Spirituality: మీ ఇంటి ఆవరణలో ఈ మొక్కలు ఉన్నాయా… అయితే దురదృష్టాన్ని తెచ్చిపెట్టుకున్నట్టే..
ఇంటి చుట్టూ కుండీల్లోనో, మిద్దెపైనో మొక్కలు పెంచుతుంటారు. అందం కోసం అంటూ రకరకాల మొక్కల్ని పెంచుతారు. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం ఈ మొక్కలు మాత్రం ఇంటి ఆవరణలో ఉంచొద్దంటున్నారు నిపుణులు...
మొక్కలు, పచ్చదనం అంటే ఇష్టం ఉండనివారుండరేమో. గాలిని శుద్ధిచేస్తాయి, మనసుని ఉత్సాహపరుస్తాయి, పర్యావరణాన్ని పరిరక్షిస్తాయి..అందుకే మొక్కలు పెంచేందుకు ఖాళీ స్థలం దొరక్కపోయినా ఇంటిచుట్టూ కుండీలు పెట్టుకుని ఆ ముచ్చట తీర్చుకుంటున్నారు. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని రకాల మొక్కలు ఇంటి ఆవరణలో ఉండకూడదని చెబుతున్నారు వాస్తు నిపుణులు. వాటివల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని ఆహ్వానించడమే కాదు... ఏపని తలపెట్టినా మధ్యలోనే ఆగిపోతుందట. అందుకే మీరు ఇష్టంగా పెంచుకునే మొక్కలైనప్పటికీ కొన్నింటిని ఇంటి ఆవరణలో ఉంచకపోవడమే మంచిదంటున్నారు. ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంట్లో అస్సలు పెంచకూడని మొక్కలేంటో చూద్దాం...
Also Read: స్వర్గానికి షార్ట్ కట్! రూట్ మ్యాప్ క్లియర్‌గా ఉందిగా!
కాక్టస్ మొక్కలు
కాక్టస్ మొక్కలుగా పిలిచే ఎడారి మొక్కలు ముళ్ళతో ఉంటాయి. ఇవి నాగజెముడు, బ్రహ్మజెముడు జాతికి చెందినవి. సహజంగా గుచ్చుకుంటూ ఉంటాయి. అందుకే ఇవి ఇళ్ల దగ్గర ఉండకూడదు అంటారు. ముళ్లుండే మొక్కలు ఇంట్లో ఉంటే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని ఆహ్వానించినట్టే అంటారు. అందుకే ఇంటిబయట తోటలో పెట్టొచ్చు కానీ ఇంట్లో కుండీల్లో పెట్టరాదని చెబుతారు. వాస్తవానికి ముళ్లుండే గులాబీ మొక్క కూడా ఈకోవకు చెందినదే అంటారు వాస్తు నిపుణులు. అందుకే గులాబీ మొక్క కూడా ఇంటి బయటే ఉండాలట.
బోన్సాయ్ మొక్కలు
బోన్సాయ్ మొక్కలు భలే అందంగా ఉంటాయి. అందుకే ఇంట్లో పెంచుకునేందుకు చాలా ఆసక్తి చూపిస్తారు. కానీ వాటిని కూడా ఇంట్లో పెంచుకోవడం అస్సలు మంచికాదంటారు. ఇవి కూడా గార్డెన్ కి మాత్రమే పరిమితం చేయాలట. నిత్యం ఇంట్లో ఇవి కనిపిస్తే తలపెట్టిన పనులన్నీ మధ్యలోనే ఆగిపోతాయట.
చింత చెట్లు
చింత ఇంట్లో పెంచలేరు కానీ చివరకు ఇంటి ఆవరణలో కూడా ఉండాదట. ఇంటి ఆవరణకు కాస్త దూరంగా ఉండొచ్చంటారు వాస్తు నిపుణులు. చింత చెట్టు ఇంటి ఆవరణలో, గార్డెన్లో ఉంటే దరిద్రం వెంటాడుతుందట.
Also Read: ఈ రోజు ఈ రాశులవారికి చాలా ప్రత్యేకమైన రోజు, మీరు అందులో ఉన్నారా మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
ఈ మొక్కలు అస్సలు ఉంచొద్దు
ఇంట్లో కుండీల్లోనో, గార్డెన్లోనో ఉన్న చాలా మొక్కల్లో కొన్ని ఎండిపోయి ఉంటాయి. పోతోపోనీలే అని వాటిని వదిలేస్తుంటారు కొందరు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎండిన మొక్కలు, చనిపోయిన మొక్కలు ఉంచరాదని చెబుతారు. వాటిని అలాగే ఉంచితే దురదృష్టం పట్టిపీడుస్తుందట.
పత్తి చెట్లు
పూజకు అవసరం అనే ఉద్దేశంతో కొందరు పత్తి మొక్కలు పెంచుతారు. కానీ ఈ మొక్కలు తోటల్లో ఉండాలి కానీ ఇంటి ఆవరణలో కాదంటారు. ఇవి నెగెటివ్ ఎనర్జీని ఇంట్లోకి ఆహ్వానిస్తాయట.
ఈశాన్యంలో చెట్లు వద్దు
చాలా మంది ఇళ్లలో ఈశాన్య దిశలో పెద్దపెద్ద చెట్లు ఉంటాయి. ఈశాన్యం వైపు పెద్ద పెద్ద చెట్లు ఉండటం అస్సలు మంచిది కాదట. దానివల్ల సంపద హరిస్తుందని అంటారు. అందుకే మీ ఇంటికి ఈశాన్యం వైపు చెట్లు పెంచొద్దని సూచిస్తున్నారు వాస్తు నిపుణులు.
Also Read: ఫెంగ్‌షుయ్ ప్రకారం ఆ రెండు బొమ్మలు ఇంట్లో ఉంటే భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుందట
Also Read: చిన్న పిల్లలపై శని ప్రభావం ఉండదని ఎందుకంటారు...
Also Read: కిచెన్లో పూజామందిరం పెట్టేశారా... దేవుడి మందిరం ఎక్కడ ఉండాలి..ఎక్కడ ఉండకూడదు...
Also Read: ఔను.. అది రాముడి కట్టిన వారధి ! నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టిందంటే..
Also Read: పర స్త్రీ పై మోజుపడుతున్నారా... అయిదే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే....
Also Read: ఆదిశంకరాచార్యులను అమ్మవారు ఎందుకు కబళించాలని అనుకున్నారు? పాచికలాటలో గెలిచిందెవరు?
Also Read: అద్దం పగిలితే అరిష్టమా.. పగిలిన అద్దాన్ని ఇంట్లో ఎందుకు ఉంచకూడదు.. ఏం జరుగుతుంది..
Also Read: పుష్కరాల సమయంలో తప్పనిసరిగా నదీ స్నానం చేయాలని ఎందుకంటారు...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి