Horoscope Today: ఈ రాశులవారు కోపం తగ్గించుకోవాల్సిందే .. అందులో మీరున్నారా.. ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
మేషం
తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. స్నేహితులతో సంతోషంగా సమయం స్పెండ్ చేస్తారు. శుభకార్యంలో పాల్గొంటారు. దూర ప్రాంత ప్రయాణాలకు ప్లాన్ చేసుకోవచ్చు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
వృషభం
అప్పిచ్చిన మొత్తం తిరిగి చేతికందుతుంది. కుటుంబ సభ్యులతో కలసి శుభకార్యాల్లో పాల్గొంటారు. నూతన పనులకు శ్రీకారం చుడతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. కొత్త వాహనం కొనే అవకాశం ఉంది. వ్యాపారస్తులు, ఉద్యోగులకు కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకుసాగుతారు.
మిథునం
కోపం తగ్గించుకోండి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తప్పవు. వ్యాపారస్తులకు సాధారణ ఫలితాలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొంత నిరుత్సాహం ఉంటుంది. గతంలో పడిన కష్టానికి తగిన ప్రతిఫలం అందే అవకాశం ఉంది.
Also Read: స్వర్గానికి షార్ట్ కట్! రూట్ మ్యాప్ క్లియర్‌గా ఉందిగా!
కర్కాటకం
ముఖ్యమైన పనులు వాయిదా వేయొద్దు. వృత్తి వ్యాపారాల్లో ఎంత శ్రమించినా ఫలితం ఉండకపోవచ్చు. ఆస్తి వివాదాలు పెరుగుతాయి. ఉద్యోగులు, వ్యాపారులు, నిరుద్యోగులకు అంత ఆశాజనకంగా లేదు. తలపెట్టిన పనుల్లో జీవిత భాగస్వామి సహకారం ఉంటుంది.
సింహం
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి కొత్త సమాచారం అందుకుంటారు. యువత కెరీర్ సంబంధిత సమాచారం అందుకుంటారు. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి రావొచ్చు. దైవ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
కన్య
ఉద్యోగస్తులకు కార్యాలయం వాతావరణం అంత అనుకూలంగా ఉండదు. వివాదాలకు దూరంగా ఉండండి. చిన్ననానటి మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది.
Also Read: మీ ఇంటి ఆవరణలో ఈ మొక్కలు ఉన్నాయా… అయితే దురదృష్టాన్ని తెచ్చిపెట్టుకున్నట్టే..
తుల
సోమరితనం వీడండి. కోపం తగ్గించుకుంటే మంచి ఫలితాలు అందుకుంటారు. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. ధనానికి సంబంధించి కొంత ఇబ్బంది ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. దూరప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వ్యాపారులు, ఉద్యోగులకు సమయం అంత అనుకూలంగా లేదు.
వృశ్చికం
మీ ప్రాముఖ్యత అందరికీ అర్థమవుతుంది. ఓ శుభవార్త వింటారు. ఆదాయం పెరుగుతుంది. పని ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ ఉండొచ్చు. రోజంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దూరప్రయాణాల్లో వాహన ప్రమాదాలు అయ్యే సూచనలున్నాయి జాగ్రత్త.వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు స్థానచలనాలు తప్పవు.
ధనస్సు
నచ్చని ఉద్యోగాన్ని వీడేందుకు ఇదే మంచి సమయం. స్నేహితులతో కలసి విందు, వినోదాల్లో పాల్గొంటారు .నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పిల్లల విషయానికి సంబంధించి శుభవార్త వింటారు. వ్యాపారస్తులు, ఉద్యోగులకు అనుకూల సమయం.
Also Read: చిన్న పిల్లలపై శని ప్రభావం ఉండదని ఎందుకంటారు...
మకరం
బంధువులతో చర్చలు జరుపుతారు. ఓ శుభవార్త వినే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. పని ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ ఉండొచ్చు. రోజంతా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ప్రయాణాల్లో ఆకస్మిక మార్పులు చోటుచేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది.
కుంభం
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. తలపెట్టిన పనులన్నీ పూర్తిచేస్తారు. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఈ రోజు పిల్లలతో సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించండి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వ్యాపారస్తులు ఆశించిన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు.
మీనం
మీ మాటతీరుతో అందర్నీ ఆకట్టుకుంటారు. దూర ప్రయాణాలు ప్లాన్ చేసుకోపోవడమే మంచిది. విద్యార్థులు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు రావొచ్చు. వృత్తి వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పరుస్తాయి.
Also Read: ఫెంగ్‌షుయ్ ప్రకారం ఆ రెండు బొమ్మలు ఇంట్లో ఉంటే భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుందట
Also Read: కిచెన్లో పూజామందిరం పెట్టేశారా... దేవుడి మందిరం ఎక్కడ ఉండాలి..ఎక్కడ ఉండకూడదు...
Also Read: ఔను.. అది రాముడి కట్టిన వారధి ! నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టిందంటే..
Also Read: పర స్త్రీ పై మోజుపడుతున్నారా... అయిదే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే....
Also Read: ఆదిశంకరాచార్యులను అమ్మవారు ఎందుకు కబళించాలని అనుకున్నారు? పాచికలాటలో గెలిచిందెవరు?
Also Read: అద్దం పగిలితే అరిష్టమా.. పగిలిన అద్దాన్ని ఇంట్లో ఎందుకు ఉంచకూడదు.. ఏం జరుగుతుంది..
Also Read: పుష్కరాల సమయంలో తప్పనిసరిగా నదీ స్నానం చేయాలని ఎందుకంటారు...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి