదాని లోనికి నెలకు ఒకసారి మారుతుంటాడు. అలా వృశ్చిక రాశి నుండి ధనురాశిలోనికి సూర్యుడు రావడం తో ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసం లో పసుపు, ఆవాలు, మెంతులు , మిరియాలు, చింతపండు పెరుగు మొదలైనవి క్షార గుణాన్ని హరించి ఆరోగ్యాన్ని కాపాడతాయి కాబట్టి, మనం తీసుకొనే ఆహార పదార్దాల లో వీటిని విరివిగా ఉపయోగిస్తారు.
Also Read: ఈ రాశులవారు కోపం తగ్గించుకోవాల్సిందే .. అందులో మీరున్నారా.. ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి
ఈనెలలో ముఖ్యమైన రోజులు
- మార్గశిర శుద్ద పంచమి పంచమి రోజు నాగ పూజ చేయడం విశేష ఫలితాన్నిస్తుంది. శుభకార్యాలు ప్రారంభించడానికి అనుకూలమైన రోజుగా చెబుతారు.
- మార్గశిర శుద్ద షష్ఠి ని స్కంద షష్ఠి అంటారు. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే సంతానానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని విశ్వాసం
- మార్గశిర శుద్ద సప్తమిని భానుసప్తమి, జయసప్తమి, మిత్ర సప్తమి అని అంటారు. ఈ రోజు సూర్యారాధన చేస్తే అన్నీ శుభఫలితాలే అంటారు.
- మార్గశిర అష్టమిని కాళభైరవాష్టమిగా పిలుస్తారు, శివుని మరో రూపమే భైరవుడు. భైరవుని దగ్గర కాలుడు (కాలం) కూడా అణిగి ఉంటాడు కనుకే కాళభైరవుడయ్యాడు. భైరవుణ్ణి శరణు కోరితే మృత్యు భయం తొలగిపోతుందంటారు. ఈరోజు గంగా స్నానం, పితృ తర్పణం, శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే మంచిదని చెబుతారు.
- మార్గశిర ఏకాదశి ని మోక్షద ఏకాదశి అంటారు. ఈరోజు శ్రీ మహా విష్ణువు కి అత్యంత ప్రీతికరమైన రోజుగా చెబుతారు. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుని ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
- వైకుంఠ ఏకాదశి రోజే గీతా జయంతి జరుపుకుంటారు. విశ్వమానవ విజ్ణాన కోశంగా భావించే భగవద్గీతను ఈ పర్వదినం రోజు అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించాడని చెబుతారు.
"గీకారం త్యాగరూపం స్యాత్
తకారమ్ తత్వబోధకమ్
గీతా వాక్య మిదమ్ తత్వం
జ్ఞేయమ్ సర్వ ముముక్షుభి:"
గీత అనే రెండక్షరములు సర్వసంగపరిత్యాగానికి, ఆత్మసాక్షాత్కారానికి ప్రతీకలు. ఈ పరమ రహస్యాన్నే గీతాశాస్త్రం ఉపదేశిస్తుంది. అలాంటి పరమపావనమైన గీతన భగవానుని నోట వెలువడిన మహాపుణ్యదినము మార్గశిర శుద్ధ ఏకాదశి. ఈ రోజు ఆ పవిత్ర గ్రంథాన్ని సృజించినా మహాపుణ్యం వస్తుందని హిందువుల నమ్మకం. - మార్గశిర ద్వాదశిని అఖండ ద్వాదశి అంటారు.
- మార్గశిర శుద్ద త్రయోదశి రోజు హనుమత్భక్తులు ఆంజనేయుడి వ్రతం ఆచరిస్తారు.
- మార్గశిర శుద్ద పౌర్ణమి రోజు దత్తాత్రేయ జయంతి. దత్తాత్రేయుడంటే సాక్ష్యాత్తు త్రిమూర్తి స్వరూపం.
- కార్తిక పౌర్ణమి నుంచి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మ రాజు కోరలు చాచి ఉంటాడట. అందకే మార్గశిర పౌర్ణమి రోజు యమధర్మ రాజుకి నమస్కరిస్తే సంపూర్ణ ఆయుష్షు లభిస్తుందంటారు.
- ఈ నెలలోనే ధనుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా గురువారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల కుటంబలో ఆనందం వెల్లివిరుస్తుందని, ఆయురారోగ్యాలతో వర్థిల్లుతారని విశ్వాసం.
Also Read: చిన్న పిల్లలపై శని ప్రభావం ఉండదని ఎందుకంటారు...
Also Read: స్వర్గానికి షార్ట్ కట్! రూట్ మ్యాప్ క్లియర్‌గా ఉందిగా!
Also Read: మీ ఇంటి ఆవరణలో ఈ మొక్కలు ఉన్నాయా… అయితే దురదృష్టాన్ని తెచ్చిపెట్టుకున్నట్టే..
Also Read: కిచెన్లో పూజామందిరం పెట్టేశారా... దేవుడి మందిరం ఎక్కడ ఉండాలి..ఎక్కడ ఉండకూడదు...
Also Read: ఔను.. అది రాముడి కట్టిన వారధి ! నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టిందంటే..
Also Read: పర స్త్రీ పై మోజుపడుతున్నారా... అయిదే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే....
Also Read: ఆదిశంకరాచార్యులను అమ్మవారు ఎందుకు కబళించాలని అనుకున్నారు? పాచికలాటలో గెలిచిందెవరు?
Also Read: అద్దం పగిలితే అరిష్టమా.. పగిలిన అద్దాన్ని ఇంట్లో ఎందుకు ఉంచకూడదు.. ఏం జరుగుతుంది..
Also Read: ఈ ఏడుగురు ఇప్పటికీ బతికే ఉన్నారట.. వాళ్లెవరు.. అదెలా సాధ్యమైంది
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)