By: ABP Desam | Updated at : 08 Dec 2021 08:08 AM (IST)
Edited By: RamaLakshmibai
కర్మ సిద్ధాంతం
సత్కర్మభిశ్చ సత్ఫలితం
దుష్కర్మ ఏవ దుష్ఫలం
మంచి పనులు మంచి ఫలితాన్నిస్తాయి..చెడు పనులు చెడ్డ ఫలితాన్నే ఇస్తాయి. ఈ చోటి కర్మ ఈ చోటే...ఈ నాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే... ఇవి ఓ పాటలోని లిరిక్స్. కానీ జీవితం మొత్తాన్ని కాచి వడపోసినట్టుంటాయి. హిందూ మతం ప్రకారం మనిషి ఆధీనంలో కర్మ, భగవంతుని ఆధీనంలో కర్మ ఫలం ఉంటాయి. ప్రతి మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేవరకు కర్మలు చేస్తూనే ఉంటాం! చేసే ప్రతి కర్మకు ఫలితం ఉంటుంది. మనిషి చేసిన కర్మలకి అనుభవించే ఫలితాన్ని కర్మఫలం అంటారు.
Also Read: ప్రపంచానికి చదువు చెప్పిన భారతదేశం.. ఈ యూనివర్శిటీలో ఫీజులు కట్టక్కర్లేదు, పరీక్షలు ఉండవు..
కర్మలు 3 రకాలు....
1.ఆగామి కర్మలు
2.సంచిత కర్మలు
3.ప్రారబ్ద కర్మలు
ఆగామి కర్మలు
ప్రస్తుతం మనం చేస్తున్న ప్రతి కర్మ ఆగామి కర్మల క్రిందకే వస్తాయి. వాటిలో కొన్ని వెంటనే ఫలితాన్నిస్తాయి. మరికొన్ని తరువాత కాలంలో, కొన్ని మరు జన్మల్లో ఫలితాన్నిస్తాయి. అసలు కొన్ని ఏ ఫలితాలను కూడా ఇవ్వకపోవచ్చు. కొన్ని మాత్రం వెంటనే ఫలితాన్నివ్వకుండా తర్వాత ఎప్పుడో ఫలితాన్నివ్వటం కోసం కూడబెట్టుకుని ఉంటాయి. అంటే మనం భోజనం చేస్తాం.. ఆ కర్మ ద్వారా వెంటనే ఆకలి తీరుతుంది. దానధర్మాలు చేస్తాం, పుణ్యకార్యాలు చేస్తాం..వాటి ఫలితం కొన్నాళ్ళకు తెలుస్తుంది. ఇలా కొన్ని కర్మలు అప్పటి కప్పుడే ఫలితన్నివ్వలేక, తర్వాత ఎప్పుడో ఫలితాన్నివ్వటానికి కూడబెట్టి ఉంటాయి. ఇలా ఈ జన్మలో చేసే కర్మలన్నీ ‘అగామికర్మలే’.
Also Read: చేయి నాకి నాకి తింటున్నారా.. మీకు ఆ వ్యామోహం చాలా ఎక్కువట..
సంచిత కర్మలు
సంచిత కర్మలంటే పితృదేవతల ద్వారా ప్రాప్తించిన కర్మలు. తల్లి దండ్రులు చేసిన అప్పులు కొడుకు తీర్చడం లాంటిది. పూర్వ జన్మల్లో చేసిన ఆగామి కర్మల ఫలాలను వివిధ కారణాల వల్ల అనుభవించలేకపోతే అవి సంచితమవుతాయి. అంటే వాటిని ఒక జన్మ నుంచి మరొక జన్మకి, అక్కడి నుంచి వేరొక జన్మకు బదిలీ అవుతాయన్నమాట. అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టిన జీవుడు మరో శరీరాన్ని వెతుక్కున్నా కర్మ ఫలాన్ని మాత్రం మూటగట్టుకుని తీసుకెళ్తాడట. ఇవే సంచిత కర్మలు.
Also Read: పిల్లి మాత్రమే కాదు.. ఇవి ఎదురైనా తలచిన పనులు జరగవట..
ప్రారబ్ధ కర్మలు
ప్రారబ్ద కర్మలు అంటే పూర్వ జన్మలో మనం చేసుకున్న పాప పుణ్యాల వల్ల కలిగే కర్మలు. సంచితంలో కూడబెట్టిన కర్మలు పక్వానికి వచ్చినప్పుడు అవిచ్చే ఫలితమే ప్రారబ్ధ కర్మలు. ప్రారబ్ద కర్మఫలాన్ని అనుభవించటం పూర్తయ్యేవరకు ఆ శరీరం ఉంటుంది. ఈ కర్మలన్నీ వదిలించుకుని పరిపూర్ణులమైతే మరో జన్మే లేదంటారు.
అతి ముఖ్యమైన విషయం ఏంటంటే...ఎవరెవరు ఏ కర్మలు అనుభవించాలో, అందుకు అనువైన తల్లి గర్భాన్ని వారే ఎంచుకుంటారట. కూతురు, కొడుకు అనే బంధాలు లేవు..పూర్వ జన్మ కర్మఫలమే ఇదంతా అంటారు. కొంతమంది మానసిక వికలాంగులు చాలా ఆరోగ్యవంతమైన ,జన్యుపర సంబంధం లేని భార్యాభర్తలకు పుట్టడం చూస్తుంటాం. అలా పుట్టడాన్నే ప్రారబ్ద కర్మలు అంటారని చెబుతారు. అలాంటి పిల్లల నుంచి కూడా తల్లిదండ్రులు ప్రారబ్ద కర్మలు అనుభవించాల్సిందే.
Also Read: భారతదేశం అనే పేరుకి కారణం ఒకరు, గోదావరి నదిని భూమిపైకి తీసుకొచ్చింది మరొకరు.. ఈ ఏడుగురి కథే వేరు..
కర్మల నుంచి విమోచనం ఎలా..
కర్మఫలంపై భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడంటే...
కర్మణ్యేవాధి కరస్తే మాఫలేషు కదాచన |
మకర్మఫలహేతుర్భు, మాతే సంగోస్త్వకర్మణి ||
కర్మలను ఆచరించుట యందె నీకు అధికారము కలదు కానీ, వాటి ఫలితముపైన లేదు. నీవు కర్మఫలమునకు కారణమూ కారాదు. అట్లని కర్మలను చేయుట మానరాదని అర్థం.
Also Read: స్వర్గానికి షార్ట్ కట్! రూట్ మ్యాప్ క్లియర్‌గా ఉందిగా!
Also Read: ఫెంగ్‌షుయ్ ప్రకారం ఆ రెండు బొమ్మలు ఇంట్లో ఉంటే భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుందట
Also Read: కిచెన్లో పూజామందిరం పెట్టేశారా... దేవుడి మందిరం ఎక్కడ ఉండాలి..ఎక్కడ ఉండకూడదు...
Also Read: ఔను.. అది రాముడి కట్టిన వారధి ! నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టిందంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Ratha Sapthami 2023 Slokas: రథసప్తమి రోజు తప్పనిసరిగా చదువుకోవాల్సిన శ్లోకాలు
Ratha Saptami 2023 Wishes In Telugu: జనవరి 28 శనివారం రథసప్తమి సందర్భంగా శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి
Love Horoscope Today 28th January 2023: ఈ రాశులవారి వైవాహిక జీవితంలో టెన్షన్ తప్పదు
Horoscope Today 28th January 2023: ఏదైనా భిన్నంగా చేసే అలవాటు ఈ రాశివారిని ప్రత్యేకంగా నిలుపుతుంది, జనవరి 28 రాశిఫలాలు
Antarvedi Utsavalu : జనవరి 28 నుంచి అంతర్వేది కల్యాణ మహోత్సవాలు
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?
Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!
Waltair Veerayya Success Event : వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభలో అపశృతి, తొక్కిసలాటలో పలువురికి గాయాలు